Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
super star mahesh super speed

ఈ సంచికలో >> సినిమా >>

పెళ్ళి చూపులు: చిన్న సినిమాకి పెద్ద గౌరవం

pellichoopulu movie success

పెద్ద సినిమాలు పెద్ద విజయాలు సాధించడం గొప్ప. అదే చిన్న సినిమా పెద్ద విజయం సాధిస్తే ఇంకా గొప్ప. కథలో దమ్ముండాలిగానీ చిన్న సినిమా ఏంటి? పెద్ద సినిమా ఏంటి? అంటారు సినీ పరిశ్రమలో చాలామంది. అలా కంటెంట్‌ ఉన్న సినిమా 'పెళ్ళి చూపులు'. స్టార్‌ కాస్టింగ్‌ అంటే పెద్దగా చెప్పుకోడానికేమీ లేదు. ఓ సినిమాలో హీరో ఫ్రెండ్‌గా నటించిన విజయ్‌ దేవరకొండ ఈ సినిమాలో హీరో. కొన్ని సినిమాల్లో హీరో ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లోనో, హీరోయిన్‌ ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లోనో కనిపించే అమ్మాయి ఈ సినిమా హీరోయిన్‌.

ప్రచారం కూడా గొప్పగా ఏమీ చేసెయ్యలేదు. కానీ, సినిమాలో కంటెంట్‌ ఉంది. దాని గురించే ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. అలా మౌత్‌ పబ్లిసిటీతో సినిమా ఘనవిజయాన్ని అందుకుంది. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఈ చిత్రాన్ని సెన్సిబుల్‌గా, ప్లెజెంట్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించడంలో సఫలమయ్యాడు. ఓ సినిమాకి ఇన్ని క్వాలిటీస్‌ ఉంటే సక్సెస్‌ అవకుండా ఉంటుందా? తెలుగు సినీ ప్రముఖులంతా ఇప్పుడు 'పెళ్ళి చూపులు' విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'ఈ సినిమాని తప్పక చూడండి' అని తెలుగు సినీ ప్రముఖులు చేస్తున్న ప్రచారం, ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. ఏదేమైనా చిన్న సినిమా పెద్ద విజయం సాధించడం అభినందనీయం. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam