Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kathaa sameekSha

ఈ సంచికలో >> శీర్షికలు >>

08-072016 నుండి 14-07-2016 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద ఆరభం బాగుంటుంది ప్రయాణాలు చేయటకు అవకాశం ఉంది వాటిమూలన గతకొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేసే అవకాశం కలదు. పెద్దలనుండి మీరుచేసిన పనులకు గాను ప్రశంశలు పొందుతారు. ఆర్థికపరమైన విషయల్లో మాత్రం అసంతృప్తి కొనసాగుతుంది వేచిచూసే దొరని అవసరం. దైవసంభందమైన పూజలకు సమయం ఇవ్వండి. కాకపోతే మానసికంగా దృడంగా ఉండి  వెళ్ళడం చేత మంచి  ఫలితాలు పొందు అవకాశం కలదు. మృష్టాన్నభోజనప్రాప్తిని కలిగి ఉంటారు. మిత్రులతో కలిసి సరదాగా విహరయాత్రలకు వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రావోచ్చును ప్రయాణాల్లో కొంత ఖర్చులు ఊహించిన దానికన్నా పెరుగుతాయి. 

 

వృషభ రాశి :ఈవారం మొత్తంమీద పెద్దలతో ఒప్పందభాగస్వామ్య చర్చలకు సమయం ఇస్తారు అలాగే నూతన నిర్ణయాలు కలిగి ఉంటారు. తలపెట్టిన పనులను పూర్తిచేయుటలో స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది కావున చక్కటి ప్రణాళికను కలిగి ఉండుట మంచిది. సోదరసంభందమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దల నుండి తోడ్పాటు అందుటకు అవకాశం కలదు వారి సూచనలు పాటించే ప్రయత్నం చేయండి. అనవసరమైన చర్చలకు సమయం ఇస్తారు , వ్యతిరేకవర్గం నుండి వచ్చు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే ఆస్కారం కలదు. కుటుంభంలో సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు అలాగే దైవసంభందమైన కార్యక్రమాలకు సమయం ఇస్తారు.

                       

మిథున రాశి :   ఈ వారం మొత్తంమీద మీయొక్క ఆలోచనలను ఆత్మీయులతో పంచుకొనే అవకాశం కలదు. తలపెట్టిన పనులపైన ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటె తప్పక అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం కలదు. బంధుమిత్రుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. బందుమిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది అలాగే వారితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సూచనలతో ముందుకు వెళితే లబ్దిని పొందుతారు. ఉద్యోగంలో బాగుంటుంది మీ ఆలోచనలు అధికారులకు తెలియజేయుట వలన ఆశించిన విధంగా గుర్తింపును పొందుటకు అవకాశం కలదు.    

 

 

కర్కాటక రాశి :  ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. అధికారుల నుండి నూతన సమాచారం అందుతుంది వాటిమూలాన లబ్దిని పొందుటకు అవకాశం కలదు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని గడుపుతారు. సోదరవర్గం నుండి మాటపడవలసి రావోచ్చును సర్దుబాటువిధానం మంచిది అలాగే మీ ఆలోచనలు వరైఇ తెలియజేయండి. పనుల్లో శ్రమను పొందినను చివరలో ఆశించిన విధంగా ఫలితాలు రావడానికి ఆస్కారం కలదు. కుటుంభ సభ్యులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. 

 

           
సింహ రాశి : ఈ వారం మొత్తంమీద అధికారుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడుల గురుంచి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. స్త్రీ సంభందమైన విషయాల్లో నిదానంగా ఉండుట సూచన. అనవసరమైన విషయాలకు సమయం ఇవ్వడం మూలాన నష్టపోయే అవకాశం లేదు. ఏదైనా పనులను చేపట్టుటకు ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుట వలన చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. ఒకవార్త మాత్రం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే ఆస్కారం కలదు కావున మానసికంగా దృడంగా ఉండుట సూచన. కుటుంభంలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయానికి ప్రయత్నం చేస్తారు ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చును. 

 

కన్యా రాశి :  ఈ వారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయాల్లో మీరు తీసుకొనే నిర్ణయాలు చాలామార్పులకు అవకాశం ఇస్తుంది కావున బాగాఆలోచించి ముందుకు వెళ్ళండి. తలపెట్టిన పనులను ఆలస్యంగా పూర్తిచేస్తారు పనిలో ఫలితం ఆశించిన దానికన్నా కొంతమేర తగ్గుటకు ఆస్కారం కలదు. పెద్దలతో చర్చలు సాధ్యమైనంత వరకు వాయిదా వేయుట సూచన. దైవసంభందమైన పూజలకు సమయం ఇవ్వండి. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు. కుటుంభంలో వచ్చిన మార్పుల విషయంలో సర్దుబాటు అవసరం మార్పును  స్వాగతించే ప్రయత్నం చేయండి. దూరప్రదేశం నుండి వచ్చిన వార్తల మూలాన ఆందోళనకు గురయ్యే అవకాశం కలదు జాగ్రత్త. ప్రయాణాలు చేయునపుడు  విలువైన సూచనలు పాటించుట మంచి చేస్తుంది. 

 

   

తులా రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు చేపట్టుటకు అవకాశం ఉంది. కుటుంభంలో పెద్దల నుండి లేదా మీ శ్రేయోభిలాషుల నుండి వచ్చు సూచనలను పరిగణలోకి తీసుకోండి దాని మూలాన మేలుజరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయుట మంచిది. మాటను నిదానంగా వాడుట నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మరింత మేలుజరుగుతుంది,వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రమాదకరమైన వస్తువులతో పనిచేయునపుడు నిదానంగా వ్యవహరించుట సూచన.సోదరవర్గం నుండి నూతన విషయాలు తెలుసుకొనే ఆస్కారం కలదు. కుటుంభంలో మార్పులు ఆశిస్తారు ఓపిక అవసరం.       

    

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తుల నుండి నూతన సమాచారం సేకరిస్తారు. గతకొంత కాలంగా మీ మనసులో ఉన్న ఆలోచనలను అమలుచేసే దిశలో అడుగులు ముందుకు వేస్తారు. ఆర్థికపరమైన విషయల్లో బాగుంటుంది. నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు ముందు కాస్త ఆలోచన చేయుట వలన మరింత లబ్దిని పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుండి అభినందనలు వస్తాయి,తోటివారి నుండి ఆశించిన స్థాయిలో సహాకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ద వహించుట మంచిది ఆజాగ్రత్త వద్దు సమయానికి భోజనం చేయుట సూచన. వ్యతిరేకవర్గం నుండి స్వల్ప ఇబ్బందులు తప్పక పోవచ్చును వాటిని దైర్యంగా ఎదుర్కొనే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయంలో నూతన విధానాలు అమలుచేసే ప్రయత్నం మొదలు పెడతారు.    

 

ధనస్సు రాశి  :  ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును వేచిచూసే దోరణి మంచిది. మాటతీరు మూలాన నూతన సమస్యలు పొందుతారు నిదానంగా వ్యవహరించుట సూచన మిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోండి. ప్రతిపనిలోను స్వల్ప ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది కావున మానసికంగా దృడంగా ఉండుట సూచన అధికమైన ప్రయత్నం చేయుట ద్వార కొంతమేరనైనా ఫలితాలువస్తాయి. ఉద్యోగంలో అధికారులతో మంచిసంభందాలు ఏర్పడుటకు ఆస్కారం కలదు వారి సూచనలు పాటించుట ఉత్తమం. వాహనముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. దూరప్రదేశం నుండి విన్న ఒక వార్త కొన్ని మార్పులను ఇస్తుంది. 

   

మకర రాశి  :  ఈవారం మొత్తంమీద సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు అలాగే నిర్ణయాలు చేయకండి. కుటుంభసభ్యులతో కలిసి సమయాన్ని ఇష్టమైన వాటికి కేటయిస్తారు. తలపెట్టిన పనుల విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండుట అనేది మేలుచేస్తుంది. ప్రయాణాలకు సమయం ఇస్తారు కాకపోతే అధికమైన శ్రమను పొందుటకు అవకాశం కలదు. మిత్రులతో కలిసి చర్చాసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు. అధికమైన ఆలోచనలకు అనవసరమైన నిర్ణయాలకు దూరంగా  ఉండుట సూచన. అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు చేయడం మంచిది. నలుగురిలో ఉన్నప్పుడు వారి ఆలోచనల ప్రకారం నడుచుకొనే  ప్రయత్నం వలన విభేదాలు తగ్గుతాయి. తోటివారికి హామీలు ఇచ్చే విషయంలో జాగ్రత్త అవసరం లేకపోతే సమాధానం చెప్పవలసి రావోచ్చును జాగ్రత్త. 

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద సామజిక కార్యక్రమాలకు సమయం ఇస్తారు. మీ ఆలోచనల మూలాన నలుగురికి సహాయం జరుగుతుంది గుర్తింపును పొందుతారు. పెద్దల నుండి వచ్చు సూచనలు మీకు లబ్దిని కలుగజేయుటకు అవకాశం ఉంది. కుటుంభంలో ఆశించిన విధంగా మార్పులు రావడానికి అవకాశం కలదు సంతృప్తిని పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంది ఆ దిశగా ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రయాణాలు వాయిదావేయుట ఉత్తమం తప్పనిసరి అయితే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట మంచిది. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారితో కలిసి విందుల్లో పాల్గొనే ఆస్కారం కలదు. అనుకోని ఖర్చులు పెరుగుటకు ఆస్కారం కలదు నూతన వస్తువలను కొనాలనే ఆలోచన వాయిదా వేయండి. 

 

 

మీన రాశి :  ఈవారం మొత్తంమీద బంధుమిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం కలదు వారినుండి విలువైన విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది పెట్టుబడులకు సంభందించి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. దూరప్రదేశం నుండి వచ్చు వార్తలు మిమ్మల్ని ఒకింత సంతోషానికి గురిచేస్తాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. ఇష్టమైన వ్యక్తుల నుండి సమాచరం సేకరించే అవకాశం కలదు నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. అనారోగ్యం వలన సమస్యలు తప్పవు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరంభంలో తడబడినా వెంటనే కోలుకొని పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. 

మరిన్ని శీర్షికలు
mulakkaada rasam