Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
balayya as former

ఈ సంచికలో >> సినిమా >>

ఇలియానా బాగా మారిపోయింది

iliyana has changed

ఇలియానా హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్‌ మూవీ 'రుస్తుం' ట్రైలర్‌ విడుదలయ్యింది. ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇలియానాకి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించిందట. దాంతో రెచ్చిపోయి నటించిందట. ట్రైలర్‌లో కూడా ఇలియానా నటన గురించ మాట్లాడుకుంటున్నారు అంతా. చాలా అద్భుతంగా నటించిందట ఇలియానా. ఇంతవరకూ ఇలియానా పని అయ్యిపోయింది అనుకున్న వాళ్లంతా ఇలియానా ఈజ్‌ బ్యాక్‌ అనుకుంటున్నారట.

దీంతో ఆమెకు మళ్లీ బాలీవుడ్‌లో క్రేజ్‌ పెరిగిపోయేలా ఉంది. సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉండడంతో ముద్దుగుమ్మ ఇలియానాకి కూడా కెరీర్‌ పట్ల మళ్లీ కాన్ఫిడెన్స్‌ వచ్చేసిందట. దాంతో ఇంతకు ముందు వరకూ ఏదో ఒకటి చేసి తనను మర్చిపోయిన ప్రేక్షకులకు దగ్గరవ్వాలనుకున్న ఇలియానా, ఇప్పుడు తన మనసు మార్చుకుంది. అవకాశాలే తనను వెతుక్కుంటూ వస్తాయి. తను అవకాశాల కోసం ఎదురు చూడకూడదు అని డిసైడ్‌ అయ్యిపోయిందట. మొత్తానికి ఇలియానా దశ ఈ సినిమాతో తిరిగేలానే ఉంది. ఏమో దశ తిరిగి మళ్లీ ఇలియానా ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చేసినా రావచ్చు. క్రేజ్‌ విషయంలోనే కాదు ఫిజిక్‌ విషయంలో కూడా ఆమెకున్న పాపులారిటీ అంత గొప్పది మరి. కీప్‌ ఇట్‌ అప్‌ ఇలియానా. 

మరిన్ని సినిమా కబుర్లు
allarodu on speed