Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
gongoora pappu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వృక్షములు - జీవ సంరక్షకులు - హైమా శ్రీనివాస్

vrukshamulu - jeeva samrakshakulu

వృక్షములు - జీవ సంరక్షకులు

 

చెట్టు ప్రాముఖ్యత -  ఉపోద్ఘాతం

వృక్షో రక్షతి రక్షితః- అనే సూక్తి నూటికి నూరు పాళ్ళూ సత్యం. 

 భారతదేశంలో లభించే అమూల్యమైన వృక్షసంపదగురించీ తెల్సుకోడం మనకర్తవ్యం. వర్షాలు లేని రాజస్థాన్ ఎడారులలోనూ , మంచునిండిన హిమాలయాల్లోనూ మనదేశమంతా విభిన్న మైన వాతావరణం లో 20వేలకంటే ఎక్కువరకాల చెట్లు పెరుగుతున్నాయి.ప్రపంచంలో మరే ఇతరదేశాల్లోనూ విస్తీర్ణత భారత దేశంలో ఉండటమేకాక వివిధ రకాల విలువైన వృక్షసంపద కలిగిం ఉండటాం మనదేఆశప్రత్యేకత.మన వృక్ష సంపదలో ఔషధాలకు ఉపయోగించే చాలా వృక్ష జాతి ఉండటం, వాటిని మన ఆయుర్వేద, సిధ్ధ, యునానీ,  హోమియో, వైద్యాలలో మందులుగా ఉపయోగించడం జరుగుతున్నది.పశుపక్ష్యాదులు వాటి ఆరోగ్యాన్ని అవే వివిధ రకాల ఆకులనూ పండ్లనూ, వేర్లనూ తిని కాపాడుకుంటుంటాయి. తిన్నవి అరగని పిల్లులూ , గొంతు కలో ఏదై నా అడ్డుపడ్డు కుక్కలూ , పసువులూకూడా గరిక గడ్డిని మింగి  కక్కు తెచ్చుకుని , నయం చేసుకుంటుం టాయి. మనదేశంలో మొదటినుండీ ఆటవికులేకాక, నాగరీకులుసైతం తమచుట్టూ వనాల్లో అడవుల్లోలభించే  వన మూలికలనూ, చెట్ల వివిధ భాగాలనూ, ఆకులనూ, వేర్లనూ తదితర ద్రవ్యాలనూ ఔషధ రూపంలో ఉప యో గించుకుంటూ పలురకాల వ్యాధూలకు నివరణోపాయాలను పొంది స్వస్థతపడటం జరుగు తూనే ఉంది.  ఇలా దేశీ వైద్యం వృక్షసంబంధ ద్రవ్యాలతో రూపొందింది. ఈ విఙ్ఞానాన్ని ఉత్తర భారత దేశంలో చరకుడు, శుస్రుతుడు మొదలైన వైద్యులు ' ఆయుర్వేదము ' అనే పేరుతో ఒక వైద్య గ్రంధాన్ని రూపొందించారు. దక్షిణ భారతంలో అగస్త్యాది సిధ్ధులచే కూడా గ్రంధస్తం చేయబడి సిధ్ధ వైద్యంగా రూపొందింది. 

భారతదేశంలో వ్యాపించిన మూలికా వైద్యం యునానీ వైద్యం మనదేసంలో మహమ్మదీయుల పాలనలో ఉన్నపొరాంతాల్లో వ్యాపించి ఉండేది.ఈ వన్య కాలంలోఎక్కువ ప్రాచుర్యం పొందిన హోమియోపతి, ఆలోపతీ వైద్యాలకూ ఔషధా లను తయారు చేయడం లో వనమూలికల పాత్ర విశిష్టమైనదిగా ఉంటున్నది.  ఆంధ్రప్రదేష్ లో ఔషధాల తయారీకి పనికివచ్చే దాదాపు గా 700 రకాల వృక్షాలు పెరుగుతున్నాయని వృక్షశాస్త్రఙ్ఞులు తెల్సుకున్నారు  . కనుక వృక్షాలౌ కేవలం ఫలాల నూ , కాయలనూ మాత్రమే మనకు అందించడంకాకమన ఆరోగ్యాలను బాగుచేసే ఔషధాల తయారీకి పనికి వచ్చే ఓషధుల తయారీలోనూ వాడబడుతుండటం వలన మనకు వృక్షాలు చేసే సేవ వెలకట్తలేనిది . అలాంటి కొన్ని వృక్షాల గురించీ కొంత సమాచారమ్మనం చెప్పుకోను ప్రయత్నిద్దాం.  

మొక్క పెరిగి పెద్దై చెట్టవుతుంది. చెట్టు గుత్తగా కొమ్మలతో కళకళలాడుతుంది. చెట్లు మానవాళికి కాయలనూ, పండ్లనూ, పూలనూ ,ఆకులనూ ,కూరలనూ అందిస్తుంటాయి .వాటి జీవితాలన్నీ జీవళి సేవలో గడిచి పోతుం టాయి, అవి ఆహారాన్ని తయారు చేసుకుంటూనే జీవాళికి ప్రాణ వాయువును అందిస్తూ మానవులకు ఆదర్శ మూర్తులు గా నిలిస్తు న్నాయి.మొక్కై వంగనిది మానై వంగునా ! అంటూ మానవులు చిన్నతనంలోనే సద్గు ణాలను నేర్చుకోవాలని మానుతో పోలిక చేసి సూచిస్తారు.

 బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటె కాదు 
 చచ్చికూడ చీల్చి ఇచ్చుతనువు 
త్యాగభావమునకు తనువులే గురువులు 
ఉన్నమాట తెలుపుచున్నమాట .

 చెట్ల మాను పైన చుట్టూ కొమ్మలు,పక్కకొమ్మలు ఉండి కనీసం ఇరవై  అడుగుల ఎత్తు వరకూ పెరుగు తూ తమ కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ,మనకు ఫలసాయమేకాక తమజీవితాలను పూర్తిగా చనిపోయికూడా కలపకూ, వంటచెరకుకూ ,మందులకూ ఉపయోగిస్తున్నాయి.కొన్ని చెట్లు రెండు వందల అడుగుల ఎత్తు వరకు అతి భారీ గా కూడా పెరుగుతాయి.కొన్ని చెట్లు వేయిసంవత్సరాల పైన జీవిస్తాయంటారు.ప్రతి సంవత్స రం చిగురిస్తూ, పుష్పిస్తూ, కాయలు,పండ్లు అందించేవే చెట్లు. ఒక్కసారి కాచి చనిపోయేవి మొక్కలు .చెట్లు నేల పటుత్వాన్ని, భూసారాన్ని చక్కగా కాపాట్టమేకాక ప్రకృతికి అందాలను కూడా అందిస్తున్నాయి. వ్యవసాయంలోను చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మామిడి, సపోటా, బత్తాయి, దానిమ్మ , జామ , పనస మొదలైన పండ్లు చెట్లు మానవాళికి కమ్మని ఫలాలనూందిస్తూ ,ఆరోగ్య జీవనం గడపను సహక రిస్తున్నాయి. ఆకర్షణీయమైన అలం కార వస్తువులు ఇంటి ఫర్నీచర్ కూ ,ఇళ్ళుకట్టుకోనూ కావలసిన కలప అంతాచెట్ల కొయ్య నుండే లభిస్తాయి. మతపరమైన నమ్మకాలు చెట్లగురించీ అనేకం ఉన్నాయి. పోలేరమ్మకు వేప చెట్టుకు అవినా భావ సంబంధం ఉంది. శివుడికి మారేడుపత్రితో పూజ ప్రీతికరం.వినాయక పూజకు అన్నీ పత్రాలే పుజాద్రవ్యంగా సమర్పించు  కుంటున్నాం. పారువేట పేర విజయదశమి మరునాడి శమీవృక్షానికి పూజచేయడం మనఆచారం.పాండవులు అఙ్ఞాతవాస దీస్ఖకు వెళ్ళేముందు వారి ఆయుధాలను జమ్మి చెట్టుమీదదాచుకున్నారని మనకుతెల్సు.  

 'చెట్టంత మనిషి అని', 'చెట్టంత ఎదిగాడు' అనీ వాడుతుంటాం.ఈ విశ్వం అంతా పంచ భూతాత్మకమైన దేకదా!. చెట్లు మనలా వింటాయి, బాధపడతాయి, సంతోషిస్తాయి అని విఙ్ఞానశాస్త్రంలో జగదీశ్ చంద్రబోస్ తన ప్రయోగాల ద్వారా నిరూపించాడు.వాటిక్కూడా మనిషికిలాగే వినటం,వాసన చూట్టం, రస, స్పర్శ, దృష్టి అనే ఐదు ఇంద్రియాలూ మనలాగే పనిచేస్తాయి. అవి ఇతర ప్రాణుల వలెనే పైకి కనిపించక పోవచ్చు. వృక్షాల్లోనూ ఆకాశమనేది ఉంది. చెట్లకు స్పర్శను పొందే లక్షణం ఉంది. అలాగే గాలి వీచినప్పడు, పిడుగులు పడ్డప్పుడు కలిగే ధ్వనులకు స్పంది స్తాయి,భయపడతాయి.మంచి వాతావరణ సమయంలో ఆనందిస్తాయి.పువ్వులు, పండ్లు రాలిపడినపుడు బాధపడవచ్చు. ధ్వనిని వినే శక్తి చెట్లకుంది. పవిత్రమైన గంధం కానీ, ధూపం కానీ ఆ చెట్లకు సోకినప్పుడు అవి చక్కగా స్పందిస్తాయి.సుఖ దుఃఖాలను పొందుతాయి.మనం తాకి పొగిడినపుడు అవి అనందిస్తాయి.విసుక్కున్నా, తిట్టినా బధపడతాయి.మనిషిలో ఎలా పరిణామక్రమం ఉంటుందో వాటిలో నూ అలాంటి పరిణామక్రమమే ఉంటుంది. మొలకెత్తటం, పెరిగి పెద్దవ్వటం, పుష్పించి ఫలాలను ఇవ్వటం, కొంత కాలానికి వయస్సుడిగి నశించటం ఇవన్నీ ప్రాణం ఉన్న మనిషిలాగే చెట్లు కూడా అనుభవిస్తుంటాయి. వాయువును గ్రహించటం,తీసుకున్న ఆహారాన్ని జీర్ణంచేసుకో డం, ఆహారం తగ్గినపుడు కృసించడం, బాగా ఆహారం లభించినపుడుపెరగటం ఇవన్నీ చెట్లలో కనిపిస్తుంటాయి. వ్యాధి సోకితే మనిషి బాధపడినట్లే చీడ పీడలు సోకిన చెట్టు కూడా బాధ పడతాయి.నీరసిస్తాయి.చీడపీడలు వదలగానే రోగం తగ్గిన మనిషి లాగే నవ నవలాడుతూఆనందంగా కనిపిస్తుంటాయి.

వృక్షో రక్షతి రక్షితః’అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతాయి..దేవాలయాల్లో వృక్షాలను పెంచి వాటిని కూడా దేవతలను పూజించినట్లే పూజిస్తారు. చెట్లను నాటాలి, పెంచాలి, వాటిని రక్షిం చాలి అనే భావన  మానవుల మనసుల్లో ఇలా పూజించడం ద్వారా  దృఢ పడుతుంది. స్వార్థం కోసం అక్రమం గా చెట్లను నరికే వారికిఈ వాక్యం కనువిప్పు ఔతుందా! మానవాళి మనుగడకు అవసరమైన సంపదలలో వృక్ష రక్షణ అత్యంత ముఖ్యమైనది.

వాతావరణ కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్యమునకు వృక్షరక్షణ అత్యవసరం. వైద్యంలో చెట్లుచేసే సేవలు అమోఘం.చెట్ల వేళ్ళు, బెరడు, ఆకులు, పూలు, కాయలు, పుల్లలు,పండ్లు, విత్త నాలు మొత్తంగా అన్నిభాగాలను ఆయుర్వేదం, సిద్ద, యునానీ వైద్య విధానాలలో ఉపయోగిస్తారని చెప్పుకు న్నాం కదా!. వీటి నుంచి అనేకరకాల మందులను ఎన్నో మందుల కంపెనీలవారు తయారు చేస్తారు. పొలాల కు క్రిమి సంహారక మందులు కూడా చెట్ల ఆధారంగా తయారు చేస్తారు. 

 చెట్ల వేళ్ళు భూమిలోకి చొచ్చుకుపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. భూమిలోని సారాన్ని నీటిని చెట్టు లోని అన్ని భాగాలకు అందించటం వీటిపని

 కాండం లేక మాను, కొమ్మలు మిగిలిన అన్నిభాగాలకు ఆధారం. ఇది ఒక్కక్క సంవత్సరం ఒక్కొక్క చుట్టూ పెరుగుతూ ఉంటుంది. దీని అడ్డకోత చెట్టు వయసుని తెలుపుతుంది. బెరడు మానుని వాతావరణం నుండి, క్రిముల బారినుండి కాపాడుతుంది.

ఆకులు చిగురిస్తూ, పండిపోతూ, రాలిపోతూ ఉంటాయి. వసంతకాలంలో చిగురించిన చెట్లు ఆకర్షణీయంగా కొత్త అందాలను సంతరించుకుంటాయి. సూర్యరశ్మి నుండి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పత్ర హరితం సంపాదించి చెట్టుకి అందించటం వీటి పని. చెట్ల ఆకులు చాలావరకు చిన్నవిగా ఉండి క్రిమలనుండి చెట్లని రక్షిస్తూ వాటి జీవిత కాలాన్ని పెంచేదానికి దోహద పడతాయి.

పూలు తమ ఆకర్షణ ద్వారాప్రకృతి అందాలను ఇనుమడింప చేయడమేకాక చెట్ల తేనెటీగలు, సీతాకోక చిలు కలు మకరంద సేవనం చేసే కీటకాలను ఆకర్షించి సంతానోత్పత్తికి తోడ్పడుతాయి. తేనెటీగలు సేకరించిన మకరందం తేనెగా మారి ఔషధాలలోను, నేరుగా ఆహారంగాను మనం ఉపయోగిస్తూ ఉంటాము.కాయలు పండ్లుగా మారి సంతానోత్పత్తికి కావలసిన విత్తనాలను అందిస్తాయి. ఈ పండ్లను నేరుగాను, కాయలను వివిద రూపాలలోను ఆహారంలో చేర్చుకుంటూ ఉంటాం.

 విత్తనాలు చెట్లుతమ సంతానాన్ని విత్తనాల రూపంలో భద్రపరచుకుంటాయి. ఈ విత్తనాలను మనం ఆహారం గా వాడు కుంటాం. ఎలాగంటే  డ్రై ఫ్రూస్ట్రైన బాదం, పిస్తా, జీడిపప్పు ఎండిన రూపంలో వాడడుతాం కదా ! చూశారా చెట్టు  వివిధభాగాలు ఎలా తమ పనితాము చేస్తూ చెట్టూభివృధ్హ్దికి ఎలా సహకరిస్తున్నాయొ! వీటిని చూసి మనం మన కుటుంబాభివృధ్ధికి తగిన కృషి చేయాలని తెలియడం లేదూ? 

ప్రాణి కోటి జీవనానికి సంపూర్ణంగా సేవచేస్తూ తమ జీవితాలను అంకితం చేసే చెట్ల గురించీ కొద్దిగా చెప్పుకుందాం. 

 

 

మరిన్ని శీర్షికలు
saamaanyuni asahanam