Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review


చిత్రం: జ్యో అచ్యుతానంద 
తారాగణం: నారా రోహిత్‌, నాగశౌర్య, రెజినా, సీత, తనికెళ్ళ భరణి, హేమంత్‌, చైతన్య కృష్ణ, నాని (అతిథి పాత్రలో), పావని గంగిరెడ్డి తదితరులు 
సంగీతం: కళ్యాణ్‌ రమణి 
సినిమాటోగ్రఫీ: వెంకట్‌ దిలీప్‌ 
నిర్మాణం: వారాహి చలన చిత్ర 
నిర్మాత: రజనీ కొర్రపాటి 
దర్శకత్వం: శ్రీనివాస్‌ అవసరాల 
విడుదల తేదీ: 9 సెప్టెంబర్‌ 2016

క్లుప్తంగా చెప్పాలంటే

అచ్యుత్‌ (నారా రోహిత్‌), ఆనంద్‌ (నాగశౌర్య) అన్నదమ్ములు. అన్నదమ్ములిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. అన్నదమ్ముల్లానే కాదు, స్నేహితుల్లానూ ఉంటారు. ఒకరి కోసం ఒకరు ఏదైనా చేసేంత అనుబంధం ఇద్దరి మధ్యా ఉంటుంది. అలాంటి అన్నదమ్ముల జీవితాల్లోకి జ్యో (రెజినా) ఎంటరవుతుంది. వీరింట్లోనే ఓ పోర్షన్‌లో అద్దెకు దిగిన రెజినాపై ఇద్దరూ మనసుపారేసుకుంటారు. అయితే జ్యో, ఇంకో వ్యక్తిని ప్రేమించానంటూ అమెరికా చెక్కేస్తుంది. అచ్యుత్‌, ఆనంద్‌ పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. ఇంతలో జ్యో మళ్ళీ అమెరికా నుంచి వస్తుంది. అన్నదమ్ములిద్దరికీ ఐ లవ్‌ యూ చెప్పడంతో కథలో పెద్ద ట్విస్ట్‌. ఆ తర్వాత ఏమవుతుందన్నది తెరపైనే చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే

నారా రోహిత్‌ కాస్త బొద్దుగా కనిపించాడు. నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ పండించాడు, ఎమోషనల్‌ సీన్స్‌లో అలరించాడు. నాగ శౌర్య ఇప్పటికే నటుడిగా తానేంటో చాలా సినిమాలతో ప్రూవ్‌ చేసుకున్నాడు. తన పాత్రలో జీవించేశాడని ఈ సినిమాతోనూ అనిపించుకున్నాడు. నారా రోహిత్‌, నాగ శౌర్య మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. అన్నదమ్ముల్లా సరదా సరదాగా కనిపిస్తూనే, ఎమోషనల్‌ సీన్స్‌లోనూ అదరగొట్టేశారు. రెజినా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అండర్‌ ప్లేలో ఆమె పాత్ర ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.

కథ కొత్తగా ఉంది. వాస్తవానికి ఇది మూడు కథల సమాహారం. మూడు కథల్ని తక్కువ నిడివిలో అందంగా చెప్పాలనుకోవడం రిస్క్‌తో కూడుకున్న పనే. అయితే ఆ రిస్క్‌ని చాలా చక్కగా హ్యాండిల్‌ చేశాడు దర్శకుడు. మాటలు కూడా చాలా బాగున్నాయి. ఎడిటింగ్‌ బాగుంది. స్క్రీన్‌ ప్లే ఆకట్టుకుంటుంది. సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగా కుదిరింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి అవసరమైనంతమేర బాగా వర్క్‌ చేశాయి. నిర్మాణపు విలువలు చాలా చాలా బాగున్నాయి.

ఇలాంటి సినిమాలు చేయాలంటే దర్శకుడిలో కొత్తదనం కోరుకునే ప్యాషన్‌ మాత్రమే కాదు, నిర్మాతకీ ఆ అభిరుచి ఉండాలి. అన్నీ ఈ సినిమాకి బాగా కుదిరాయి. పాత్రల ఎంపిక దగ్గర్నుంచి, డైలాగ్స్‌తోపాటు స్క్రీన్‌ప్లే, సంగీతం, సినిమాటోగ్రఫీ.. ఇలా అన్ని విభాగాల మీదా దర్శకుడు పూర్తి కమాండ్‌తో సినిమా తెరకెక్కించాడు. గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే, అక్కడక్కడా ఎంటర్‌టైన్‌మెంట్‌, వీటన్నిటికీతోడు నటీనటుల ఎంపిక అన్నీ బాగానే కుదిరాయి. తొలి సగం సరదా సరదాగా సాగిపోతుంది. రెండో సగంలో కొంచెం వేగం తగ్గిందనిపిస్తున్నా, అది అర్థం చేసుకోదగ్గదేనని అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఓ మంచి ప్రయత్నం చేశాడు దర్శకుడు. క్లాస్‌ ఆడియన్స్‌నే కాకుండా మాస్‌ ఆడియన్స్‌నీ అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే

జ్యో అచ్చుతానంద ఆకట్టుకుంటాడండీ

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
mega ricords hangama started