Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope14th october to 20th october

ఈ సంచికలో >> శీర్షికలు >>

నవ్వండి - నవ్వించండి - ​ సేకరణ - పోడూరి వెంకటరమణ శర్మ


1. సుబ్బారావు  ఇంకో మిత్రుడు రామారావు తో  - గుళ్లో ఒకాయన్ని కలిశాను రా.  ఆయన ప్రశ్నలకి జవాబు చెప్పలేకపోయాను 

రామారావు:  ఏమి ప్రశ్నలు అడిగాడు?

సుబ్బారావు : మా ఇద్దరిమధ్య సంభాషణ ఇలా నడిచింది 

నువ్వు ఎవరు బాబూ?

నేను సుబ్బారావు నండి 

నేను నీపేరు అడగలేదు. నువ్వు ఎవరు?

నేను బ్యాంకు మానేజర్ నండి 

నేను నీ ఉద్యోగం అడగలేదు.  నువ్వు ఎవరు?

నేను పూజారిగారి అబ్బాయినండి 

 నేను నువ్వు ఎవరి అబ్బాయివని అడగలేదు. నువ్వు ఎవరు?

నేను మనిషి నండి 

నేను నువ్వు మనిషివా లేక జంతువు వా అనిఅడగలేదు. నువ్వు ఎవరు?

ఇప్పుడే వస్తానని చెప్పివచ్చానురా అన్నాడు సుబ్బారావు 

రామారావు:  నడు వెళ్లి కలుద్దాము అన్నాడు. ఇద్దరూ ఆయన దగరికి వెళ్లారు 

ఆయన రామారావు ని చూడగానే నువ్వు ఎవరు బాబూ అన్నాడు 

రామారావు: మీరు ఎవరో నేనూ  అదే 

******************************************************************************
2. రామనాధ శాస్త్రి గారు మంచి పండితుడు

వారబ్బాయి వెంకట శాస్త్రి ని రామయ్య గారు అడిగాడు 
ఎవరబ్బాయివి బాబూ ?
వెంకట శాస్త్రి: రామనాధ శాస్త్రి గారి అబ్బాయినండి 
రామయ్య గారు:  ఓహో పండిత పుత్రుడివా ? అన్నాడు నవ్వుతూ 
వెంకట శాస్త్రి:  మా అన్నయ్య ఉన్నాడండి 

******************************************************************************

3. కొత్త కోడలు అత్తా రింటికి రాగానే కుటుంబ సభ్యులందరినీ ఉద్దేశించి ఇలా అంది 

నన్ను కుటుంబం లోకి ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. నేను రావడం వలన మిగతా వాళ్ళెవ్వరూ దయచేసి మీ పద్ధతులు ఏవీ మార్చుకోవద్దు. 
అంతకుముందు ఇల్లు క్లీన్ చేస్తున్నవాళ్లు కంటిన్యూ చెయ్యండి.
 వంట చేస్తున్నవారు మానకండి,
 బట్టలు ఉతుకుతు న్నవాళ్ళు అదే చేయండి

నేను మాత్రం బన్  తింటూ, ఫన్ అనుభవిస్తూ మీ సన్ ని కంట్రోల్ చేస్తాను 

​******************************************************************************

4. అమెరికా లో ఒక భారతీయ డాక్టర్ ఒక ప్రకటన చేశాడు  $20 కి ట్రీట్మెంట్ పొందండి నివారణ లేకపోతే $100 పొందండి.
 
ఒక అమెరికా లాయర్ ( అలా) అది చూసి $100 లు సులువు గా సంపాదించ వచ్చు అనుకుని ఆ భారతీయ డాక్టర్( భా డా) దగ్గరికి వెళ్ళాడు 
అలా:  నాకు నాలుక రుచి తెలియటం లేదండి అన్నాడు 

'భా డా'  నర్సుని పిలిచి 22వ బాటిల్ లో ఉన్న మందు మూడు చుక్కలు 'అలా'  నాలుక మీద వేయమన్నాడు. నర్సు అలా చేసింది
  
 'అలా' ఇది కిరసనాయిలు అన్నాడు 

అయితే మీకు రుచి తెలుస్తోంది $20 ఇచ్చి వెళ్ళండి అన్నాడు 

ఇంకో రెండురోజులకి మళ్ళీ ఎలాగయినా $100 సంపాదిద్దామని 'అలా' మళ్ళీ వచ్చాడు 

నాకు మరుపు ఎక్కువయింది ట్రీట్మెంట్ చెయ్యండి అన్నాడు 

మళ్ళీ 'భా డా'  నర్సుని పిలిచి 22వ బాటిల్ లో ఉన్న మందు మూడు చుక్కలు 'అలా'  నాలుక మీద వేయమన్నాడు.

'అలా' ఇదేమిటి మొన్న వేసిన కిరసనాయిలు మళ్ళీ వేశారు అన్నాడు 

అయితే మీకు మరుపు వ్యాధి ట్రీట్మెంట్ అయ్యింది $20ఇచ్చి వెళ్ళండి అన్నాడు 'భాడా '

పట్టువిడవని విక్రమార్కుడిలా రెండు రోజుల తరువాత మళ్ళీ వచ్చాడు 'అలా'

నాకు చూపు మందగించింది కళ్ళు సరిగ్గా కనబడటం లేదు అని వచ్చాడు 

'భాడా ' దానికి నావద్ద మందు లేదు ఇదుగో తీసుకోండి  $100లు అని ఒక నోట్ ఇచ్చాడు 

అది చూసి 'అలా' ఇదేమిటి ఇది $20 నోటు కదా? అన్నాడు 

అయితే మీకు చూపు బాగానే ఉంది$20 ఇచ్చి వెళ్ళండి అన్నాడు 'భాడా '

మరిన్ని శీర్షికలు
skandaphalam uses