Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvandi - navvinchandi

ఈ సంచికలో >> శీర్షికలు >>

04-11-2016 నుండి 10-11-2016 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి :   ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి, మీ ఆలోచనలను వారితో పంచుకోవడం సూచన. నూతన పనులను చేపట్టు విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఉద్యోగంలో నలుగురిలో కలిసి పనిచేసే సమయంలో కలుపుకొని వెళ్ళట వలన మేలుజరుగుతుంది . అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మేలు. కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉండి వాటికి సమయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ధనమునకు సంభందించిన విషయాల్లో మీ శక్తికి తగినవిధంగా ఆలోచన చేయుట, కాస్త ప్రణాళికతో ముందుకు వెళ్ళుట మంచిది.

 

వృషభ రాశి  ఈవారం మొత్తంమీద పెద్దలతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలు కొంత లబ్దిని కలిగించేవిగా ఉండే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండుట సూచన. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, వాటికి సమయాన్ని ఇస్తారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం వలన నూతన అవకాశాలు పొందుతారు. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారినుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూలమైన సమయం ప్రయత్నం చేయుట మేలు.    

 

మిథున రాశి : ఈవారం మొత్తంమీద ప్రయాణాలు వాయిదావేయుట సూచన. నూతన ప్రయత్నాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించవల్సి వస్తుంది , జాగ్రత్త. మీయొక్క వ్యవహారశైలి మూలాన నూతన సమస్యలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల మూలాన పనిఒత్తిడి తప్పకపోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దల నుండి సలహాలను పొందుతారు వాటిని ఆచరించుట వలన లబ్దిని పొందుటకు అవకాశం కలదు. బంధువులతో కలిసి చేసే ప్రయత్నాల విషయంలో మీకేనంటూ ఒక స్పష్టమైన అవగాహన అవసరం.    

 

 

కర్కాటక రాశి :   ఈవారం మొత్తంమీద సంతానపరమైన విషయాలకు సమయం ఇస్తారు. మీ ఆలోచనలను ఎదుటివారు గౌరవించక పోవచ్చును. ఉద్యోగంలో అనుకోకుండా కార్యనిమ్మతమై దూరప్రదేశ ప్రయాణాలు చేయవలసి రావోచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. కుటుంబంలో సభ్యులమధ్య సాన్నిహిత్యం పెంచుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. మధ్యవర్తిత్వం చేయుట వలన నస్టపోయే ఆస్కారం ఉంది , కావున ఈ విషయంలో గొప్పలకు పోకపోవడం మంచిది. సున్నితమైన అంశాలకు సాధయమైనంత దూరంగా ఉండుట వలన లబ్దిని పొందుతారు.
 

         
సింహ రాశి : ఈవారం మొత్తంమీద బంధువులతో మీ ఆలోచనలను పంచుకుంటారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారితో సంప్రదింపులు జరిపే ఆస్కారం ఉంది. గతంలో రావాల్సిన ధనమ్ కాస్త ఆలస్యంగానైనా చేతికి అందుట అనేది సంతోషించదగిన విషయం. స్త్రీ / పురుష సంభందమైన విషయాల వలన మాటపడవలసి రావోచ్చును. మీ మటుకు మీరు కొన్ని కొన్ని హద్దులు ఏర్పరచుకోవడం వలన మేలుజరుగుతుంది. మిత్రులతో కలిసి చేపట్టిన పనుల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పనులను మొదలు పెడతారు.      

 

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబసభ్యులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఉద్యోగప్రయత్నాలు కాస్త శ్రమించుట ద్వారా కొలిక్కి వస్తాయి. బంధువులతో చర్చలు చేసే విషయంలో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండుట, వారై ఆలోచనలను గ్రహించే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. దూరప్రదేశం నుండి ఒక సంతోషకరమైన వార్తను వింటారు. గతంలో మధ్యలో ఆగిన విదేశీప్రయత్నాలను మళ్ళా కొనసాగించే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలను అమలుచేయుట మంచిది.

 

 

 

   తులా రాశి : .ఈవారం మొత్తంమీద సమయాన్ని సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేయుట సూచన. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో చర్చలకు అవకాశం ఇవ్వకండి. మీ ఆలోచనలు పెద్దగా ఉపోయోగం లేవనే విషయం కాస్త ఆలస్యంగా గ్రహిస్తారు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి వాటికి సమయం ఇస్తారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది కాకపోతే మీ ఆలోచనల స్థాయిమార్పు అవసరం. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది. విదేశాలలో ఉన్న బంధువుల నుండి నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం కలదు.

 

   

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద తాతతండ్రుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. గతంలో మధ్యవర్తిత్వం చేసిన వాటికీ సంబంధించి, పెద్దలకు సమాధానం చెప్పవలసి రావోచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో తోడ్పాటు లభిస్తుంది . వ్యాపారపరమైన విషయలలో నూతన పెట్టుబడులకు ఇది సమయం కాదు వేచిచూసే దొరని మంచిది. దూరప్రదేశప్రయాణాలు పెద్దగా అనుకూలించక పోవచ్చును, కావున వాయిదావేయుట ఉత్తమం. ఆరోగ్యం వలన కాస్త ఇబ్బందులు కలుగుతాయి. వైద్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరి, అశ్రద్ధవద్దు. చిననాటి మిత్రులను కలుస్తారు, వారితో ఆలోచనలు పంచుకుంటారు.

 

 

ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీదసమయాన్ని సరదాగా గడపాలనే ఆలోచన కలిగి ఉంటారు. ఉద్యోగపరంగా భాద్యత కలిగి ఉండుట సూచన. చేపట్టిన పనులకు జవాబుదారీతనం పెరుగుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకోకుండా వాయిదాపడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మీ ఆత్మీయుల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన.  విదేశీప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంది ప్రయత్నం పెంచుట సూచన. స్వల్పఆరోగ్యసమస్యలు తప్పకపోవచ్చును సమయానికి భోజనం చేయుట మంచిది. బంధువులతో కలిసి చేపట్టిన పనుల్లో అనుకోని ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది.

 

 

మకర రాశి  : ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులను తగ్గించుకోవడం వలన ఉద్యోగంలో అధికారులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు అలాగే నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. సేవాసంభందమైన పనులను మొదలుపెడతారు నలుగురికి ఉపయోగపడే పనులను చేపట్టుట మంచిది. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రయాణాలు చేయునాన్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యంలో అనుకూమైన మార్పులు వస్తాయి, సమయానికి భోజనము చేయుట మంచిది. మిత్రులతో సమయం గడుపుతారు.

 

 

కుంభ రాశి :  ఈవారం మొత్తంమీద చేసే ప్రతి ఆలోచన మిమ్మల్ని నిర్దేశించే అవకాశం ఉంది కావున అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోవడం ఉత్తమం. తలపెట్టిన పనులలో ఆశించిన ఫలితాలు వస్తాయి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు. కుటుంబంలో సభ్యుల ద్వార నూతన ఆలోచనలు వింటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానేఉన్న దానికితగ్గట్టుగా ఖర్చులు పెరుగుటకు ఆస్కారం కలదు. సమయానికి భోజనం చేయుట ఉత్తమం. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటిలో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. మీ మాటతీరు మూలాన కొంతమంది ఇబ్బందికి లోనవుతారు.

 

 

మీన రాశి :  ఈవారం మొత్తంమీద ప్రయాణాల మూలాన స్వల్ప ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది కావున వాటిని వాయిదా వేయుట ఉత్తమం. సంతానపరమైన విషయల్లో కొంత ఒత్తిడి పొందుతారు బాగా ఆలొచించి నిర్ణయం తీసుకోవడం సూచన. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న తడబాటులు ఉన్న సర్డుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో గుర్తింపును పొందుతారు. నలుగురికి ఉపయోగపడే పనులను మొదలు పెడతారు అందరిలో గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది.

మరిన్ని శీర్షికలు
harmful food items for brain