Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

 

గతసంచికలో ఏం జరిగిందంటే .... http://www.gotelugu.com/issue169/482/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

 

‘‘నేనే మీ చెంత నుండ అంత శ్రమ మీకేల ప్రభూ. మీకు శ్రమ కలుగనిత్తునా. దివ్య నాగ మణులు మా తండ్రి గారి మందిరమున ఒక స్వర్ణ పేటికలో ఉన్నవి. సదా నాగ బంధముతో బీగము వేయ బడి యుండును. ఎలాగో ఆ బీగము తెరిచి మీ కొరకు ఒక దివ్య నాగ మణి ని గొని వచ్చెదను. ఇట నుండే రత్న గిరికి పోవుదము.’’

‘‘అది సరి కాదు సఖీ. అలా చేయ తగదు.’’ అన్నాడు వెంటనే ధనుంజయుడు. ‘‘ఇప్పుడు నీవు నా హృదయేశ్వరివి. నా మూలముగా నీవు నీ తండ్రి శాపమునకు గురవుట అంగీకరించను. నీతో బాటు దివ్య నాగ మణి ని కూడ నీ తండ్రి గారిని మెప్పించి ఒప్పించి వారి అనుమతి తోనే రత్న గిరి గొని పోయెద. నాగ లోకము పోవునుపాయము తెలిపిన చాలును.’’

‘‘అటులయిన వేరే ఉపాయమే. నేనే మీ వెంట వచ్చి మార్గము చూపెదను.’’

‘‘అనగా నేమి? నీవు వెనక్కు వెళ్ళవా?’’

‘‘వెళ్ళను. మీతోనే నేను.’’

‘‘మాతో నీవెందుకు ప్రియా. అడువుల శ్రమ పడుట...’’

‘‘చెప్పితిని గదా. మీ శ్రమ నాది కాదా. లోకము తల్ల క్రిందులయినను, నా తండ్రి వచ్చి బిలిచినను నేను మిమ్ము విడిచి వెళ్ళను.’’ అంటున్న ఉలూచీశ్వరిని మరో సారి కౌగిట బంధించాడు ధనుంజయుడు.

‘‘నా జనకుని బాధ చూడ లేక వారి పుట్ట వ్రణమును బాపుటకై రాజ వైద్యుల సలహా మేరకు దివ్య నాగ మణి కోసం దారే తెలియని నాగ లోకమునకు ఒంటరిగ బయల్వెడలితిని. అటు వంటి నాకు మార్గమున ముందుగా రెండు ఆణి ముత్యములు లభించినవి. ఒకటి భద్రా దేవి, రెండు నీవు. ఇక దివ్య నాగమణి లభించిన చాలును. మనము రత్న గిరి వెళ్ళి పోవచ్చును.’’ అన్నాడు.

‘‘తప్పక లభించ గలదు సఖా. నను ఆదరించిన మీ సహృదయానికి కానుకగా దివ్య నాగ మణి తప్పక లభించగదు. నా జనకుని మెప్పించ గల సమర్థత తమకున్నది.’’ అంటూ బిగియార కౌగిలించి ముద్దాడింది.

బిగి కౌగిట పరవశంలో`

కొద్ది సేపు అలానే వుండి పోయారు.

అంతలో ఎవరో వస్తున్న అలికిడి విని అటు చూసారు. తన మచ్చల గుర్రాన్ని కళ్ళాలు పట్టి నడిపించు కొంటూ భద్రా దేవి, ఆమె పక్కనే స్త్రీ రూపము పాము శరీరంతో జర జరా ప్రాకుతూ శంఖు పుత్రి ఇరువురూ కబుర్లు చెప్పు కొంటూ తమ దిశగా నడిచి రావటం కన్పించింది.

వెంటనే కౌగిలి విడిపించుకొని` పక్కకు జరిగింది ఉలూచీశ్వరి. శంఖు పుత్రిని గాంచి ధనుంజయుడు అచ్చెరువొందు చుండగా భద్రా దేవి ని నిశితంగా చూస్తూ ఉలూచీశ్వరి ఉద్విగ్నురాలయింది.

మీస కట్టు లేకుండా పెద్ద తల పాగా ధరించి గంభీరంగా ఉన్నందున ఆమెను చూసి ఇప్పుడే వయసు కొచ్చిన బాలకుడనుకుంది. ఆమెను చూసి భద్రా దేవి అంటే నమ్మ లేక పోయింది. కాని ఇప్పుడు అర్థమవుతోంది. ఆ హంస నడక, వయ్యారము ఎచటకు పోవును. మానవ స్త్రీలో మణి పూస వంటి అద్భుత సౌందర్య రాశి.

‘‘ఏవమ్మా ఉలూచీశ్వరి. ఇన్ని దినముల వలపు చెలి కాని కోసరం కలవరించితివి గదా. నీ కల ఫలించినదా? నీ మనోహరుని అనుగ్రహము లభించినదా? మా రాక ఏకాంతమునకు భంగము కాదు గదా!’’ అంటూ వస్తూనే చతురులాడిన శంఖు పుత్రి మాటలకు సిగ్గిలి`

‘‘పో అత్తా!’’ అంటూ ధనుంజయుని వెనక్కు చేరి ముఖం దాచుకుంది ఉలూచీశ్వరి.

‘‘ఎటు పోదును? నీవును రావలె గదా’’ అంది శంఖు పుత్రి.

‘‘లేదు లేదు. నేను వచ్చుట లేదు. వీరి తోనే వత్తును.’’ అంటూ ధనుంజయుని వదిలి ఇవతలి కొచ్చింది ఉలూచీశ్వరి. భద్రా దేవి ని ఉత్సాహంగా చూస్తూ చేతులు అందుకుంది.

‘‘అక్కా! నీ గురించి మన ప్రాణేశ్వరుడు చెప్పు వరకు నాకు తెలియ లేదు. నను క్షమించు. ఇక నుండి నను నీ సోదరిగా ఆదరించుము.’’ అంది.

‘‘ఏకాకి నగు నాకు నీవంటి భువనైక మోహనాంగి సోదరి యగుట నా అదృష్టము.’’ అంటూ అప్యాయంగా ఉలూచీశ్వరిని కౌగిలించు కుంది భద్రా దేవి.

ఇంతలో మచ్చల గుర్రం మీది తోలు సంచిలో విశ్రమించిన భూతం ఘృతాచి లేచింది. లేస్తూనే` ‘‘ఆకలి... ఆకలి.’’ అంటూ వచ్చి భద్రా దేవి ఎదుట నిబడింది. విచిత్ర మగు ఆ నల్లటి వికార రూపాన్ని జూచి విభ్రాంతి చెందారు శంఖు పుత్రి, ఉలూచీశ్వరిలు. దాని గురించి వారికి వివరించింది భద్రా దేవి. అప్పటికి ఎలాగూ భోజన వేళ సమీపిస్తోంది.

‘‘ఘృతాచి పొమ్ము. వనమునకు పోయి నీకు నచ్చిన మృగమును వధించి నీ ఆకలి బాపు కొని రమ్ము. అలాగునే మాకు వలసిన చక్కని పండ్లను కూడ సేకరించి తెమ్ము’’ అంటూ ఆనతిచ్చింది. వెంటనే అక్కడి నుండి అదృశ్యమైంది ఘృతాచి.

ఘృతాచి వెళ్ళగానే నలుగురూ అక్కడే వృక్ష చాయలో కూచుని చర్చలో మునిగి పోయారు.

*********************

ఆ రోజు ఉదయం రాజధాని రత్న గిరి లో`

కార్చిచ్చులా ఒక వదంతి వ్యాపించింది. దాని సారాంశం... దివ్య నాగ మణి కోసం వెళ్ళిన యువ రాజు ధనుంజయుడు ఎక్కడో మత్స్య దేశ ప్రాంతంలో ప్రమాదవ శాత్తు కొండపై నుండి లోయలో పడి మరణించాడని. దీన్నే చిలవలు పలవలు జేసి అనేక విధాలుగా చెప్పుకో సాగారు. ఈ వార్త నిజం గానే రత్నగిరి నగర ప్రజా జీవనాన్ని అతలా కుతలం చేసింది.

ప్రజు భయ భ్రాంతులయ్యారు.

ఏం జరగ బోతోంది?

తమ ప్రియతమ నాయకుడు మహా రాజు అశ్వస్థుడై వున్నాడు. యువ రాజు మరణిస్తే ఇక ఈ దేశం ఏమి కానుంది? ఈ వార్తకు తోడు త్వర లోనే శత్రు రాజు రత్న గిరి రాజ్యం మీద దాడి చేయనున్నారని కూడ వదంతులు నగరంలో షికారు చేస్తున్నాయి. నగరమే ఒక్క సారిగా విషాద సాగరంలో మునిగి పోయింది. ఒక్క పెట్టున విలపించసాగారు.

అయితే పుట్ట వ్రణంతో బాధ పడుతున్న ప్రభువు ధర్మ తేజునికి గాని ఆయన పట్టపు రాణి కనకాంబికకు గాని ఈ దుర్వార్త తెలీకుండా ప్రధానామాత్యుడు వాసు దేవ నాయకుడు, సర్వ సైన్యాధ్యక్షుడైన అర్కుల వారు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అంతే కాదు` వెంటనే మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఆ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన అమాత్యులతో బాటు ఉప సైనాధ్యక్షుడు బాహ్లీకుడు కూడ పిలువ బడ్డాడు.

సమీపంగా అర్కునికి బాహ్లీకుని మీద కొన్ని సందేహాలు ఏర్పడ్డాయి. తెర వెనుక ఏదో కుట్రకు పల్పడుతున్నాడని అనుమానం కూడ వుంది కాని సరైన ఆధారాలు లభించక ఉపేక్షిస్తూ వస్తున్నాడు. ప్రధానామాత్యునికి కూడ ఇంత వరకు చెప్ప లేదు. ఇపుడీ వదంతుల విషయంలో కూడ అతడి హస్తం వుండొచ్చని ఆలోచనలో అనుమానం వుంది. అది నిజం కూడ.

తన వద్ద పడున్న గాంధార వాసి కరోతి సలహా మేరకు తన సొంత గూఢ చారుల ద్వారా నగరంలో ఈ వదంతుల్ని వ్యాపింప జేసాడు. ఎందుకంటే`

యువ రాజుని అంతం చేయమని సమర్థులగు తన గూఢ ఛారుల్ని ఆరుగురు చొప్పున మూడు బృందాలుగా పంపించాడు. వెళ్ళిన వాళ్ళ నుండి ఇంత వరకు ఏమి జరిగిందనే సమాచారం లేదు. అవత యువ రాజు వెళ్ళి నెల రోజు దాటింది. అటు చూస్తే గాంధారం నుండి రాజు శతానీకుడు ఏం జరిగింది యువ రాజుని అంతం చేసారా లేదా అంటూ పావురాల ద్వారా లేఖలు సంధిస్తున్నాడు.

ఈ పరిస్థితుల్లో కరోతి ఒక సలహా చెప్పాడు. నిజానికి ఒకటి కాదు రెండు సలహాలు. అందులో మొదటిది సర్వ సైన్యాధ్యక్షుడైన అర్కుడిని ముందుగా అంతం చేయటం. దీని వలన అర్కుని మరణంతో ఉప సైన్యాధ్యక్షుడైన బాహ్లీకుడు సర్వ సైనాధ్యక్షుడిగా ఆ స్థానంలో పదోన్నతి పొందుతాడు. అందు వల్ల సైన్యం మొత్తం అతడి ఆధీనం లోకి వస్తుంది గాబట్టి అంతర్యుద్ధం అంతగా వుండదు. చెదురు మదురుగా ఎదురు తిరిగిన సైన్యాన్ని సులువుగా తుద ముట్టింప వచ్చు. ఈ లోపల శతానీకుని సాయం ఎలాగూ ఉండనే వుంది. ఇక రెండో సలహా`

యువ రాజు ధనుంజయుడు మరణించి నట్టు నగరంలో వదంతి వ్యాపింప జేయటం. దీనివల్ల సైన్యంలో మనో బలం సన్నగిల్లుతుంది. సులువుగా బాహ్లీకుని పక్షానికి వచ్చేస్తారు. అదే సమయంలో ఇక్కడి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెంటనే సైన్య సమేతంగా బయలు దేరమని సందేశం పంపించటం.

గాంధారం నుండి మిత్ర పక్ష సేన ను కూడ గట్టు కొని గాంధార సేనలు సముద్ర మార్గంగా రత్న గిరి చేరటానికి ఎలాగూ నెల రోజులు పడుతుంది. ఈలోపల పరిస్థితుల్ని పూర్తిగా తమ అదుపు లోకి తెచ్చుకో వచ్చు.

ఈ ఆలోచన నచ్చటంతో ముందుగా బాహ్లీకుడు సర్వ సైన్యాధ్యక్షుడు అర్కుని హత మార్చేందుకు వారం రోజుల క్రిందట మెరిక ల్లాంటి తన మనుషులు ఇరవై మందిని ఏర్పాటు చేసాడు.

అయితే ఆ రోజు ఆర్కుని అదృష్టం బాగుంది. నగరం మలుపలి ప్రాంతం లోని సైనిక విడిది నుండి రాత్రి మొదటి జాములో ఒంటి గానే నగరం లోని తన నివాసానికి రావటం అర్కుని అలవాటు. ఆయన నివాసం ఎగువన బాహ్లీకుని నివాసం మూడు వీధుల అవతల కోట గోడ సమీపం లోనే వుంది. వెంట అంగ రక్షకుల్ని కూడ తెచ్చుకునే అలవాటు ఆయనకు లేదు. మూడు దినాల క్రిందట ఎప్పటి లానే తన అశ్వం మీద తొలి జాము ముగిసే వేళలో గృహోన్ముఖుడై వస్తున్నాడాయన. ఆ సమయంలో ప్రయోగించారు. ముందుగా వచ్చిన బళ్ళెం అదృష్ట వశాన చెవి పక్కగా దూసుకు పోటంతో అప్రమత్తుడై సర్రున ఖడ్గం దూసి అశ్వాన్ని వెనక్కి మళ్ళించాడు అర్కుడు. తన మీదకు వస్తున్న ఆయుధాల్ని గాల్లోనే చెదర గొడుతూ అశ్వాన్ని  చెట్ల వెనక్కి పోనిచ్చాడు. దాంతో దుండగులు ఆయన్ని చుట్టు ముట్టారు. అప్పుడు జరిగిన పోరాటంలో అర్కునికి కొద్ది పాటి గాయాలయ్యాయి. ఈలోపల కోట గోడ పైన పహారా తిరుగుతున్న సైనికుల కత్తుల శబ్ధం విని కేకలు వేసారు. వెనకే కొందరు సైనికులు కూడ అటు అర్కునికి సాయంగా దూసుకు రావటంతో దుండగులు చీకట్ల మాటున తప్పించు కొని పారి పోయారు. ఆ విధంగా అర్కుని హత్యా ప్రయత్నం విఫలం గావటం బాహ్లీకుని కలవర పరచింది.

కాని అర్కుని ఇప్పుడు గాకున్న తర్వాతయినా అంతం చేయొచ్చునని భావించి రెండో సలహాను అమలు చేసాడు. దాని ప్రకారం అతడి సొంత గూఢ చారులు రంగం లోకి దిగి యువ రాజు గురించిన వదంతుల్ని నగరంలో వ్యాపింప జేయటం ఆరంభించారు. ముందుగా రత్నగిరి ఓడ రేవు ప్రాంతం నుండి ఆ వదంతులు వ్యాపించాయి. అర్కుడు మీద హత్యా ప్రయత్నం జరగటంతో ఇప్పుడతన్ని రేయింబవళ్ళు పది మంది అంగ రక్షకులు వెన్నంటి వస్తున్నారు. మూడు రోజులుగా తన జాగ్రత్తలో తనుండగా పిడుగు పాటులా యువ రాజు మరణ వార్త గురించిన వదంతులు నగరంలో షికారు చేయటం అర్కునే కాదు మహా మాత్యుడు వాసు దేవ నాయకుడిని కూడ కల వర పరుస్తున్నాయి. అందుకే ఈ ప్రత్యేక సమావేశం.

సమావేశాని కొస్తూనే` ‘‘ఇది దారుణం. సహింప రాని దుశ్చర్య. యువ రాజా వారి గురించి ఇలాంటి వదంతులు వ్యాపించుట నిజముగా దుర దృష్ట కరం. వారు ఎవరైనా గానీ దుండగుల్ని పట్టు కుంటాం. వారికి తగిన శిక్ష తప్పదు’’ అంటూ ఆవేశంగా మాట్లాడాడు బాహ్లీకుడు.

అతడి ఆవేశం చూసి కొన్ని లిప్తలకాలం అక్కడి పెద్దలంతా మౌనంగా వుండి పోయారు.

‘‘నిజమే బాహ్లీకా! పట్టుకుంటాం... శిక్షించెదము... కాని ఎప్పుడు?’’ అంటూ సూటిగా అడిగాడు అర్కుడు.

‘‘కోట పరి రక్షణ విభాగము నా అధీనమందున్నది. నగర పరి రక్షణ విభాగము నీ ఆధీనమందున్నది. నా మీదనే తెగ బడి హత మార్చ జూచి నారు శత్రువు. హత్యా ప్రయత్నము జరిగి యిది నాలుగవ దినము. మీ వాళ్ళంతా ఏమి జేయు చున్నారు? దుండగుల గురించిన చిన్న ఆచూకీ కూడ ఇంత దనుక తెలుసుకో లేక పోయిరి. ఇప్పుడీ వదంతుల వెనక ఎవరి హస్తము వున్నదో ఎప్పటికి తెలుసుకో గలరు?’’ అనడిగాడు.

అర్కుని మాటలు బాహ్లీకునికి ఆగ్రహం కలిగించాయి. అయినా నిగ్రహించుకున్నాడు. ‘‘అర్కుల వారు క్షమించ వలె. మీ ఉద్దేశము మేము చేత కాని వారమనా లేక అసమర్థులమనా తెలియకున్నది. మేము ఆ ప్రయత్నము లోనే వుంటిమి.’’ అన్నాడు.

అప్పుడు ప్రధానా మాత్యుడు వాసు దేవ నాయకుడు కల్పించు కొంటూ` ‘‘బాహ్లీకా! ఇప్పుడు సమస్య సమర్థత అసమర్థత గురించి కాదు. శత్రు జాడ కోసం ఎంత వేగముగా పని చేయుచున్నా మన్నదే ముఖ్యం. అర్కుని మాటలు అసత్యము కాదు గదా. నీకు తెలిసిన సమాచారం ఏమన్నా వుంటే చెప్ప వచ్చును’’ అంటూ సూచించాడు.

‘‘అమాత్యా! శత్రు గూఢచారులు నగరంలో తిష్ట వేసినట్టు సమాచారమున్నది. అర్కుల వారి మీద హత్యా ప్రయత్నం గాని ఇపుడీ వదంతులు గాని ఇదంతయు వారి దుశ్చర్యే. మన రత్న గిరి లోని పరిస్థితుల్ని అవకాశంగా తీసుకొని శత్రు దేశ పాలకుడు ఎవడో కుట్రకు పాల్పడుతున్నాడు. మనల్ని బల హీనుల్ని చేసేందుకే అర్కుల వారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. రేపు నా మీదనూ జరగ వచ్చును. అందుకే శతృ గూఢ చారుల ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం.’’ అన్నాడ బాహ్లీకుడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atulita bandham