Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaaluguyugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

నవ్వండి - నవ్వించండి - నాగ్రాజ్

1. వెంకటమ్మ గారి భర్తకి కాలుకి ఆక్సిడెంట్లో దెబ్బ తగిలి మంచాన పడ్డారు . . . .
ఆవిడని పరామర్శించడానికి  పక్కింటి పిన్ని గారు వచ్చారు . . . . . .
పిన్నిగారిని  చూడగానే  ఏడుపు ఆపుకోలేక  . . . . . . . . . .
ఎంత పని జరిగింది పిన్నిగారు, ఇలా జరుగుతుందని నేనస్సలు అనుకోలేదు, ఎంతో
ఆశపడి  దీపావళికి పట్టు చీర కొనుక్కుందామని దాచుకున్న డబ్బంతా ఈయన
హాస్పిటల్ బిల్లులకే ఖర్చు చేస్తానని ఊహించలేదు పిన్నిగారు అయ్యో . . . .
. . .
పిన్ని గారిని పట్టుకుని ఏడవ సాగింది . . . . . వెంకటమ్మ

******************************************************************


2. పండక్కి  మీ అత్తారింటికి వెళ్తున్నావా ........  ఆహా  నీదిరా
అదృష్టమంటే ....... ,
పెళ్లయి పదిహేళ్లయినా . . . . .  ఇంకా పండగలకి మీ అత్తరు
పిలుస్తున్నారంటే . . . .  నువ్వురా అదృష్ట వంతుడవు
మిత్రుడి అదృష్టాన్ని పొగడసాగాడు  సాంబయ్య  . . . . . . .
వైభవమా  నా బొందా   . . . . . ,
పండగలకి  పిండి వంటలు చేయడంలో మా మామకి సాయంగా ఉంటానని పట్టుబట్టి
తీసుకెళ్తాడు మా మామయ్యా . . . . . . .
అసలు విషయం కక్కాడు శివయ్య .

******************************************************************

3. ఒకావిడ  కొరియర్ బాయ్ తెచ్చిన పార్సెల్ ఓపెన్ చేసి చూసి ,  ఏడవడం  మొదలు పెట్టింది
ఏమైంది సరూ . . . . . . . అడిగాడు భర్త
ఫిఫ్టీ పెర్సెంట్  డిస్కౌంట్ దీవాళీ ఆఫర్ అంటే   ' షూ  '  ఆర్డర్ చేసానండి .
అయితే ఏం .......  షూ   పంపలేదా   ?
పంపారు  ఫిఫ్టీ పెర్సెంట్  డిస్కౌంట్ లో
ఒక్క కాలుదే . . . . . . . . .!!!!!!!!!!!

******************************************************************
4. వెర్రి నాగన్న   ;    నేనింత జాగర్తగా కవర్ చేసాను , నేను దీపావళి
టపాసులు కాల్చలేదు , ఇదంతా
బిల్డప్ అని ఎలా కనిపెట్టావురా  ?
మిత్రుడు       ;    ఒరేయ్ వెర్రోడా  టపాసులు పేల్చితే   వేళ్ళు కాలతాయ్
లేదా చేతులు కాలతాయ్ ,
మోచేతులు కాలవురా . . . . . . మోచేతుకి కట్టు
కట్టావ్  అది విప్పేయిరా

******************************************************************

5. నేను పంపిన దీపావళి టపాసులు బాగా పెలాయా బుజ్జి . . . . . .
ఫోన్లో అడిగాడు  బుజ్జి గాడి మామయ్యా . . . . . . .
ఓ    బ్రహ్మానందంగా  పేలాయి మామయ్యా  . . . . .
కాకపోతే  మీరు టపాసులు కొన్న షాపు వాడు వాటికి  సైలెన్సర్ బిగించి ఇచ్చి
నట్లున్నాడు . . . . .
అన్నీ ........  తుస్సు . . . . . . . బస్సు . . . . . . పుస్. . . . . .
. . అన్నాయ్

******************************************************************

6. టపాసులు పట్టు కున్నారా   ?
లేదు అట్లు పట్టుకున్న   . . . . . !

అట్లు పట్టుకుంటే  చెయ్యేలా కాలింది . . . . ?
అట్లు వేడిగా కావాలి పోగలుకక్కాలి  అని గద్దించి అడిగా మా ఆవిడని ,
అట్ల పెనంతో సహా చేతిలో పెట్టింది మాయావిడ  !

******************************************************************

7. అత్యంత  విలువయిన దీపావళి  గిఫ్ట్  తీసుకోండి  అంటూ కుటుంబ సభ్యులందరికి
తల ఒక బాక్స్
అందించాడు పెద్దాయన  . . . . . . . . .
అందరు ఎంతో ఉత్సాహంగా , ఆతృతగా  కాస్ట్లీ గిఫ్ట్ అయి ఉంటుందనుకుంటూ బాక్స్ ఓపెన్
చేశారు . . . . . . . . .
బాక్స్ లో ఒక కాగితపు లక్ష్మి దేవి పటం పైన . . . . " లక్ష్మి కటాక్ష
సిద్ధిరస్తు "   మీ అందరికి నా దీపావళి శుభాశీషులు ,    పెద్దల
ఆశీషులకంటే విలువైనది ఏముంటుంది  ఈ లోకంలో
అని  రాసి ఉంది .

మరిన్ని శీర్షికలు
guava help ness fruit