Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aa..aaa...movie review

ఈ సంచికలో >> సినిమా >>

క్లాస్‌గా కొట్టేస్తానంటున్న చైతూ

chaitu as comming class look

క్లాస్‌ లుక్‌లో 'ఏమాయ చేశావె' సినిమాతో తెరంగేట్రం చేశాడు నాగచైతన్య. ఆ తరువాత క్లాస్‌ లుక్‌ నుండి, మాస్‌ లుక్‌ ట్రై చేసి మాస్‌ హీరో అన్పించుకోవాలని చాలా ట్రై చేశాడు. కానీ ఆ ట్రైల్స్‌ ఏమీ పని చేయలేదు. చైతూని మాస్‌లుక్‌లో చూసేందుకు జనం ఇష్టపడలేదు. సో మాస్‌ కోసం ట్రై చేసిన సినిమాలన్నీ చైతూకి అపజయాల్ని మిగిల్చాయి. 'తడాఖా' ఒక్కటే మాస్‌ హిట్‌ అయ్యింది. 'బెజవాడ', 'ఆటోనగర్‌ సూర్య' చిత్రాలు బాగా నిరాశపరిచాయి. అందుకే ఇక తనకి మాస్‌ లుక్‌ సూటు కాదనుకున్నాడో ఏమో రూటు మార్చాడు. మళ్లీ క్లాస్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' అనే సినిమాతో వస్తున్నాడు.

ఈ సినిమాలో చైతూ చాలా క్లాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. యాక్షన్‌ అండ్‌ రొమాంటిక్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు పోజిటివ్‌ టాక్‌ వస్తోంది. 'జీవితంలో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి' అని చైతూ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ అదుర్స్‌ అనిపించేలా ఉంది. అంతేకాదు ఈ సినిమాలో చైతూ హీరోయిన్‌ చేత చెంపదెబ్బ తినే సాహసం కూడా చేశాడు. ఈ సినిమాలో చైతూకి జోడీగా మంజిమ మోహన్‌ నటిస్తోంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ అందించారు. అనేక రకాల సాహసాలతో వస్తున్న ఈ సినిమా చైతూకి ఖచ్చితంగా విజయాన్ని తెచ్చిపెట్టాలని ఆశిద్దాం! 

మరిన్ని సినిమా కబుర్లు
puri - kalyan ram first look superb