Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

సమంతతో ఇంటర్వ్యూ

interview with samanta

అలాంటి రూమ‌ర్లు నాకు అల‌వాటైపోయాయి  - స‌మంత‌

స‌మంత క్లారిటీ ఉన్న పిల్ల‌.
దాప‌రికాల్లేవు. దాగుడు మూత‌లు అంత‌కంటే లేవు.
మ‌న‌సులో ఏదుంటే అది మాట్లాడేస్తుంది.
గాసిప్పులకు భ‌య‌ప‌డ‌దు.. లొంగ‌దు.
నేను పెళ్లి చేసుకోబోతున్నా - అని మీడియా ముందే చెప్పేసింది
ఓ హీరోని ల‌వ్వాడుతున్నా - అని హింట్ ఇచ్చేసింది

ఇంత కంటే డేరింగ్ డాషింగ్ హీరోయినిజం ఎక్క‌డ ఉంటుంది?


ఈ స‌మ్మ‌ర్ అంతా స‌మంత‌దే. 24 తో హిట్టు కొట్టింది. బ్ర‌హ్మోత్స‌వం నిరాశ ప‌రిచినా ఇప్పుడు అ.ఆతో అల‌రిస్తోంది. ఈ సంద‌ర్భంగా స‌మంత‌తో గో తెలుగు జ‌రిపిన చిట్ చాట్ ఇది.

* హాయ్ స‌మంత‌...
- హాయండీ...

* ఈ స‌మ్మ‌ర్ అంతా మీరే క‌నిపిస్తున్నారు..
- (న‌వ్వుతూ) అవును. నా కెరీర్‌లో ఇదో స్పెష‌ల్ స‌మ్మ‌ర్‌.  24, బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అ.ఆ. ఈ స‌మ్మ‌ర్ అంతా మీడియాకు ఇలా ఇంట‌ర్వ్యూలు ఇస్తూనే ఉన్నా. ఇంకొన్నాళ్ల పాటు మీకు క‌నిపించ‌ను లెండి.. నో ప్రాబ్ల‌మ్‌

* 24, బ్ర‌హ్మోత్స‌వం రిజ‌ల్ట్‌పై మీ కామెంట్స్ ఏంటి?
- 24 కి యునానిమ‌స్‌గా హిట్ టాక్ వ‌చ్చింది. తెలుగు, త‌మిళం... రెండు చోట్లా బాగా ఆడింది. ఓ కొత్త క‌థ‌, ప్ర‌యోగాత్మ‌క చిత్రం 24. దానికి ఇంత మంచి స్పంద‌న వ‌చ్చిందంటే ఆనందంగా ఉంది. భ‌విష్య‌త్తులో ఇలాంటి సినిమాలు మ‌రిన్ని చేయ‌డానికి ఇది బూస్ట‌ప్ గా నిలుస్తుంది.

* బ్ర‌హ్మోత్స‌వం మాటేంటి?
- ఫ‌లితం నిరాశ ప‌రిచిన మాట వాస్త‌వ‌మే. అయితే.. అందులోంచి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌కు రావాలి. ప్రేక్ష‌కులు ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు. మ‌నం దాని గురించి ఎక్కువ‌గా చింతించ‌కూడ‌దు. 

* సినిమా ఫ్లాప్ అయితే మీ పీలింగ్స్ ఎలా ఉంటాయి?
- ఫ్లాప్స్‌ని టేక్ ఇట్ ఈజీగా తీసుకొనే మ‌న‌స్త‌త్వం కాదు నాది. నిజంగానే ఫీల‌వుతా. కాక‌పోతే దాని వ‌ల్ల లాభం లేద‌ని తెలుసు. ఎంత త్వ‌ర‌గా దాన్నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే అంత మంచిది. బ్ర‌హ్మోత్స‌వం త‌ర‌వాత అ.ఆ రావ‌డం సంతోషంగా ఉంది. ఎందుకంటే... అ.ఆ నాకు త‌ప్ప‌కుండా ఓ పెద్ద బ్రేక్ ఇస్తుంద‌ని నాకు ముందే తెలుసు.

* సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప్ అవుతుంటే ఐరెన్‌లెగ్ ముద్ర ప‌డిపోతుంద‌న్న బెంగ మీకు ఉంటుందా?
- న‌న్నేమంటారు అన్న‌ది ముఖ్యం కాదు. ఓ సినిమా బాగా ఆడితే అంద‌రికీ మంచి జ‌రుగుతుంది. బాగా ఆడ‌క‌పోతే అంద‌రూ న‌ష్ట‌పోతాం. ఇక మీర‌న్న ఐరెన్ లెగ్ అన్న‌ది అద‌నం మాత్ర‌మే. అయితే నేను అలాంటి విష‌యాల‌కు భ‌య‌ప‌డ‌ను.

* అ.ఆ విష‌యానికొద్దాం.. త్రివిక్ర‌మ్‌తో మళ్లీ మ‌ళ్లీ సినిమాలు చేస్తున్నారు. ఆ ర‌హ‌స్యం ఏమిటి?
- నేను ఆయ‌న‌కు ట్యూన్ అయ్యా.. ఆయ‌న నాకు ట్యూన్ అయ్యారు,. అంతకంటే ఏముంది?  ఓ న‌టిగా ఆయ‌న న‌న్ను గౌర‌విస్తారు. ఓ ద‌ర్శ‌కుడిగా ఆయ‌నంటే నాకు అభిమానం. అందుకే మా ఇద్ద‌రి కాంబినేష‌న్ ఇలా కుదురుతుంది.  అయితే ఒక్క‌టి మాత్రం క‌చ్చితంగా చెప్ప‌గ‌లను. ఎంత త్రివిక్ర‌మ్ అయినా క‌థ నచ్చ‌క‌పోతే నేను చేయ‌ను. ఓ మంచి క‌థ‌తో, మంచి పాత్ర‌తో నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు కాబ‌ట్టి.. ఆయ‌న‌కు నో చెప్ప‌లేక‌పోతున్నా.

* అ.ఆ, బ్ర‌హ్మోత్స‌వం లాంటి సినిమాలు చేస్తున్న‌ప్పుడు కుటుంబంతో మీకున్న అనుబంధాలు గుర్తొస్తుంటాయా?
- ఎందుకు గుర్తుకురావు. పైగా నేను ఎమోష‌న‌ల్ ఫెలోని. నాకు బాగా గుర్తొస్తాయి.

* ఇంత‌కీ మీరు అమ్మ‌కూచీనా, నాన్న‌కూచీనా?
- నాన్నంటే నాకు చిన్న‌ప్ప‌టి నుంచీ భ‌యం. ఆయ‌న చాలా స్ట్రిక్టు. క్ర‌మ‌శిక్ష‌ణ ద‌గ్గ‌ర మ‌హా మొండిగా ఉంటారు.  అమ్మ ద‌గ్గ‌రే చ‌నువు ఉంది. నాన్న‌కు కోపం ఇట్టే వ‌చ్చేస్తుంది. కానీ అమ్మ ఓర్పుతో అన్నీ స‌ర్దుకుపోతుంది.

* మీక్కూడా అదే ఓర్పు వ‌చ్చిందా?
- లేదు. నేను తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకొంటుంటా. అమ్మ అంత పొందిగ్గా ఉండ‌ను. ఒట్టి అల్ల‌రి పిల్ల‌ను.

* తెలుగులో క‌థానాయిక పాత్ర‌ల‌కు అంత ప్రాధాన్యం లేదంటుంటారు.. ఓ నాయిక‌గా మీరూ ఒప్పుకొంటారా?
- అలాంటి సినిమాలు అరుదుగా వ‌స్తున్నాయి. ప‌ది సినిమాలొస్తే అందులో క‌థానాయిక‌కు ప్రాధాన్యం ఇచ్చిన సినిమా ఒక్క‌టుంటుందంతే. అయితే ఈ విష‌యంలో నేను ఎవ‌రిపైనా ఫిర్యాదు చేయ‌ను. మ‌న ద‌గ్గ‌రా మంచి సినిమాలొస్తున్నాయి. మ‌న క‌థ‌లూ మారుతున్నాయి. క్ర‌మంగా క‌థానాయిక పాత్ర‌కు ప్రాధాన్యం ఇచ్చే రోజులు వ‌స్తాయి.  

* హీరోల డామినేష‌న్ అంటే మీరు ఒప్పుకొంటారా?
- ఆధిప‌త్య పోరు అన్న‌ది ఎప్పుడో పోయింది. ఇప్పుడంతా పోటీ త‌త్వ‌మే. ఒక‌రిపై మ‌రొక‌రు పోటీ ప‌డుతూ ఎద‌గాలి. అది మ‌గాడితో అయినా.. ఆడ‌దానితో అయినా.

* మీ మ‌ధ్య గాసిప్పులు బాగా వ‌స్తుంటాయి.. వాటిపై మీ స్పంద‌న‌?
- అలాంటి రూమ‌ర్లు చ‌ద‌వి చ‌దివి నాకూ అల‌వాటైపోయాయి. ప్ర‌తీ రోజూ ఏదో ఓ రూపంలో నా పేరు, నా ఫొటో పేప‌ర్‌కెక్కుతోంది. జ‌న‌తా గ్యారేజ్ వ‌ర‌కూ నేను పేప‌ర్లో క‌న‌ప‌డనే అనుకొంటున్నా.

* మొన్నామ‌ధ్య పెళ్లి చేసుకొంటా అన్నారు..
- ఇప్పుడూ అదే అంటున్నా.. త్వ‌ర‌లో పెళ్లి చేసుకొంటా.

* ఆ పెళ్లి కొడుకు ఎవ‌రో చెప్పేస్తే మాకు టెన్ష‌న్ త‌ప్పుతుంది క‌దా?
- త‌ప్ప‌కుండా చెబుతా. దానికోసం ప్ర‌త్యేకంగా ఓ ప్రెస్ మీట్ పెడ‌తా. అప్పుడు మాట్లాడుకొందాం.

* అయితే ఆ ప్రెస్ మీట్ కోసం ఎదురుచూస్తాం..
- (న‌వ్వుతూ).. ఓకే అలానే కానీయండి.

* ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ సో మ‌చ్‌...


- కాత్యాయని  

మరిన్ని సినిమా కబుర్లు
aa..aaa...movie review