Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
NTR janata garage ready for release

ఈ సంచికలో >> సినిమా >>

పవన్‌ చెయ్యేస్తే అంతే మరి

pavan hand power

పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో నటించిన హీరోయిన్స్‌కు ఆటోమేటిగ్గా పాపులారిటీ వచ్చేస్తుంది. ఎప్పుడో 'కాంచనమాల కేబుల్‌ టీవీ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన లక్ష్మీరాయ్‌ని తెలుగు ప్రేక్షకులు అప్పుడే మర్చిపోయారు. మళ్లీ ఇప్పుడే ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఇదంతా పవన్‌ మహిమే. 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' సినిమాలో ఐటెం సాంగ్‌లో తళుక్కున మెరిసింది లక్ష్మీ రాయ్‌. పవన్‌ పక్కన 'తోబా తోబా..' అంటూ వేసిన స్టెప్పులతోనే ఆమె మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

అప్పటినుండీ ఆమెకు అవకాశాలు తన్నుకొస్తున్నాయి. బాలీవుడ్‌లో ఎప్పట్నుంచో నానుతున్న 'జూలీ 2' సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా ఫిక్స్‌ అయ్యింది. ఈ సినిమాలో అమ్మడి అందాలు బికినీలో దర్శనం కానున్నాయట. అందుకోసం ఈ ముద్దుగుమ్మ తన స్ట్రెక్చర్‌ని కొంచెం మార్చుకోవాల్సి వచ్చిందట. మొదట్లో సన్నగా మెరపు తీగలా ఉన్న అమ్మడు ఈ మధ్య కొంచెం బొద్దుగా, భారీగా తయారయ్యింది. అలా ఉన్నా ఈ ముద్దుగుమ్మ మరింత హాట్‌గా కనిపిస్తోంది. అయితే ఐటెం సాంగ్‌కి ఈ భారీ అందాలు సరిపోయాయి.

కానీ బికినీకి మాత్రం కొంచెం తగ్గాలని ఆ సినిమా డైరెక్టర్‌ సూచించగా తన బరువులో దాదాపుగా 10 కేజీల బరువును తగ్గించుకుని నాజూగ్గా తయారయిపోయింది లక్షీరాయ్‌. ఇప్పుడు ఆమె ఫిజిక్‌కి బాలీవుడ్‌లోనే కాదు తెలుగు, తమిళంలో కూడా అవకాశాలు తన్నుకొస్తున్నాయ్‌. హీరోయిన్‌గానే కాకుండా ఏ క్యారెక్టర్‌కైనా లక్ష్మీరాయ్‌ సై అంటోంది. కాబట్టి ఏదో ఒక రకంగా ప్రేక్షకులను ఈమె అందం మెప్పిస్తూనే ఉండనుందన్న మాట. 

మరిన్ని సినిమా కబుర్లు
mega prince with malayalam beauty