Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
janata garriage 100 crores

ఈ సంచికలో >> సినిమా >>

విక్టరీ వెంకటేష్‌ 'గురు'

victory venkatesh 'guru'

హిందీలోనూ, తమిళంలోనూ మంచి విజయాన్ని అందుకున్న 'సాలా ఖదూస్‌' సినిమాని తెలుగులోకి విక్టరీ వెంకటేష్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్నారు. 'సాలా ఖదూస్‌'లో మాధవన్‌ పోషించిన పాత్రను తెలుగులో వెంకటేష్‌ పోషించనున్నాడు. ఈ పాత్ర కోసం మాధవన్‌ బాక్సింగ్‌ నేర్చుకున్నట్లుగానే వెంకటేష్‌ కూడా బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడట. డిఫరెంట్‌ గెటప్‌ని కూడా ప్లాన్‌ చేస్తున్నారట వెంకటేష్‌ కోసం. హెయిర్‌ని బాగా పెంచేసి, ఫిజిక్‌ని కూడా కొంచెం పెంచి వెంకటేష్‌ ఈ మధ్య డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. అదే లుక్‌ని సినిమాలో వెంకటేష్‌ మెయిన్‌టెయిన్‌ చేయనున్నాడని సమాచారమ్‌. 'సాలా ఖదూస్‌' సినిమాలో నటించిన రితికా సింగ్‌నే తెలుగులోనూ నటించనుంది.

ఈ సినిమాకి 'గురు' అనే టైటిల్‌ అనుకుంటున్నారు. ఓ అనామకురాల్ని బాక్సింగ్‌ ఛాంపియన్‌గా తీర్చిదిద్దడమే సినిమా కథాంశం. ఇంత చక్కటి కథాంశానికి 'గురు' అన్న టైటిల్‌కి మించినది ఇంకేముంటుంది? సో ఈ టైటిల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. వరుస విజయాలతో జోరు మీదున్న వెంకటేష్‌కి ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్‌ని తెచ్చిపెడుతుందంటున్నారు. కేవలం సక్సెస్‌లే కాకుండా సినిమాలు చేయడంలో కూడా వెంకీ ఫుల్‌ జోరుమీదున్నాడు. త్వరలోనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుంది. తెలుగు నేటివిటీ కోసం 'సాలా ఖదూస్‌'కి చాలా మార్పులు చేర్పులు చేయనున్నారు. ఇందులో మరో హీరోయిన్‌గా ఒక ప్రముఖ నటి నటించనుందని సమాచారమ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam