Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kaduputeepi

ఈ సంచికలో >> కథలు >> అక్కకు ప్రేమతో

akkaku premato

“ఓయ్ !..సాఫ్ట్ వేరూ..మీ జాడీకి ఫోను చేశావా ?..మన ఫ్లైట్ టికెట్స్ కన్పం అయి పోయాయి..ఫెస్టివల్ కు వారం ముందే మనం భాగ్యనగరంలో కాలు పెట్ట బోతున్నాం..ఐ ట్వంటీ క్రింసన్ రెడ్ నా పేరుమీద బుక్ చేయమని చెప్పు..డెలివరీ  పాయింటు మాత్రం..విజయవాడని మెన్షన్ చేయించమని చేప్పు.. “

హైదరాబాదులో ఎందుకు..మనూళ్లో మీరే బుక్ చేసుకో వచ్చుగా  ?

భర్త ను ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నించింది.. మల్టీనేషనల్ ఐటి కంపెనీలో ఈవెంట్ మేనేజరుగా జాబ్ చేస్తున్న..రమ్య.

ఇక్కడైతే నా ఎకౌంట్ లోపడిపోతుంది..అక్కడైతే  మీ నాన్నఎకౌంటు..దట్సిట్...

ఇద్దరం జాబ్ చేస్తున్నాం..లక్ష పైన డ్రా చేస్తున్నాం..మొదటి పండక్కి పల్సరన్నారు..రెండో పండక్కి ఐ ఫైవ్ కొనిచ్చారు..ఇప్పుడు కారంటున్నారు..మా నాన్న గారు రాజకీయ నాయకుడూ కాదు  ..బిజినెస్ మేగ్నెటూ కాదు..

తెలుసు..బేంక్ మేనేజరని..  మరి నేనెవరో తెలుసా? అల్లుడ్ని.. పైగా ద గ్రేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిని .. అందుకనే  కోటి కట్నమిచ్చారు. నా తర్వాత మా చెల్లెలుంది..దానికీ కట్నం యివ్వాలి..బోలెడు ఖర్చువుంటుంది..ఇలా అడిగిమరీ తీసుకోవడం..నాకు ఎంబ్రాసింగ్ గా వుంటుంది.. మీ కారువిషయం మీరే మాట్లడు కోండి..నన్ను మాత్రం ఇన్ వాల్వ్ ...చేయకండి..

భార్య సమాధానాన్ని జీర్ణించుకోలేకపోయిన రమేష్ బాబు ..రమ్యా అని అరవబోతూ ఇంటిముందు ఆగిన టేక్సీని చూస్తూనే..నోరు తెరిచేశాడు. టేక్సీలోంచి  హాయ్ బావా అంటూ విష్ చేసి దిగుతున్న మరదల్ని లాయర్ డ్రస్ లో చూస్తూ..పజిలై పోయాడు.
చెల్లిని చూస్తూనే హాయ్ దివ్యా అంటూ వచ్చిఅల్లుకు పోయింది రమ్య.

*********

సారీ బావా ..మార్నింగే వచ్చాసు..ఫోన్ చేద్దామనుకుంటూనే మీరిద్దరూ ఆఫీసుల్లో బిజీగా వుంటారని డిస్టర్బ్ చేయలేదు.టుబీ ఫ్రాంక్ మార్నింగ్ నుంచీ  ఫ్యామిలీ కోర్టులో నేనూ ఫుల్ బిజీ. మీ ఊరి అమ్మాయి కేసే. 

అక్క యిచ్చిన ఫిల్టర్ కాఫీని సిప్ చేస్తూ సోఫాలో రిలాక్సై పోతూ  తన రాకను  వర్ణించడానికి తయారై పోయింది.

అంటే కేసులు వాదించడానికి ఈవూర్లో లాయర్సే లేరా లాయర్ మరదలా..?

లాయర్స్ లేక కాదు బావా.ఈ కేసులో ముద్దాయిలు..మా మేడం క్లైంట్సు. మా మేడం గారు..ఢిల్లీలో సుప్రీం కోర్టులో హెల్డప్పైపోయారు.హోప్ లెస్ కేసే .. బట్ లాయర్ ఫ్రెజన్స్ కోసమని  వచ్చాను. ఫెళ్లైన ఏడుసంవత్సరాల లోపు అమ్మాయి ఆత్మహత్యచేసుకున్నా..డౌరీ హెరాస్ మెంట్ ప్రూవైనా నో బెయిల్..మినిమం సెవెన్  యియర్స్ ఇంప్రిజన్ మెంట్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. సుప్రీంకోర్టు ఎప్పుడో యిచ్చిన ఈ జడ్జిమెంటును మతిమరుపు దున్నపోతులకోసం మరోమారు అన్ని న్యూస్ పేపర్లలో పబ్లిష్ చేసింది.. మీరూ చూసేవుంటారు.

ఔను..నేను గూగుల్ న్యూస్ లో చదివాను.

వేడి వేడి పకోడీల ప్లేటు అందిస్తూ రమ్య .అంది.

కధ మానేసి ..కాకమ్మ కధలు చెప్తున్నావ్  ..మావూరమ్మాయన్నావ్ ..ఇంతకీ ఎవరా అమ్మాయ్? సంగతేంటో చెప్పు.

రమేష్ బాబు అడిగిన ప్రశ్నకు  సమాధానంగా అదోలా నవ్వి  ..

ఇవేమైనా బాహుబలి లాంటి ఫాంటసీ కథలా బావా?మన దేశంలో ఏదోఒక మూల..ప్రతి రోజూ ..కట్నాల కోరల్లో బలై పోతున్న..ఆడపిల్లల ..అభాగ్య జీవితాలే కద బావా ?..అనుక్షణం ఆనవాయితీలు ..కట్న కానుకలంటూ కక్కుర్తి పడే మగతనం లేని కీలుబొమ్మ లాంటి భర్త.. ఆస్థిపాస్తులన్నా..కుక్క కక్కిన కూడు లాంటి..కట్నాలకు కక్కుర్తి పడే అత్తమామలు..ఫ్యూచర్లో నా బతుకూ ఇంతేనన్న ఇంగిత జ్ఞానంలేని ఆడపడుచులు..చదువున్నా సంస్కారమంటని బావలూ మరుదులూ..ఇంటింటి..రామాయణాలే కద బావా..అడిగారు కాబట్టి చెప్తాను..మా క్లైంటు అమరావతి ఆడపడుచు. అమెరికా సంబంధమని నమ్మి కట్న కానుకలిచ్చి 

ఓ వెధవకి కట్ట బెట్టేశారు. పెళ్లైన ఆరు నెలలకే  మనోడి కేలిబర్ కి తట్టుకోలేని అమెరికా కంపెనీ..పింక్ లెటర్ చేతికిచ్చి ..ఇంటికి సాగనంపారు.నా కొడుకు ఎదవని ఒప్పుకోలేని ఆదర్శ అమ్మానాన్నలు..కోడలిది కొంపలు కూల్చేపాదమని ..కొడుకూ కూతుళ్లతో కలిసి కీర్తనలు పాడేశారు. అది మొదలు అమ్మాయి బ్రతుకు దిన దిన గండం అయి పోయింది. సాధింపులతో బాటు భర్త గొంతెమ్మ కోర్కెలకు బలి పశువై పోయింది. మొదటి సంక్రాంతికి మోటర్ బైకన్నాడు..మరుసటి పండగకి ఐ టెన్ అన్నాడు.. మూడో పండక్కి మూడెకరాల పొలం అన్నప్పుడు ఎదురు తిరిగంది. 

మా నాన్నకు మిగిలిందే ముడెకరాలు..ఆరెకరాల్లో మూడెకరాలమ్మి నా పెళ్లికి కట్నం యిచ్చారు. నా ఇద్దరు చెల్లెళ్ల పెల్లిళ్లు చెయ్యాలి. వాళ్లు బ్రతకాలి నా గొంతులో ఊపిరి పోయినా ఈ అన్యాయం జరగనివ్వనని ఎదురు తిరిగింది. భర్తతో బాటు అత్తా మామలు ఆడ పడుచు మరిది రాక్షసులై పోయారు. మానసికంగా శారీరకంగా హింసించారు. ఆరళ్లకు తట్టుకోలేని అమరావతి ఆడ పడుచు విమెన్ ప్రొటెక్షన్ సెల్ కు లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది.

ఒక్క సారిగా మాటలాపేసి మూడీగా మారి పోయింది  దివ్య.

రమ్య చెల్లిని దగ్గరా తీసకుని..

దివ్యా ..ఐ పిటీ హర్..ఆత్మహత్యే అంతిమ నిర్ణయమనుకొంటూ  నేటి యువత రాంగ్ రూట్ లో ట్రావెల్ చేస్తోంది. నీ ప్రొఫెషన్ లో ఇలాంటి వి తప్పవు.

మరీ యింత సెన్సిటివ్ గా వుంటే ఎలా..?

అది కాదక్కా..ఆ అమ్మాయీ మన లాంటి ఆడ పిల్లేగా ..ఆడ పిల్లగా పుట్టడమేనా ఆ అమ్మాయి తప్పు..ఇలాంటి నంఘటన రేపు నీకో నాకో ఎదురవ్వదన్న గ్యారెంటీ వుందా..?

ఓకే..ఓకె..ఇట్స్ ఓకే..సస్పెన్స్ లో పెట్టక కోర్ట్ లో ఏం జరిగిందో చెప్పేస్తే నేను రైస్ కుక్కర్ పెట్టాలో పిజా హౌస్ కు మీ బావను పరుగెత్తించాలో డిసైడ్ చేసుకుంటా.

రమ్య టాపిక్ డైవర్ట్ చేసింది.

“అసలు వాళ్లంతా కలిసి చేసిన కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కి కోర్ట్ హాల్లోనే  షూట్ చేసి పారేయాలి. బట్ మనం ఖర్మ భూమిలో వున్నాం.. భర్త అత్తా మామలతో బాటు  ఇంజినీరింగ్ ఆఘోరిస్తున్నఆడ పడుచుకీ బురద పందికీ..ఐమీన్ మరిది పందికీ సెవెనియర్స్ ఖఠిన కారాగార శిక్ష విధించారు..ఫేమిలీ ఫేమిలీ మొత్తం చిప్ప కూడు తింటూ బతికేయొచ్చు. అసలిలాంటి నీతి మాలిన కేసును డీల్ చేయడానికి ఒప్పుకున్న మా మేడంని చెప్పుతో కొట్టాలి.’

ఇది బావా కథ. బై ద బై రేపు మార్నింగ్ ఫ్లైటుకు మీరు ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేయ గలరా..ఇందాక నన్ను డ్రాప్ చేసిన టేక్సీ వాలాని కాంటాక్ట్ చేయనా.

మీ బావ గారి ఫ్రెండ్సందరికీ కార్లున్నాయ్. అందాల లాయర్ మరదలికి ఈమాత్రం బిస్కెట్ వేయని బావలు ఈ కంప్యూటర్ యుగంలో వున్నారంటే ఐ డోంట్ బిలీవ్..నువ్వు డిన్నర్ మెనూ డిసైడ్ చేయి తల్లీ ఆ తిప్పలేవో మీ బావే చూసుకుంటారు.

చిలిపిగా అంటించిన చురకలు చుర్రుమన్నా నోరు తెరిస్తే ఇంకెన్ని చురకలు చుక్కలు చూపిస్తాయోనన్న భయంతో ఫ్లైట్ టైమింగ్ కోసం గన్నవరం ఎయిర్ పోర్ట్ ఎంక్వైరీ నెంబర్ కోసం లాప్ టాప్ లో ముఖం దాచుకున్నాడు..ద గ్రేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి ..రమేష్ బాబు.

**  ***

వారం తర్వాత అక్క నుంచి వచ్చిన వాట్స్ యాప్ మెసేజ్ లోని మొదటి సెంటెన్స్ చూస్తూనే యురేకా అని అరవబోయి  ..తనున్నది కోర్టులోనని గుర్తు తెచ్చుకొని  తమాయించుకుని సెల్ ఫోన్ స్క్రీన్ కు కళ్లప్పగించేసింది  ..దివ్య.

దివ్యా! యువార్ గ్రేటే..బావ యిష్యూ చెప్పినప్పుడు నువ్వన్నమాట  ..నీకు గుర్తుందా..మై హూనా అని. యస్ అది వర్డ్ కాదు జడ్జ్ మెంటని ప్రూవై పోయింది.

నీ రాకకు ముందు నేను మా కంపెనీలోనే..టీమ్ లీడర్ని. నువ్వు వచ్చి వెళ్లాక అత్తా మామ..మరిదీ మరదలు..ఇంక్లూడింగ్ యువర్ బావ గ్రూప్ కు నేనే...

లీడర్ని.. నా అనుమతి లేకుండా ఎలాంటి ఈవెంటూ నహీ హోతా.. ఇప్పుడు మా యింట్లో “ఐ “అనే అక్షరమే బేన్డ్ .. హం ఫెస్టివల్కు నహీ...ఆరా..నా ప్రియమైన చెల్లికి ..లక్ష ముద్దులతో అక్క.

అమ్మా నాన్నలకు అక్క ముద్దులందించాలని..అరవై కిలోమీటర్ల స్పీడుతో  దూసుకు పోయింది ..అమ్మాయిల కేసులు తప్ప అన్యాయపు కేసులు వాదించనని.. నిర్ణయం తీసుకున్న నేటి జనరేషన్ అమ్మాయి..లాయర దివ్య..లవ్ లీ సిస్టర్ ఆఫ్ రమ్య*                 

మరిన్ని కథలు
badhyata