Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mangalampalli bala muralikrishna

ఈ సంచికలో >> శీర్షికలు >>

కొమ్మూరి వేణుగోపాల గారి కధ"ఇల్లు కొన్నాడు",సమీక్ష - అంబడిపూడి శ్యామసుందర రావు

illukonnaadu sameeksha

వృత్తి రీత్యా డాక్టరు అయినా వేణుగోపాల రావు గారు  సాహిత్యములో అనేక కధలు,నవలలు వ్రాసి తెలుగు సాహిత్యములో ఎనభైవ దశకము వరకు ప్రముఖ రచయితగా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి అయన కధలు నవలలోని పాత్రలు చాలా మటుకు నిత్యజీవితానికి  దగ్గరగా ఉండటం, పాత్రల చిత్రీకరణలో ఏ రకమైన భేషజాలు డాంబికాలు లేకుండా యదార్ధ స్థితిలో చూపటము ఈయన ప్రత్యేకతలు. కథను
నడిపించే తీరు ఆద్యంతము పాఠకులకు ఏ మాత్రము విసుగు పుట్టించకుండా ఆసక్తిగా చదివేటట్లు  ఈయన ప్రత్యేకత అందువల్లే నేటికీ  రంగములో అయన రచనలు ప్రజాదరణ  పొందుతున్నాయి.

ఈయన 1933లో విజయవాడ లో జన్మించారు అక్కడే విద్యాభ్యాసము పూర్తి చేసి హైదరాబాద్ లో వైద్య విద్యను అభ్యసించారు. 14వ ఏట నుండి  రచనాసక్తికలిగి 16వ సంవత్సరము నుండి రచనలు ప్రారంభించి చాలా కధలు నవలలు నాటకాలు  రచించారు" పెంకుటిల్లు, హౌస్ సర్జన్,పిల్ల దొంగ, కొమ్మూరి కధలు" మొదలైనవి ఈయన కొన్ని రచనలు ప్రస్తుతము అయన కధ" ఇల్లు కొన్నాడు "గురించి ముచ్చటించు కుందాము. ఈ కధ పూర్తిగా మధ్యతరగతి మనిషి భావజాలాన్ని ప్రతిబింభిస్తుంది. కధ ఒక  మధ్యతరగతి వ్యక్తి ఆందునా రిటైర్ అయిన  బ్రతకలేని బడిపంతులు సొంత  ఇంటి బలీయమైన కోరిక చుట్టూ తిరుగుతుంది అద్దె ఇళ్లలో ఉంటూ యజమానులు దాష్టీకానికి ఇబ్బందులు పడుతూ ఎలాగైనా సొంత ఇల్లు (అప్పుచేసైనా) సంపాదించుకోవాలని, ఆ తరువాత సొంత ఇంటి వల్ల కలిగే భాధలు,అప్పు తీర్చలేని
పరిస్థితి , ఇల్లు అద్దెకు ఇచ్చి అద్దెకు  ఉన్న వాళ్ళతో కలిగే ఇబ్బందులను చివరకు అంత  కష్టపడి కొన్న ఇల్లును అమ్మాలని నిర్ణ యించుకోవటం(నష్టానికి) చివరికి తన ప్రాణము మీదికి తెచ్చుకోవటాన్ని రచయిత ఏ రకమైన దాపరికాలు భేషజాలు కల్పనలు లేకుండా యదార్ధ స్థితిని మనస్సులకు హత్తుకునేలా వివరిస్తాడు కధ చదువుతుంటే ప్రధాన పాత్ర చిదంబరం పట్ల పాఠకులకు అపరిమితమైన జాలి కలుగుతుంది చివరలో "అయ్యో పాపము" అని ప్రతి పాఠకుడిచేత చెప్పించిన ఘనత కొమ్మూరి వేణుగోపాల రావు గారిది ఇంక  కథలోకి  వద్దాము.

కధలోని ప్రధాన పాత్ర, సూత్రధారి చిదంబరము అనే రిటైర్ అయిన బ్రతకలేని బడిపంతులు రిటైర్ అయినాక 55సంవత్సరాలకు, 100 రూపాయల లోపు జీతము తో రిటైర్ అయినా) ఆయనకు వచ్చిన 5000రూపాయలతో అయన అవసరాలు ఇల్లు కొనడము, కూతురు పెళ్లీమొదలైన సమస్యలు ఎలాపరిష్కరించుకోవాలోఅర్ధము కానీ పరిస్థితి. అద్దె ఇంట్లో ఉన్న చిదంబరం వర్షాకాలంలో పడే
ఇబ్బందితో కద ప్రారంభము అవుతుంది.వర్షానికి కురిసే ఇల్లు మూడు గదుల యింటిలో తడవని ప్రాంతము ఏది ఉండదు. తన యాభై ఐదు ఎళ్ల  వయస్సులో ఇంతకంటే మంచి ఇంట్లో ఎప్పుడు ఉండలేదు ఏ ఇంటి మీద స్వాతంత్రము లేకపోవటం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఎన్నో ఇళ్ళు మారాడు. ఎదురింటి వాడితో జగడాలు,ప్రక్క ఇంటి వాడితో విరోధాలు,పంపు దగ్గర దెబ్బలాటలు,అద్దె దగ్గర తగవులు
మొదలైనవేన్నో అనుభవించాడు ఉద్యోగము నుంచి రిటైర్ అయినాక లభించిన స్వేచ్ఛతో మనసు కూడా స్వేచ్ఛ వెతుకుతుంది అద్దె బ్రతుకుకు స్వస్తి  చెప్పాలని చూస్తుంది. తనకు ఒక ఇల్లు కావాలి అనిపిస్తోంది. ఆ ఆలోచన తో ఒకసారి ఒళ్ళంతా గగుర్పొడిచింది
అదొక తియ్యని అనుభూతి మన చిదంబరానికి . ఆ సమయములో చిదంబరము బ్రతికి చెడ్డ తన చిన్ననాటి స్నేహితుడు గోవిందరావు వచ్చి ,తనకు డబ్బు అవసరము కాబట్టి "ఎవరిని పడితే వాళ్ళను అడగలేను కాబట్టి (బాగా బ్రతికి చెడ్డ వాడు కదా) స్నేహితుడివి, నిన్నే సిగ్గువిడిచి అడుగుతున్నాను" అని తన భాధలు చిదంబరానికి చెప్పుకున్నాడు  తనకు డబ్బుఅవసరమని అందుకోసము ఇల్లు
అమ్మదలచుకొన్నానని చెప్పాడు ఖరీదు చేసే ఇల్లైనా నలుగురిలో చెప్పుకొని ఇల్లు అమ్మాలంటే నామర్దా, పరువు ప్రతిష్టలకు సంబంధినచిన విషయము.ఇంతా బ్రతుకు బ్రతికి ఇల్లు అమ్ముకున్నాడు అన్న అప్రతిష్ట వస్తుంది కాబట్టి ఈ ఇల్లు నీకే అమ్మేస్తాను ఎలాగూ నీదగ్గర రిటైర్ మెంట్ తాలూకు ఐదు వేలు ఉన్నాయి కాబట్టి ఇంకో మూడు వేలు ఎలాగో ఒకలాగా అప్పుచేసైనా ఎనిమిదివేలకు నాయిల్లు కొనుక్కో అని గోవిందరావు చిదంబరానికి చెప్పాడు చిదంబరానికి స్నేహితుడు ఒక కొత్త సమస్య తెచ్చిపెట్టాడు ఇల్లు కొనాలన్నా తన బలమైన కోరిక ఒక ప్రక్క అప్పుచేయాలన్న భయము ఒక ప్రక్క ఆలోచనలో పడ్డాడు చిదంబరం. "అయినా నాకు ఎందుకు ఇల్లు, అంత డబ్బులు నాదగ్గరలేవు"అని చిదంబరం గోవిదారావుతో అంటాడు ," ఇల్లు ఎందుకంటావు ఏమిటి సొంత ఇల్లు ఉండటం ఎంత అవసరమో ఇన్నాళ్లు అద్దె కొంపలలో ఉన్న నీకు నేను అంతగా చెప్పనవసరం లేదు ",అని గోవిందరావు చిదంబరము బలహీనతపై తన తేలితేటలను ప్రదర్శించాడు .
ఆలోచించుకొని రేపు చెపుతానని చిదంబరం సమస్యను ఆ రోజుకు దాటవేశాడు.

రాత్రంతా ఎడతెగని ఆలోచనలతో చిదంబరానికి నిద్ర పట్టలేదు మర్నాడు ఏమి ఆలోచించావు అని గోవిందరావు వచ్చి అడిగాడు.
"ఎనిమిది వేలు నాకు శక్తికి మించినది ఆరువేలకన్నా దమ్మిడీ ఎక్కువ ఇచ్చుకోలేను", అని చిదంబరము గోవిందరావుకు నిష్కర్షగా చెప్పాడు."ఆశకు అంతుండాలి తప్పేదేముంది నా పరువు ప్రతిష్టలను వేలం వేస్తాను ",అని గొవిందరావు వెళ్ళటానికి సిద్దమయినాడు.
"పోనీ ఇంకొక ఐదు వందలు ఇస్తాను "అని చిదంబరము అన్నాక గోవిందరావు ఒప్పుకొని "ముందు నీ దగ్గర ఉన్న ఐదువేలు ఇవ్వు మిగిలిన డబ్బు ఇంటి తాకట్టు మీదబలరామయ్యతో చెప్పి నేను ఇప్పిస్తాను నీవు నెమ్మదిగా తీర్చుకోవచ్చు", అని చిదంబరంతో అన్నాడు. అప్పు తాకట్టు అన్నాక ముందు చిదంబరం భయపడ్డాడు మనసు పనిచేయటము మానింది ఎలాగూ రంగములోకి దిగాను ఏం
జరుగుతుందో జరగనియ్యి అన్న మొండి ధైర్యము వచ్చింది. ముచ్చటగా మూడురోజుల్లో వ్యవహారము అంతా కొలిక్కి వచ్చింది పెళ్ళికి
వెళ్లిన భార్యా పిల్లలు తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళను ఆశ్చర్యలో ముంచి ఇంటి విషయము చెప్పాలని మరో ఐదు వందలు అప్పుచేసి మరమత్తులు కూడా పూర్తిచేసి ఇల్లు స్వాధీనము చేసుకున్నాడు సొంత ఇల్లు చవకగా సంపాదించుకున్నందుకు స్నేహితులు ఈర్ష్యతో అభినందించారు చిదంబరానికి సొంత ఇంటివాడు అయినందుకు కొద్దిగా  గర్వము కూడా వచ్చింది.

పెళ్ళికి వెళ్లిన భార్యా పిల్లలు ఇంటికి వచ్చి తాళమువేసిన ఇల్లును చూసి చిదంబరము ఎక్కడ తిరుగుతున్నాడా అని తిట్టుకున్నారు కొత్త ఇల్లు రిపేర్లు ముగించుకొని ఇంటికి వచ్చిన చిదంబరము ఉత్తరము వ్రాయకుండా ముందే వచ్చిన భార్య పిల్లలను విసుక్కోని ఇల్లు కొన్న  చెప్పకుండా పెళ్లి విషయాలు అడిగాడు భార్య పెళ్లి విషయాలకన్నా ముఖ్య విషయము అని ఆవిడ తమ్ముడు కట్నము లేనిదే కూతురు జానకిని చేసుకోరుట అని బాంబు లాంటి వార్త మొగుడికి చెప్పింది ఈ వార్త విన్నచిదంబరానికి తలతిరిగింది. ఇన్నాళ్లు కూతురికి మేనరికం ఉంది కట్నము లేకుండా పెళ్ళిచేయొచ్చు అన్న ధీమాతో ఉన్నాడు ఇప్పుడు కధ అద్దము తిరిగింది. భార్య రిటైర్ మెంట్ డబ్బులు ఉన్నాయి కదా కట్నము ఇచ్చి పెళ్ళిచేద్దాము అంటుంది. అప్పుడు చిదంబరము ఇల్లు కొన్నాను అని భార్య పిల్లలకు చెప్పాడు వార్త విన్న కుటుంబసభ్యులు కొయ్యబారిపోయారు. సంతోషముగా  గర్వంగా చెప్పాలనుకున్న వార్త ఈ రకముగా చెప్పవలసి రావటము చిదంబరానికి
కూడా భాధ వేసింది .రెండు మూడు క్షణాలా భయంకర నిశ్శబ్దము తర్వాత ఒక్క మాట  అయినా చెప్పకుండా ఇలా ఎందుకు చేశారని అంది. చిదంబరానికి అసమర్ధత తో కూడిన కోపం వచ్చి భార్యను తిట్టాడు. "ఇంతకీ ఎవరి ఇల్లు ఇంతకీ కొన్నారు",అని భార్య కొడుకు ప్రశ్నించారు ."గోవిందరావుగారి ఇల్లు ఐదువేలకు కొన్నాను ",అప్పుచేసానంటే ఇంకా సమస్యలు వస్తాయని రేటు విషయము అబద్ధము
చెప్పిఎల్లుండే గృహప్రవేశము అని ప్రకటించి వీధిలోకి వచ్చాడు.

కొత్త ఇంట్లోకి చేరి పదిహేను రోజులైనాక "ఈ భాగము అద్దెకు ఇవ్వబడును" అని బోర్డు తగిలించి ఆ బోర్డు చూసుకుని  మురిసిపోవటం ప్రారంభించాడు. తీర్ధ ప్రజలులా  కాకపోయినా రోజుకు ఒకళ్ళు ఇద్దరు వచ్చిఇల్లు చూసి మాటలాడి వెళుతున్నారు ము ప్పై రూపాయలు అద్దె చెపుతున్నాడు. చివరకు ఒక ప్లీడర్ గారు భార్య,ఇంటర్ మీడియట్ (పాత రోజుల్లో ఎస్.ఎస్.ఎల్.సి తరువాత చదువు) చదివే కొడుకుతో ఇంట్లో అద్దెకు దిగాడు. భార్య పిల్లలకు తెలియకుండా చెప్పకుండా చేసిన అప్పును ఎలా తీర్చాలి ఎలా డబ్బును దాచాలి అని పధకాలు వేస్తూ కాలము గడిపేస్తున్నాడు.అప్పుడప్పుడు అప్పిచ్చిన బలరామయ్య పలకరింపులతో రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చిదంబరము ఇంటికి వచ్చేసరికి భార్య, ప్లీడర్ గారి భార్య  నీళ్ల కోసము హోరాహోరీగా పోరాడుతూన్నారు ఇన్నాళ్లు అద్దె ఇళ్లలో ఉండి యజమాను లతో పేచీలు ప్రస్తుతము ఇంటి  హోదాల ఉన్నా అద్దెకు ఉన్నవాళ్ళతో పేచీలు తప్పవని చిదంబరానికి అర్ధమయింది భార్యకు సర్దుకు పోవాలని సలహా ఇచ్చాడు.ప్లీడర్ గారు లా పాయింట్లతో వేపుకు తినేస్తున్నాడు.

నెలకు అనుకున్నంత  దాచలేకపోతున్నాడు ఈ లెక్కన అప్పు ఏనాటికి తీరెను. వీటికితోడు ప్లీడర్ గారి కొడుకు తన వంక అదోలా చూస్తున్నాడని కూతురు భార్యకు కంప్లైంట్.ఆ తరువాత లవ్ లెటర్ వ్రాసే దాకా వ్యవహారము వెళ్ళింది ఆ లెటర్ పుచ్చుకొని ప్లీడర్ గారిని  అడిగితె ప్లీడర్ గారు ఆ లెటర్ ను సాంతము చదివి ,"మీ అమ్మాయి అలుసు చూసుకొనే  మావాడు ఉత్తరము వ్రాసి ఉంటాడు మావాడు అటువంటి వాడు కాదు ", అని ఎదురు దాడికి దిగాడు. అప్పిచ్చిన బలరామయ్య చిదంబరం ఇల్లు చౌకగా కొట్టేశాడని  ప్రచారము,తన ఇంటికెదురుగా వెలసిన వెచ్చాల షాపు వాడికి ఇల్లు అద్దెకు ఇవ్వలేదన్న  కోపము,వీళ్లంతా ఎందుకు తన మీద కత్తి  కడుతున్నారో చిదంబరానికి అర్ధము కావటము లేదు ఈ సమస్యలకు తోడు కూతురు పెళ్లి, తానూ కట్నము ఇచ్చి పెళ్ళిచేసే పరిస్థితిలో లేడు  బావమరిది మా అబ్బాయికి సంబంధాలు వస్తున్నాయి మీ సంగతి తేల్చి చెప్పండి అని అల్టిమేటమ్ గా ఉత్తరము వ్రాశాడు ఆ ఉత్తరము మీద చర్చలో చిదంబరము సహనము కోల్పోయి భార్య మీద చేయి చేసుకుంటాడు. ఇదంతా గమనిస్తున్న కూతురు అమ్మను కావిలించుకొని బావురు మంటుంది భార్యను కొట్టినందుకు సిగ్గు పడి ఆలోచనలతో వీధిలోకి వస్తాడు పోనీ కొడుక్కి చెల్లెలు కూతుర్ని అనుకుంటున్నాము కదా చెల్లెల్ని కట్నము అడిగి ఆ డబ్బును  కూతురికి కట్నముగా ఇస్తే సరిపోతుంది అన్న ఆలోచనకూడా వచ్చింది కానీ ఆలోచన తనకే న్యాయము అనిపించలేదు ఇంటికి చేరినా మనస్సుకు శాంతి లేకపోవటం,కుటుంబ సభ్యులమధ్య మనస్పర్థలు అన్నిటికి కారణము ఇల్లుకోనటమే అన్న నిర్ణయానికి  చిదంబరము వచ్చాడు రిటైర్ మెంట్ డబ్బులే ఉంటె పిల్లకు పెళ్ళిచేసేవాడు కొడుకు అవసరాలు తీర్చేవాడు తనకు కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చేవి కావు చివరికి భార్య ,"మీ పాదాల మీద పడి ప్రాధేయ పడుతున్నాను అమ్మాయి పెళ్లి అయే మార్గము చూడండి ",అని బ్రతిమాలింది. గొడవ జరిగినాక ప్లీడర్ ఇల్లు ఖాళీ చేశాడు ఆ తరువాత ఇల్లు అద్దెకు అడిగేవారే కరువయినారు  

 కూతురి పెళ్ళికి ఇల్లు కొనటానికి సంబంధము లేదని పించినా ప్రస్తుత పరిస్థితిలో ఇల్లు అమ్మడానికి కూతురి పెళ్ళికి సంబంధము ఏర్పడింది అన్న ఆలోచనతో ఒక్కసారి చిదంబరానికి ఒళ్ళు ఝల్లు మంది. ఇల్లు అమ్మటానికా కొన్నది . ఇప్పటివరకు తీర్చిన అప్పు వడ్డీ కె సరిపోయింది అసలు అలాగె ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో అప్పుతీరతాము అన్నది కలలో మాట. ఇంకా కొన్నాళ్ళు పొతే ఇంటికోసము చేసిన అప్పు తీర్చటానికి ఇల్లు అమ్మాల్సి వస్తుంది. ఏ ఇంటికోసము అయితే అప్పుచేశాడో ఆ ఇంటినే అమ్మాల్సి రావటము చిదంబరానికి  భరించ లేనంత భాధను కలుగజేసింది దీనికి తోడు బావమరిది బెదిరింపు ఉత్తరాలు భాధను ఇంకా ఎక్కువ చేశాయి హాఠాత్తుగా  ఓరోజు దృఢ నిశ్చయానికి వచ్చిన చిదంబరము బలరామయ్య ఇంటి వైపుకు బయలుదేరాడు దారిలో కళ్ళుతిరిగి పడిపోవటంవల్ల ఇంటికి రిక్షాలో వచ్చి
మరునాడు చిన్నకొడుకును బలరామయ్య ఇంటికి కబురు పంపించాడు అరగంటలో బలరామయ్య వచ్చి ఎందుకు పిలిచావని అడిగాడు. బలరామయ్యతో తలుపులు మూయమని సైగ చేసి తలుపులు మూసి వచ్చిన బలరామయ్యతో ,"నా ఇంటిని అమ్ముతున్నాను, నాకు ఇల్లు అమ్మక తప్పటము లేదు పదిమందిలోబరము పెట్టి ధర పెంచే ఓపిక లేదు. నీకు నాయిల్లు కొనటం ఇష్టమేనా?,"అని సూటిగా అడిగాడు దానికి బలరామయ్య కొంచము అలోచించి ,"నాకు ఇష్టము లేని మాట నిజమే కానిఈకు డబ్బు అవసరమై అమ్ముతానంటున్నావు  కాబట్టి కొంటానులే "అని తన దాతృత్వాన్ని చాటుకున్నాడు  రేటు విషయము వచ్చేటప్పటికి ఒకనాడు చిదంబరం పదిహేను వేలు విలువ చేసే ఇంటిని ఆరు వేలకే చవకగా కొట్టేశాడని ప్రచారము చేసిన బలరామయ్య ప్రస్తుతము మార్కెట్ లేదు రేట్లు లేవు అని కుంటిసాకులు చెపుతూ అయిదు వెలకన్నా దమ్మిడీ ఎక్కువ ఇవ్వలేను అని నిష్కర్షగా చెప్పాడు చివరికి చిదంబరము బ్రతిమాలాగా ఇంకో అయిదు వందలు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు చిదంబరం అప్పును ఎలా తిరిగి వసూల్ చేయాలా అని ఆలోచిస్తున్న బలరామయ్యకు
సమస్య ఇంట సులువుగా పరిష్కారము అయినందుకు మనసులో చాలా ఆనంద పడ్డాడు.

మూడురోజుల్లో ఇంట్లో ఎవ్వరికి తెలియకండానే ఇల్లు అమ్మకం పని పూర్తిఅయింది ఇల్లుకొంటాము అమ్మటం రెండు ఇంట్లో వాళ్లకు తెలియకుండానే చిదంబరము పూర్తి చేశాడు బలరామయ్య బాకీ పొను చిదంబరానికి మూడువేల రెండు వందలు మాత్రమే చేతికి వచ్చాయి. ఆ రోజు రాత్రి భార్యను ప్రేమ గా పిలిచి ,నీరసముగా తడబడుతూ ," ఇల్లు అమ్మకం పూర్తిఅయింది మూడువేల రెండు వందలు నాజేబులో ఉన్నాయి మీ తమ్ముడికి కట్నము ఇస్తామని ఉత్తరము వ్రాయి మన అమ్మాయి పెళ్లి సలక్షణముగాజరుగుతుంది" అని చెప్పిన కాస్సేపట్లోనే స్పృహ తప్పాడు పెద్దకొడుకు హాడావుడిగా డాక్టరు ను తీసుకు వచ్చి పరీక్ష చేయిస్తే పరిస్థితి ప్రమాదకరంగా ఉంది ఏ సంగతి చెప్పటం కష్టము అయినా ప్రయత్నిద్దాము అని అన్నాడు చుట్టాలు చుట్టూ ప్రక్కల వాళ్ళు వచ్చారు తెల్లవారు ఝామున చిదంబరానికి గురక ప్రారంభమయింది . సరిగా ఆ సమయానికి బలరామయ్య మనుషులు వచ్చిఇంట్లో చచ్చి పోవటానికి వీలు లేదు బయట పెట్టండి అని బంధువుల సహాయముతో రోగిని బయట చలిలో పడుకోబెట్టారు బయటకు తీసుకు పోతుంటే భార్యకూతురు,పిల్లలు ఒక్కసారిగా గొల్లుమన్నారు ఈ విధముగా ఒక మధ్య తరగతి బ్రతకలేని బడిపంతులు రిటైర్ అయినాక తన సొంత ఇంటి కల నెరవేర్చుకుందామన్న ప్రయత్నములో ఇల్లు కొనటం అమ్మటము చివరికి ప్రాణాలను వదులుకోవటము పాఠకులకు కంట తడిపెట్టిస్తుంది సొంత ఇల్లు
లేకపోవటం వల్ల ఇంటి బయట ప్రాణాలు వదలవలసిన పరిస్థితి రావటము హ్రదయవిదారకము . 

మరిన్ని శీర్షికలు
Ayurvedic Tips to improve your complexion, Fairness and Skin Glow |