Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
what happend?

ఈ సంచికలో >> సినిమా >>

మోహిని జగన్మోహిని త్రిష

jaganmohini trisha

ఇటీవలే 'నాయకి' సినిమాతో ఆకట్టుకుంది త్రిష. భారీ అంచనాల మేర విడులైనా ఈ సినిమా ఆశించనంతగా విజయం అందుకోలేకపోయింది. కానీ 'నాయకి'గా త్రిష నటనకు అందరూ ఫిదా అయిపోయారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలయ్యింది ఈ సినిమా. అలాగే ఇప్పుడు మరో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీతో మన ముందుకు వస్తోంది త్రిష. ఈ సినిమాలో 'మోహిని' అవతారంలో వస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఆమె ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.

ఈ గెటప్‌లో త్రిషను చూపిన వాళ్లంతా షాకవ్వకుండా ఉండలేకపోతున్నారు. అలా ఉంది మరి ఆమె గెటప్‌. ఎనిమిది చేతుల్తో, ఎనిమిది అస్త్రాలను చేత బట్టి, జగన్మోహినిలా హుందాగా కూర్చున్న ఆమె లుక్‌ని చూసి, సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. 'నాయకి' సినిమాలోనూ త్రిష భయపెట్టింది. కానీ 'మోహిని'లో మరింత భయపెడుతుందట. అంతకు మించిన హారర్‌ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయట. అంతే కాకుండా త్రిష న్యూ గ్లామర్‌లో రెచ్చిపోనుందట 'మోహిని' సినిమాలో. విజువల్‌గా చాలా ఎఫెక్టివ్‌గా ఉండబోతోందట ఈ సినిమా. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది ఈ సినిమా. రమణా మాదేష్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్రిషకు మరో కెరీర్‌ బెస్ట్‌ మూవీ కానుందంటున్నారు ఈ సినిమా. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో త్రిష వయసుకు తగ్గట్లుగా హుందాతనం ఉట్టిపడేలా, విలక్షణ పాత్రల్ని ఎంచుకుంటోంది.కీప్‌ ఇట్‌ అప్‌ త్రిష. 

మరిన్ని సినిమా కబుర్లు
kcr  madhura history ready