Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sunny leone  feel happy

ఈ సంచికలో >> సినిమా >>

నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌

biggest block bustter

వైవిధ్యభరితమైన సినిమాల్ని ఎంచుకుంటూ కెరీర్‌లో మంచి దూకుడు ప్రదర్శిస్తున్నాడు యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్ధ. నిఖిల్‌ తాజా సినిమా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించింది. 500, 1000 నోట్ల రద్దు తరువాత ఏర్పడ్డ కరెన్సీ సంక్షోభంలోనూ ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించడం సినీ వర్గాల్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇప్పటికే నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అనే మార్క్‌ని చేరుకున్న 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఇంకా మరింత పెద్ద విజయం సాధించేందుకు పరుగులు పెడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి టాక్‌ని సొంతం చేసుకోగా, విదేశాల్లోనూ అబ్బురపరచే కలెక్షన్లు వస్తుండడంతో చిత్ర యూనిట్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. కష్టపడితే మంచి విజయాన్ని అందుకోవచ్చని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. థ్రిల్లర్‌ సినిమాకి కామెడీ టచ్‌ ఇస్తే గ్యారంటీ హిట్‌ అనే భావన టాలీవుడ్‌లో ఉంది. దానికి ఈ చిత్రం ఇంకో చక్కటి ఉదాహరణగా నిలిచింది. కథలతో ప్రయోగాలు చేస్తూనే, ఆ ప్రయోగంలోనూ ఎంటర్‌టైన్‌మెంట్‌ని చూసుకోవడం ద్వారా నిఖిల్‌ సక్సెస్‌ల మీద సక్సెస్‌ సాధిస్తున్నాడు. ఈ తరహా సినిమాలకి నిఖిల్‌ బిగ్గెస్ట్‌ హీరో అనే భావన ఇండస్ట్రీలో నెలకొంటోంది. ఏం చేసినా ప్రేక్షకుల్ని రంజింపజేయడానికేననీ, తమ ప్రయత్నాలు వరుసగా విజయవంతమవుతుండడం  చాలా ఆనందంగా ఉందని 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సక్సెస్‌పై నిఖిల్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 

మరిన్ని సినిమా కబుర్లు
latest and hottest pooja hegde