Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kcr  madhura history ready

ఈ సంచికలో >> సినిమా >>

రెడ్‌ స్టార్‌ ఫస్ట్‌ టైమ్‌

red star first time

రెడ్‌ స్టార్‌గా పీపుల్స్‌ స్టార్‌గా తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి, ఎక్కువగా తన స్వీయ దర్శకత్వంలో, స్వీయ నిర్మాణంలోనే సినిమాలు చేస్తుంటారు. కానీ ఆయన ట్రెండ్‌ మార్చారు. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటించడానికి ఓకే చెప్పారు. 'హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య' సినిమా పేరు. ఇంతవరకు ఎన్నో విప్లవ చిత్రాల్లో నటించిన నారాయణమూర్తి, ఆ చిత్రాల ద్వారా వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపారు. ప్రధానంగా ప్రభుత్వ వేధింపులు, పోలీసుల్ని అడ్డం పెట్టుకుని పాలకులు సాగించే అరాచకాలు వంటి అంశాల్ని ప్రస్తావించారు.

అలాంటి ఆర్‌.నారాయణమూర్తి నుంచి ఓ పోలీస్‌ సినిమా రావడం ఆశ్చర్యం కలిగించకమానదు. పోలీస్‌ వ్యవస్థలోనూ మానవీయ కోణం ఉంటుందనీ, ఆ విషయాన్ని తమ సినిమా ద్వారా చూపించబోతున్నామనీ, కథ చెప్పగానే అంగీకరించినందుకు ఆర్‌.నారాయణమూర్తిని అభినందించకుండా ఉండలేకపోతున్నామని దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు. ఈ చిత్రంలో ఆర్‌.నారాయణమూర్తి సరసన జయసుధ నటిస్తున్నారు. బ్లాక్‌ మనీ, అవినీతి నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగుతుందట. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా మంచి మెసేజ్‌తో కూడిన చిత్రంలా ఆర్‌.నారాయణమూర్తి నటిస్తున్న 'హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య' ఘనవిజయం సాధిస్తుందని చదలవాడ శ్రీనిసారావు విశ్వాసం వ్యక్తం చేశారు. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam