Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

'మెగా' రికార్డుల హంగామా మొదలైంది

mega ricords hangama started

మెగాస్టార్‌ చిరంజీవి రికార్డుల వేట మొదలు పెట్టిన తరువాత, ఆయన సినీ రంగానికి దూరమయ్యేవరకూ రికార్డులంటే మెగాస్టార్‌, మెగాస్టార్‌ అంటే రికార్డులు అనేలా ఆయన కెరీర్‌ దూసుకుపోయింది. మెగాస్టార్‌ చిరంజీవి సినిమా వస్తోందంటే అంచనాలు ఆకాశాన్నంటేవి. ప్రీ రిలీజ్‌ రికార్డులు, పోస్ట్‌ రిలీజ్‌ రికార్డులతో తనకు తానే సాటి అనిపించుకున్నారాయన. సుమారు 9 ఏళ్ళ విరామం తర్వాత తెలుగు తెరపై హీరోగా రీ-ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి, ప్రీ రిలీజ్‌ రికార్డులు అప్పుడే షురూ చేశారు. నైజాం, ఓవర్‌సీస్‌ రైట్స్‌ విషయంలో కొత్త రికార్డుల్ని సృష్టిస్తోందట చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150'. ఫ్యాన్సీ ఆఫర్లతో రైట్స్‌ కోసం పోటీ పడ్తున్నారు ఈ సినిమాకి. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

సంక్రాంతికి ముందు రోజు భోగీ రోజున సినిమాని విడుదల చేస్తున్నట్లు దర్శకుడు వినాయక్‌ ఇటీవల ప్రకటించాడు. ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌, 'కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ' పతాకంపై నిర్మిస్తున్నాడు. కాజల్‌ అగర్వాల్‌ ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. చిరంజీవిని దేవుడిలా భావించే దేవిశ్రీప్రసాద్‌, మెగా రీ-ఎంట్రీ కోసం అదిరిపోయే ట్యూన్స్‌ని ఇవ్వనున్నాడట. ఏదేమైనా రికార్డుల హంగామా మొదలు పెట్టిన చిరంజీవి, సినిమా విడుదలయ్యేనాటికి ఏ రేంజ్‌లో రికార్డుల్ని కొల్లగొట్టేస్తాడో వేచి చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
akkineni nag anounced nag marriage...