Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nitin re entry

ఈ సంచికలో >> సినిమా >>

'జనతా గ్యారేజ్‌' 100 కోట్లు

janata garriage 100 crores

టాక్‌కి భిన్నంగా విజయ పథాన దూసుకుపోతున్న 'జనతా గ్యారేజ్‌' చిత్రం తొలి వారం రోజుల్లోనే 100 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సినీ వర్గాలే ఈ ఫిగర్‌ని చూసి ఆశ్చర్యపోతున్నాయి. జూనియర్‌ ఎన్టీయార్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. మంచి మెసేజ్‌ని, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో చెప్పడంలో దిట్ట కొరటాల శివ. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌ తక్కువయ్యిందనే టాక్‌ మొదట్లో వినవచ్చినా, ఆ టాక్‌ సినిమా వసూళ్ళపై ప్రభావం ఏమాత్రం చూపలేకపోయింది.

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రెజెన్స్‌ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌. అన్నిటికీ మించి, ఎన్టీయార్‌ తన పెర్ఫామెన్స్‌తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. సమంత, నిత్యామీనన్‌ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు. తమ తమ నటనతో సినిమా రేంజ్‌ని పెంచడంలో ఈ ముద్దుగుమ్మలిద్దరూ తమ పాత్రని బాగా పోషించారు. ఓవర్‌సీస్‌లో కూడా 'జనతా గ్యారేజ్‌' సంచలనాలే సృష్టించింది. తొలి రోజు నుంచీ స్టడీ కలెక్షన్లతో 'జనతా గ్యారేజ్‌' మంచి విజయాన్ని అందుకుంది. ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఇంతటి విజయాన్ని అందించిన సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు ఎన్టీఆర్‌. ఈ సినిమాతో ఎన్టీఆర్‌ విజయానికి తిరుగు లేకుండా పోయింది. వరుస విజయాలతో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చేసినట్లే ఎన్టీఆర్‌. నెంబర్‌ వన్‌ చైర్‌ వైపుగా దూసుకెళ్లనున్నాడనిపిస్తోంది యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
victory venkatesh 'guru'