Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
samaanyuni asahanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సిరాశ్రీ ప్రశ్న - -సిరాశ్రీ

sirasri question
.......ఇది బేతాళ ప్రశ్న కాదు

బేతాళప్రశ్నల గురించి విక్రమార్కుడి కథల్లో విన్నాం. బేతాళుడు అడిగే ప్రశ్నలకి సరైన సమాధనం చెప్పకపోతే తల వెయ్యి చెక్కలౌతుందట. ఇక్కడ అడిగే ప్రశ్నలకి సమాధానం ఏది సరైనదో అడిగే బేతాళుడికే తెలియదు. కనుక ఎవరి తలా చెక్కలవ్వదు. కనుక సరదాగా ఆలోచించి తోచిన సమాధానం చెప్పొచ్చు. ఇది కేవలం ఆలోచనాపరిధిని పెంచే సరదా ఆట అనుకోండి. అంతే. మీ సమాధానాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నలుగురి ఆలోచనల రాపిడిలోంచే జ్ఞానం పుడుతుంది. 


ఏదో ఆలోచిస్తుంటే రెండు వాదనలు మనసులోనే మెదిలాయి. 

1. ఒక్క శాస్త్రజ్ఞుడి తెలివి కోట్లమందికి దారి చూపించగలదు. తన తెలివినంతా ధారపోసి భావితరాల్ని సుఖపెడతాడు. కనుక అతను పుణ్యాత్ముడు. 

2. ఒక్క శాస్త్రజ్ఞుడి తెలివి కోట్లమంది జనాన్ని బుద్ధిహీనుల్ని చేయగలదు. మానవసహజమైన తెలివినంతా యంత్రాలకి అప్పజెప్పి భావితరాల్ని నిస్తేజుల్ని చేయగలడు. కనుక వాడు పాపి. 

పై రెండిట్లో ఏది కరెక్ట్?
మరిన్ని శీర్షికలు
mana arogyam mana chetullo