Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

నారారోహిత్ తో ఇంటర్వ్యూ

interview with nara rohit
ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌డానికి నేనూ రెడీ! - నారా రోహిత్

నేను హీరోని... ఆరు పాట‌లూ, నాలుగు ఫైట్లుండాల్సిందే - అనే లెక్క‌లేసుకోడు నారా రోహిత్‌.
అందుకే  అత‌న్నుంచి బాణం, ప్ర‌తినిధిలాంటి సినిమాలొచ్చాయి. అయితే... మాస్ హీరోపై మ‌మ‌కారం ఉంటుంది క‌దా?  అందుకే తుంట‌రి, సావిత్రి లాంటి క‌థ‌లు ట్రై చేశాడు. అయితే అందులోనూ ఏదో కొత్త‌గా చెబుదామ‌న్న ప్ర‌య‌త్నం అయితే క‌నిపించింది.  మొత్తానికి త‌న ప్ర‌య‌త్నాల ప‌రంగా లోపాలు లేకుండా జాగ్ర‌త్త‌గానే ఉంటున్నాడు. కావ‌ల్సింద‌ల్లా ఓ సూప‌ర్ హిట్టు. క‌నీసం హిట్టు ప‌డినా... నారా రోహిత్ కెరీర్ ఎక్క‌డికో వెళ్లిపోతుంది. ఆ ప్ర‌య‌త్నంలో భాగంగా చేసిన చిత్ర‌మే... రాజా చేయివేస్తే. ఈ సినిమా ఇప్పుడు థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. ఈసందర్భంగా నారా రోహిత్‌తో గో.తెలుగు చేసిన చిట్ చాట్ ఇది. 

* రాజా చేయివేస్తే.. ఎలాంటి సినిమా
- ఇదో థ్రిల్ల‌ర్ అనుకోవొచ్చు. ట‌ర్న్స్ అండ్ ట్విస్ట్స్ కొత్త‌గా ఉంటాయి. ఓ కొత్త‌ర‌కం సినిమా చూశామ‌న్న ఫీలింగ్ ఉంటుంది.

* ఈ సినిమాలో ఏం చేస్తుంటారు?
- దర్శ‌కుడ్ని అవ్వాల‌నుకొనే కుర్రాడిగా క‌నిపిస్తా. నాకైతే చాలా ఛాలెంజింగ్ రోల్‌.

* తాక‌ర‌త‌త్న‌లో ఢీ అంటే ఢీ అనే పాత్ర‌లో న‌టించ‌డం...
- నాకే చాలా స‌ర్‌ప్రైజ్‌గా ఉంది. త‌ను చాలామంచి యాక్ట‌ర్‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ స‌రైన బ్రేక్ రాలేదు. అమ‌రావ‌తిలో చాలా బాగా చేశాడు. ఆ సినిమాలో కంటే.. ఇందులో తార‌క్ పాత్ర చాలా బాగుంటుంది.

* ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తున్నారు.. మీకైనా క్లారిటీ ఉంటోందా?
- ఎందుకు ఉండ‌డం లేదండీ. భ‌లేవారే. ఏ సినిమాకాసినిమానే. ప్ర‌తీ సినిమాలోనూ నా పాత్ర‌లో ఏదో ఓ కొత్త‌ద‌నం క‌నిపిస్తుంటుంది. కాబ‌ట్టి.... నాకు ఎలాంటి క‌న్‌ఫ్యూజ‌న్లూ ఉండ‌వు.

* స‌క్సెస్‌లూ చూసుకోవాలిగా..
- తుంట‌రి, సావిత్రి సినిమాల‌పై బాగా హోప్స్ పెట్టుకొన్నా. రెండూ మంచి క‌థ‌లు. కానీ ఎక్క‌డో తేడా కొట్టాయి.

* ఫ్లాప్స్ బాధించ‌వా?
- బాధ‌ప‌డేంత తీరిక లేదండీ. మీరే చూస్తున్నారు క‌దా, సినిమా త‌ర‌వాత సినిమా చేసుకొంటూ వెళ్లిపోతున్నా. క‌థ వింటున్న‌ప్పుడు బాగుందో లేదో జ‌డ్జ్ చేయ‌గ‌లం. ఒక్క‌సారి సినిమా బ‌య‌ట‌కు వెళ్లిపోయిన త‌ర‌వాత ఫ‌లితం ఎలా ఉండ‌బోతోందో ఊహించ‌డం క‌ష్టం. మ‌న ఎఫెక్ట్ వ‌ర‌కూ.. ఏలోటూ రాకుండా చూసుకోవాలి. నేను చేస్తోంది అదే.

* మాస్ హీరోగా నిరూపించుకోవాల‌ని త‌ప‌న‌.. కొత్త క‌థ‌లు చేయాల‌న్న ఆలోచ‌న. రెండింటిలో దేనివైపు మొగ్గుచూపుతారు?
- మాస్ హీరోగా నిరూపించుకోవాల‌నే కోరిక అంద‌రికీ ఉంటుంది. నాకూ ఆ కోరిక ఉంది. కాక‌పోతే.. రొటీన్ క‌థ‌ల్ని ఎంచుకోకూడ‌దు. మంచి క‌థ‌ల‌తోనూ మాస్‌ని మెప్పించొచ్చు. సావిత్రి, తుంట‌రి అలాంటి ప్ర‌య‌త్నాలే. ఆ రెండు సినిమాలూ హిట్ట‌యితే బాగుణ్ణు. 

* బాగా లావైపోతున్నారేమో...
- అవునండీ.. త‌గ్గించే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టా. కానీ ఆ ప్రోసెస్ చాలా స్లోగా జ‌రుగుతోంది. స‌డ‌న్‌గా త‌గ్గిపోవ‌డం కూడా మంచిది కాదు క‌దా?  ఓ ఆరు నెల‌లు సినిమాల‌న్నీ మానేసి స‌న్న‌బ‌డాలి. కానీ నా ద‌ర్శ‌కులు ఆ అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. త‌రువాతి సినిమాకి త‌ప్ప‌కుండా స‌న్న‌బ‌డ‌తా చూస్తూనే ఉండండి.

* ప్ర‌తినాయ‌కుడిగా న‌టించ‌మని ఎవరైనా అడిగారా?
- ఇప్ప‌టి వ‌ర‌కూ లేదండీ.

* ఆ అవ‌కాశం వ‌స్తే...
- పాత్ర బాగుండి ఆ క‌థ‌కు నేను న్యాయం చేస్తాన‌నుకొన్న‌ప్పుడు ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌డానికి కూడా నేను రెడీ.

* పూరి జ‌గ‌న్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నార‌ట‌
- అలాంటిదేం లేదండీ. ఆ వార్త ఎలా పుట్టిందో కూడా నాకు తెలీదు. నిజంగా ఆ ఆఫ‌ర్ వ‌స్తే.. సంతోష‌మే క‌దా?

* చేతిలో ఉన్న సినిమాలేంటి?
- అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, పండ‌గ‌లా వ‌చ్చాడు సినిమాలు దాదాపుగా సిద్ధ‌మ‌య్యాయి. జ్యో అత్యుతానంత‌, క‌థ‌లో రాజ‌కుమారి సెట్స్‌పై ఉన్నాయి. క‌థ‌లో రాజ‌కుమారికి ఇళ‌య‌రాజాగారు సంగీతం అందిస్తున్నారు. ఆ సినిమాకి ద‌క్కిన గొప్ప గౌర‌వం అది.

* ఫైన‌ల్‌గా రాజా చేయివేస్తే గురించి ప్రేక్ష‌కుల‌కు ఏం చెబుతారు?
- ఓ కొత్త సినిమా చూశామ‌న్న అనుభూతి మాత్రం క‌లుగుతుంది. ఆ విష‌యంలో ఈ సినిమా మిమ్మ‌ల్ని ఏమాత్రం నిరుత్సాహ‌ప‌ర‌చ‌దు. ఆ గ్యారెంటీ నాది.

* ఓకే... ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ 

- కాత్యాయని
 
మరిన్ని సినిమా కబుర్లు
raja cheyyi vesthe movie review