Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with puri jagannaath

ఈ సంచికలో >> సినిమా >>

'ధృవ' ఆడియోకి 'కాటమరాయుడు' చీఫ్‌ గెస్ట్‌

druva audio function chief guest katamarayudu

అన్నదమ్ముల అనుబంధం గురించి ఆ కుటుంబానికే తెలుసు. కానీ కొన్ని కారణాలతో ఆ కుటుంబం చుట్టూ ఎన్నో ఊహాగానాలు. 'మేమంతా ఒక్కటే' అని అన్నదమ్ములు చాటి చెపుతున్నా గాసిప్స్‌ మాత్రం ఆగడంలేదు. ఆ గాసిప్స్‌కి ఇంకోసారి చెక్‌పెట్టడానికి మెగా ఫ్యామిలీ ఓ మెగా వేడుకలో కలవనుంది. అదే 'ధృవ' ఆడియో విడుదల వేడుక. రామ్‌చరణ్‌ హీరోగా, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న 'ధృవ' సినిమా ఆడియో విడుదల వేడుక అతి త్వరలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్‌కళ్యాణ్‌ని ఆహ్వానించినట్లు సమాచారమ్‌. పవన్‌కళ్యాణ్‌ కూడా, అన్న చిరంజీవి తనయుడైన రామ్‌చరణ్‌కి ఆశీస్సుందించేందుకోసం, తన తాజా సినిమా 'కాటమరాయుడు' షెడ్యూల్‌ నుంచి కొంత వెసులుబాటు కల్పించుకోనున్నాడట.

చిరంజీవి కూడా ఈ ఈవెంట్‌కి ప్రధాన ఆకర్షణ కానున్నారు. అయినప్పటికీ పవన్‌కళ్యాణే స్పెషల్‌ ఎట్రాక్షన్‌. ఎందుకంటే, చరణ్‌ వేడుకలకి పవన్‌ రావడంలేదన్న విమర్శ ఒకటుంది. అది తప్పు అని గతంలోనూ పవన్‌ నిరూపించినప్పటికీ, ఒక్క వేడుకకు హాజరవకపోతే దాన్ని చిలువలు పలవలుగా మార్చేస్తున్నారు కొందరు. ఏదేమైనప్పటికీ, 'ధృవ' ఆడియో విడుదల వేడుకకు పవన్‌ చీఫ్‌ గెస్ట్‌ అన్న వార్త మెగా అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ తీసుకొస్తోంది. 
 

మరిన్ని సినిమా కబుర్లు
what happend?