Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vrukshamu - jeeva samrakshakulu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సామాన్యుని అసహనం - అనంత

 

 సింగపూర్ పాఠం - - 5

ప్రస్తుతం సింగపూర్ జాతీయ  సంపద - డబ్బు రూపం లో .. బిలియన్స్, ట్రిలియన్స్ బ్యాంక్స్ ఎకౌంట్స్ లో మూలుగుతున్నాయి.
బెంగుళూర్ అంత దేశం, మన దేశం అప్పుల్ని వేల సార్లు తీర్చినా సింగపూర్ దగ్గర  ఇంకా డబ్బు వుంటుందట.

ముంందు చూపుతో ముందుకు ముందుగానే  కోటాను కోట్ల డాలర్స్ దాచి పెట్టుకున్న దేశం నుంచి ఏం నేర్చుకోవాలి మన దేశం..?
వరుసగా వందేళ్ళు సింగపూర్ దేశం ఒక్క డాలర్ కూడా సంపాదించకపోయినా.. కూర్చుని తిన్నా తరగని నగదు నిల్వలున్నాయి.
మరి మనదేశం...?  కేంద్రప్రభుత్వం లక్షలకోట్లు అప్పు చేసింది. ఇక  రాష్ట్రాల సంగతి సరే సరి...
అప్పు తెచ్చిన లక్షల కోట్లు ఏమైపోయినట్లు...? మన దేశంలో ఎక్కడ సమస్యలు అక్కడే వున్నాయి ఇంకా...
పై పెచ్చు ఇంకా అప్పులు చేస్తూనే వున్నాయి మన కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు. .. అడిగే వాడు లేడు.
నిలదీసే వాళ్ళు లేరు.
 కెమికల్ , ఎలక్ట్రానిక్ పరిశ్రమల ద్వారా లక్షల కోట్లు విదేశీ ద్రవ్యం సంపాదిస్తూనే వుంది సింగపూర్...  వస్తు ఉత్పత్తితో పాటు సేవల ద్వారానే వేల కోట్లు ఆర్జిస్తోంది సింగపూర్. హెచ్.ఎస్.బి.సి. బ్యాంక్ , బ్యాంక్ అమెరికా, మైక్రో సాఫ్ట్ , ఐ.బి.ఎం, ఇంటెల్, ఫేస్ బుక్ , గూగుల్ , టి.సి.ఎస్, విప్రో ఎక్సెంచర్,  సోనీ++++ జనరల్ , హ్యుండాయ్, హితాచీ,  పానాసోనిక్, ఏపిల్, సాంసంగ్ లాంటి అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ఎన్నో... ఎన్నెన్నో... ఎప్పుడో కొలువుదీరి వేల కోట్లు వ్యాపారం చేస్తూ కోట్లాది డాలర్స్ సింగపూర్ ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు.
కారణం... ఆగ్నేయాసియా దేశాలకు కేంద్ర బిందువు కావటం , అత్యాధునిక నౌకాశ్రయం వుండటం, అంతర్జాతీయ స్థాయి ఎయిర్ పోర్ట్, దేశంలో ఎల్ల వేళలా ప్రశాంతత , భద్రతా - వుండటం తో ఎవరైనా, ఎక్కడి నుంచి వచ్చయినా   స్వేచ్చగా , నిర్భయం గా వ్యాపారం చేసుకునే సౌకర్యాలు ప్రధాన కారణాలుగా దేశం  ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిపోయింది.
సూపర్ లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్సే కాదు - నైన్ స్టార్ హోటల్స్ కూడా సింగపూర్ లో పొందుచేసుకున్నాయి.                    
ప్రపంచం లోని అత్యున్నత స్థాయి బ్రాండ్స్ సరసమైన ధరలకు దొరకటం ... పన్నులు తక్కువగా వుండటం - వస్తు ,  సేవల్లో నాణ్యత ఏ దేశస్తులయినా ఇట్టే ఆకర్షిస్తారు.
వీటితో పాటు కళాత్మకమైన చర్చ్ లు , మసీదులు, బౌద్ధ ఆరామాలు, హిందూ దేవాలయాలు పుష్కలంగా వున్నాయి.
ఎక్కడా.. ఎప్పుడూ ఏ కలహాలు చోటు చేసుకోలేదు.
ట్రేడ్ చేసుకుంటానని ఏ దేశం నుంచి ఎవరు వచ్చినా పైసా లంచం అడిగేవాళ్ళు లేరు.
గంటల్లోనే గవర్నమెంట్ పర్మిట్ దొరుకుతుంది.  
సింగపూర్ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే చాలు.
ఎవరైనా సంవత్సరానికి ఐదువేలు సింగపూర్ డాలర్స్ చెల్లించి నిజాయితీగా, నిర్భీతిగా చట్టబద్ధమైన వ్యాపారం చేసుకోవచ్చు.  
వాళ్ళకి బిజినెస్ వీసా వారం లోపలే సాంక్షన్ అయిపోతుంది.
దశాబ్ధాల క్రితమే బ్రతుకు దెరువు కోసం సింగపూర్ వలస వెళ్ళిన మొహమ్మద్ ముస్తఫా, షం`సుద్దీన్ అనే అన్న దమ్ములు రాత్రంత్రింబవళ్ళు  కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని లిటిల్ ఇండియా ఏరియాలో ముస్తఫా అనే షాపింగ్ మాల్ స్థాపించి  అనతికాలం లోనే  ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు.
రౌండ్ ది ని క్లాక్ - 24 గంటల్ ముస్తఫా షాపింగ్ సెంటర్ తిరిగే వుంటుంది.
1995  ఏప్రియల్ లో స్థాపించిన ఈ షాపింగ్ మాల్ ఒక రోజుకే కోట్లలో వ్యాపారం చేస్తుంది.
చాలా కాలం క్రితమే ఇది సింగపూర్ టూరిస్ట్ ఏట్రాక్షన్స్ లో ఒకటయిపోయింది. అలాగే ముత్తుకర్రీ , బనానా లీఫ్, ఆంధ్రా కర్రీ, కోమలా విలాస్ ఇలా ఎన్నో ఇండియన్ రెస్టారెంట్స్ పోటా పోటీగా వ్యాపారం చేసుకొంటున్నాయి.
ఇండియాలోలాగా మున్సిపాలిటీ వాళ్ళు , ఏలక్ట్రిసిటీ, సేల్స్ టాక్స్  వాళ్ళు వచ్చి లంచాలడగటం అక్కడెప్పుడూ ఎవరూ వినలేదు, కనలేదు.
యధారాజా తధాప్రజా...
రాజు నీతిమంతుడైతే ప్రజలందరూ ఆ దారినే వెళ్తారు.
మనదేశంలో అతి చిన్న హోదా వెలగబెట్టే కార్పోరేటర్ లక్షలు, కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్నా అడిగేవాడు లేడు - నిలదీసే వాడు లేడు.
ఇక ఎం. ఎల్. ఏ లని ఎంపీ లని, మంత్రుల్నేం నిలదీస్తారు...?
మన దేశంలో ఏ మాత్రం సిగ్గులేని వాళ్ళు రాజకీయ నాయకులే.
ఒక్క రాజకీయ వ్యవస్థనే కాదు, కార్య నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అన్ని వ్యవస్థలూ  బ్రష్టు బట్టిపోయాయి.
ఏ వ్యవస్థ మీద ఈ రోజు మన దేశం లో నమ్మకం లేదు.
ఈ రుగ్మతలు ఎప్పటికీ తొలిగిపోతాయో .. ఎప్పటికి నీతి , నిజాయితీలతో కూడిన పాలన లభిస్తుందో సామాన్యులకి అర్ధం కాక అసహనానికి లోనయి పోతున్నారు.
అతి చిన్న దేశం సింగపూర్ డాలర్ నోట్స్ ని జిరాక్స్ తీసి చూడండి. లేదా స్కాన్ చేసి చూడండి. సాధ్యం కాదు. సింగపూర్ ఎప్పటి నుంచో ప్లాస్టిక్ కరెన్సీ తయారు చేసుకుంటున్నారు. ఇంత వరకు సింగపూర్ డాలర్స్ కి నకిలీ నోట్లు రాలేదు.

భద్రతా విషయం లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారక్కడ.
మన దేశంలో...?
దేశం నిండా దొంగనోట్లే... పాకిస్థాన్ నుంచి నిరభ్యంతరంగా , నిత్యం సరఫరా అవుతున్నా ఇక్కడ పట్టించుకునే నాధుడే లేడు.
మన దేశ నాయకుల మూలంగా మన ప్రజలంతా ప్రపంచ దేశాల ప్రజల ముందు నిత్యం తలొంచుకు బతకాల్సిందే.
చివరగా హేట్సాఫ్ టు సింగపూర్ లీడర్స్, గవర్నమెంట్, అండ్ సిటిజెన్స్.

మరిన్ని శీర్షికలు
mana arigyam mana chetullo