Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tanadu malina dharmam

ఈ సంచికలో >> కథలు >> ఎట్టి విత్తో అట్టిపంట.

ఆధ్యాత్మిక గురువుగా

అనేకమంది శిష్యులకు జ్ఞాన

సంపదను పంచిన కీ.శే. శ్రీ ఆదూరి శ్రీనివాసరావు గారు

ఎన్నో చక్కని నీతిదాయకమైన

కథలతో గోతెలుగు పాఠకులను

అలరించిన విషయం విదితమే...

వారు మనమధ్య లేకున్నా,

వారు పంచిన అనంతమైన

ఆధ్యాత్మిక భావ సంపద,

వారి కలం నుండి జాలువారిన

సాహితీ సంపద అందరి మనసుల్లో

ఎల్లప్పుడూ ఉంటుందనేది

కాదనలేని సత్యం...

వారి కుటుంబానికి గోతెలుగు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ..వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తోంది...

వారి కలం నుండి జాలువారిన చివరి కథను వారి జ్ఞాపకార్థంగా అందిస్తున్నాం...

ఇది నేను ఒక కళాశాలలో పని చేస్తున్నప్పటి మాట. నేనొక ఆర్ధిక శాస్త్ర  విభాగాధి పతిని. మా కాలేజీలో నా విభాగంలో నాదే పై చేయి. నాకు ఆర్ధిక శాస్త్రమే ప్రాణం.  ప్రాణం నిలవను కూడా అన్న పానీయాలు ఉండాలి కదా! అక్కడే వచ్చింది చిక్కంతా. మాది ప్రైవేట్ కాలేజ్, మాకు ఇంకా UGC మాట అటుంచి, జీతాలకు గ్రాంట్సే రావు సరిగా. మేమంతా , ‘మే ‘మంటే మాకూటుంబం కాదు, మా లాంటి ప్రైవేట్  కాలేజ్ అధ్యాపకుల మంతా ఎక్కడ కలిసినా ’  కోడ్ ‘ లాంగ్వేజ్ లోనే మాట్లాడు కుంటాం.  ఒక మారు అంతా పేపర్ వాల్యూ యేషన్ కు వెళ్ళాం .

అక్కడ  ఒకాయన " అయ్యా! నాకు మోడో నెల..." అనగా నే మరొకాయన ,

" మాకు  ఐదో నెల" అన్నాడు.

నేను ఉండ బట్ట లేక , " మాకు తొమ్మిదో మాస మండీ!"అన్నాను కసిగా.

" మా స్నేహితు డొకడు , " ఐతే రేపోమాపో డెలివరీ తప్పదు."అనగా నే  అంతా నవ్వుకున్నాం.

అక్కడున్న మహిళా అధ్యాపకులు అర్ధం కాక , మాకేసి తమాషాగా చూసి,

" మీ శ్రీమతి  ప్రెగ్ నెంటా ! కంగ్రా ట్స్ " అన్నారు. " మా శ్రీమతి కాదండీ! నామతి మండా మీకు  తెలీదుగా మాకోడ్ .. మాకు జీతాలు వచ్చి 9 నెలలన్నమాట."అనగానే ,  అంతా పది నిముషాలు నవ్వుకుని  బాధ మరచి పోయాం.  ఐతే తమాషాగా డెలివరి ఐపోయి పాపాయి పుట్టినట్లు,’ జీతాల బిల్లులు పట్టుకు రమ్మని ‘ పక్క  వారమే మెసేజ్ అందుకున్నాం.

అంతా నాకు ఆ పని అప్పగించి పంపారు , కూతుర్ని అత్తవారింటికి పంపే తల్లిదండ్రుల్లా. ' ఎలానెట్టు కొస్తావో జాగ్రత్త , పని పూర్తిచేసుకు రావయ్యా రావూ!" అంటూ. నేను కావలి రైల్వేస్టేషన్లో  నెల్లూరు వెళ్ళే రైల్ కోసం కాచుక్కూర్చున్నాను. నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళాయి. ఒక ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్ర వేత్త 'డాల్టన్ ' అంటాడు "సృష్టిలో జన్మించిన ప్రతి మానవుడూ  రెండు తప్పించుకోలేడని. ఒకటి. మరణించడం, రెండు . ప్రభు త్వా ని కి పన్ను చెల్లించడం” . ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులు,-- చెల్లించడమేంటీ! అక్కడే కోసేసి మిగిలిందే చేతికిస్తారు. లెక్చరర్లు, పాఠాలు చెప్పుకోడం, విద్యార్ధులు నేర్చు కుని ,విద్యా ప్రమాణాలతో పాటుగా మానవతా విలువలను నేర్చు కుంటే - అంటే సత్య , ధర్మ ,శాంతి ప్రేమ, అహింస లన్నమాట , సమాజం చక్కగా తయారవు తుంది.

ఐతే పాఠాలు చెప్పనే  కాలం  సరి పోదు, ఇహ విలువ లెక్కడ! ఐతే మనం వాటిని సక్రమంగా బోధిస్తే  ఆ వయస్సు లో చక్కగా వారిలో నాటు కుంటాయన డానికి నిదర్శనంగా నాకిక్కడ ఎదురైన ఒక అనుభవమే నాకు చాలా సంతృప్తి నిచ్చింది.  అదే చెప్పబోతున్నాను.  నేను  ఎదురుచూస్తున్న రైలు రానే వచ్చింది,  కానీ కాలు  పెట్టను కూడా సందు లేదు. 

నేను ఒక బోగీ వద్ద కొచ్చి లోపలికి ఎక్కను మెట్టు మీద కాలు పెట్టగానే,  ఆటోమెటిక్ గ్గా లోనికి నెట్టబడి, అక్కడున్న మూత్రశాల వద్దకు త్రోయబడ్డాను.ఇది ఇండియా కనుక ఆ మూత్ర శాల ఎంత శుభ్రంగా ఉంటుందో తెలిసిందే .ఆవాసనకు కడుపు తిరిగి పోతున్నది, ముక్కుకు చేతి రుమాలు అడ్దం పెట్టుకుని బాధ పడు తూ నిల్చున్నాను ఒంటి కాలి మీద, ఇంతలో ఒక వ్యక్తి మూత్రశాల వైపు వస్తూ నన్ను చూసి , గభాల్న నావద్దకు వచ్చాడు.

"నమస్కారం సార్ ! బావున్నారా! ఇక్కడున్నారేంటీ! రండి ఇలా "అంటూ నా చేయిపట్టుకుని తీసుకెళ్ళి ఒక సీట్లో కూర్చోబెట్టాడు. 

నేను తలెత్తి " ఎవరు బాబూ నీవు?" అన్నాను.

" నేను మీ  oldstudent నండీ!" అన్నాడు వినయంగా.  నాకెంతో ముచ్చటతో పాటూగా ఆశ్చర్యమేసింది. 

"బాబూ! ఈసీటేవరిదీ ? నన్నూకూర్చోబె ట్టావూ!" అన్నాను. "నాదే సార్ ! " అన్నాడు వినయంగా.

"నీ సీటునాకిచ్చి నీవు నిలబడ్డావా!బాబూ!" అన్నాను, కాస్తంత ఇబ్బందిగా.

"ఫరవాలేదు సార్! మేము కూర్చునుంటేమీరు 3 సంవత్సరాలు నిల్చుని మాకు పాఠాలు బోధించారు,  నేను ఒక్క గంట నిలబడలేనా సార్ !  మీరు విద్యతో పాటుగా బోధించిన మానవతా విలువల వల్లే ఈనాడు నా ఉద్యోగంలో మంచి పేరు తెచ్చు కుంటున్నాను సార్! అదంతామీ భిక్షే !" అన్నాడు అభిమానంగా . 

నేను నేర్పిన మానవతావిలువలు మొక్కై , మానై  , ఫలించినందుకు నాకు మహదానందం కలిగింది.

ఐతే మీకు నా మరో అనుభవం దీనికి పూర్తిగా విరుధ్ధమైంది చెప్తాను  చూడండి. నేను నాశ్రీమతీ మా బంధువుల ఇంట జరిగే ఒక కార్యక్రమానికి బయల్దేరాం.  ముందుగా రెసెర్వె  చేసుకోడం వల్ల మా ఇద్దరికీ లోయర్ బెర్తులే వచ్చాయి. మేము ఎక్కేసరికే తొమ్మిదైంది. మా సెక్షన్ లో లోయర్ బెర్త్ లో ఒక యువకుడు  ,కూర్చుని ఉన్నాడు,

అతడి పక్కనే ఒక పెద్దాయనా ఉన్నాడు. మేము ఎక్కి సర్దుకుంటూ  ఉండగా ఆ పెద్దాయన  ఆయువకుడ్ని" బాబూ! నావయస్సు 74, ఈ రైల్వేవారు నాకు అప్పర్ బెర్త్ ఇచ్చారు. కాస్త నీవు అక్కడ సర్దుకుని  ఈ లోయర్ బెర్ట్ నా కిస్తావా, వయస్సుకు మొకాళ్ళ నొప్పులు తోడయ్యాయి, 2,3 సార్లన్నా బాత్ రూంకెళ్ళాలి, ప్లీజ్ బాబూ! " అంటూ ఎంతో ప్లీజింగా అడిగాడు.

ఆ నవ యువకుడు అస్సలు ఆ ముసలాయన మాట పట్టించు కున్నట్లే  లేదు, విన్నాడో లేదో కూడా తెలీ లేదు.  చెవులకు ఏర్ ఫోన్స్ ఉన్నాయి. అవిలేని వారు ఈరోజుల్లో చెవిటివారి క్రిందే లెక్క.  ఆపెద్దాయన  రెండోమారు అడిగాడు " బాబూ !దయచేసి ఈ లోయర్ బెర్త్ నాకిచ్చి , అప్పర్ బెర్త్ లో నీవు సర్దుకుంటావా? నేను పైకి ఎక్కలేను బాబూ!" అన్నాడు.  దానికీ ఆయువకుని నుంచీ సమాధానం లేదు, పైగా ఆ పెద్దాయనకేసి కాళ్ళు బర్లా చాపి కూర్చు న్నాడు.  నాకు వళ్ళు మండి పోయింది. లెక్చరర్ ను కదా చూస్తూ ఉండలేకపోయాను.   ఆ యువకుని సమీపించి  తట్టాను .' ఏమ’టన్నట్లు చూశాడు.’ చెవులు వినిపిస్తున్నాయా? ' అన్న ట్లు సైగచేశాను.  దానికతడు చెవుల్లోని  తీగలు  పీకేసి "ఏంకావాలీ!" అన్నాడు విసుగ్గా.

" బాబూ ! నీవు స్టూడెంటా! లేక ఎంప్లాయా!" అన్నాను.   దానికతడు తలెగరేసి  గర్వంగా , "ఎంప్లాయ్   “ అన్నాడు.   

" ఓ హో! ఏకంపెనీ ! ఏ వుజ్జోగం? " అన్నాను.   పిల్లనివ్వను వచ్చిన కాబోయే మామ గారు అడిగినట్లు అడుగుతున్నాననేమో గర్వంగా అతలెగరేసి " సాఫ్ట్ వేర్ " అన్నాడు.

"ఓహ్! అలాగా ! మరి సాఫ్ట్ వేర్? [soft where] ? " అన్నాను వత్తి వత్తి చివరి రెండుమాటలూ విరిచి.   మళ్ళా నేనే ” Etarnally   hard were  . ఐతే సాతి వ్యక్తికి అదీనీ  వయస్సులో  పెద్దాయన రెండుసార్లు నీతో బ్రతిమాలి మాట్లాడుతుంటే, ఆయన మనవడి లాంటి వాడివి అసలు వినవా? సొఫ్త్  అంటే  ఏంటీ! సాటి వారికి అవసరంలో కాస్త సాయం చే సే  దయా హృదయం ఉండాలి , హృదయం కోమలంగా ఉండాలి. అప్పుడే సాఫ్ట్ వేర్ అవుతావు , మన హిందువులదైవం శ్రీరాము ని కోమలాంగుడు అంటారు దయగలవాడు .

’ .’ Hard    like a Diamond  where Principles  are  at stake,  soft as a petal where kindness is required..”” అన్నాను ,  సీరియస్ గా . ఏమనుకున్నాడో ఏమో వెంటనే లేచి తన ల్యాప్ ట్యాప్ , మిగతా సరంజామా, వైర్లన్నీ  సర్దుకుని పై కెక్కాడు. ఆపె ద్దాయన నావైపు కృతఙ్ఞతగా చూస్తూ ఆలోయర్ బెర్త్ లో పడుకున్నాడు.  కనుక చెప్పొచ్చేదేమంటే చెప్పడం మన బాధ్యత , తర్వాత   వినడం , ఆచరించడం వారి కర్తవ్యం.  విత్తనం విత్తందే మొక్క మొలవదు కదా 

మరిన్ని కథలు