Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Causes of SHAKING & TREMBLING | Home Remedies & Ayurvedic Treatment in Telugu by Dr. Murali Manoahar

ఈ సంచికలో >> శీర్షికలు >>

గుళ్ళో గంట ఎందుకు కొట్టాలి ఎలా కొట్టాలి - ......

treditional   information
ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి...భక్తితో భగవంతుని మూల విరాట్టుని కనులారా దర్శిస్తూనే భక్తులు చేసేది గంటను తాకి మోగించడం....తమ చేత్తో మోగించిన ఘంటానాదం చెవులకు సోకగానే ఎదురుగా చూసే స్వామివారు, అమ్మవార్ల రూపు మనసులో ప్రతిష్టించుకోగా, కన్నులు అరమోడ్పులవుతాయి....అయితే, అసలు ఘంటానాదం ఎందుకు చెయ్యాలి? భగవంతునికీ, ఘంటానాదానికీ ఏమిటి సంబంధం? దైవ దర్శనంతో, పూజలతో పుణ్యాన్ని ఆశించే భక్తులు, ఘంటానాదం చెయ్యడం, వినడంతో ఎటువంటి సత్ఫలితాలను పొందుతారు?

ఘంటానాదం పరమార్ధం

శ్లో" ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం,
కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంచనమ్.

అర్ధం;- ఈ ఘంటా శబ్దం వల్ల దుష్ట శక్తులు పారిపోవాలని, దేవతలు, దైవీ శక్తి రావాలని పూజా సమయానికి పూర్వం ఘంటానాదం చేస్తాము.
పూజా సమయంలో దేవాలయాల నుండి మనం ఘంటానాదాన్ని వింటుంటాం. ఈ శబ్దం వినేవారికి భక్తి భావం జాగృతమౌతుంది. భారతదేశంలోని కొన్ని గ్రామాల్లో ఎడ్ల మెడచెట్టు గంటలు కట్టడాన్నిమనం చూస్తూంటాము. ఆ గంటల శబ్దం ఎంతో రమణీయంగా ఉండి మన సంప్రదాయ భావనలను తడుతుంది. 

దేవాలయాల నుండి వెలువడే వివిధ స్థాయిలలో ఉండే గంటల శబ్దం యొక్క ప్రభావాన్ని అనేక సార్లు పరిశోధకులు అధ్యయనము చేయడం జరిగింది. గంట శబ్ధం " ఓం" కారాన్ని స్ఫురింపచేస్తుందని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. గంట యొక్క శబ్దం తరంగ రూపంలో వ్యక్తమై క్రమక్రమంగా తగ్గు ముఖం పడుతుంది. ఆ "ఓం"కార నాదం మన మనస్సును ఎంతగానో ప్రేరేపిస్తుంది. శంఖారావంతో కూడిన ఘంటా నాదం భక్తుల మదిలో భక్తి భావాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ నాదం మన ఏకాగ్రతా శక్తిని కూడా పెంచుతుంది. 

శబ్దము, ధ్వని వేర్వేరా? రెండింటికీ తేడా ఏమిటి??

శబ్దము=ధ్వని, నాదము అని రెండు విధాలు. ధ్వని అనగా ఒక సారి వినబడి ఆగి పోయేది. నాదమనగా అవిచ్చిన్నంగా సాగెడి శబ్దము. న అనగా ప్రాణమని, ద అనగా అగ్ని అని ప్రాణాగ్నుల కలయికయే నాదమని పండితుల అభిప్రాయం. ఈ నాదము శ్రావ్యమై, రసానుభూతమై, రక్తిని, ఆనందాన్ని కలుగచేయును.

ఘంటానాదంచే జనించు శబ్ద తరంగములు చెవి మీద మరియు దానికి సంబంధించిన నరములపై చాలా మంచి ప్రభావము చూపించును. కర్కశమైన శబ్దముల వలన చెవులు దెబ్బ తిని, చెవుడు రావడం జరుగును. ఇటువంటి పరిణామములు అంతో ఇంతో తక్కువ గానీ అనునదే ఒక విధమైన వ్యాయామములె ఈ ఘంటానాదం ఉద్దేశ్యము. 

సాధారణంగా గంటలను మనము దేవాలయాలలోను, చర్చిలలోనూ చూస్తుంటాము. భగవద్భక్తి ప్రపంచంలో ప్రతిధ్వనింపచేయుటకు గంటలు ఉద్భవించినవని కొందరి అభిప్రాయం. జైన, బౌద్ద మతాలలో సైతము గంటలకు విశిష్టస్థానమున్నది. దేవాలయాలలోను, చర్చిలలోను గంటలను మ్రోగించునపుడు మతపరమైన కొన్ని రకాల తంతులు నిర్వహించబడును. 

ఇతర లోహములతో తయారు చేసిన గంటల కన్నా బంగారం, వెండి లోహాలతో చేసిన గంటల శబ్దము మృదువుగా చెవుల కింపుగా ఉండును. కాని ఈ రోజులలో చాలా చోట్ల మూడు వంతుల రాగి, ఒక వంతు తగరము కలిపిన గంటలే ఉంటున్నవి. 

ఏదేమైనా ఈ ఘంటానాదం వలన భగవంతుని ఉనికిని ప్రతిధ్వనింప చేయడానికే కాక, దుష్ట శక్తులను [ వివిధ రకాల రోగ క్రిములు] పారద్రోలేందుకు ఉపయోగ పడును.

ఘంటానాదం ఎలా చెయ్యాలి?
చాలామంది గంటను బలంగా మోది పెద్ద శబ్దం కోసం ప్రయత్నిస్తుంటారు....అలా చెయ్యకూడదు....దీని వల్ల పాపపుణ్యాల ప్రసక్తెలా ఉన్నా, ప్రశాంతత కోసం ఆలయానికి వచ్చిన ఇతర భక్తుల ఏకాగ్రతకు భంగం కలుగుతుంది...అంత గట్టిగా కొట్టడం వల్ల అందులోని మృదుత్వం పోయి ఒక్కోసారి కర్ణ కఠోరంగా అనిపిస్తుంది కొందరికి....
సుతారంగా...మెల్లగా సున్నితంగా ఘంటానాదం చేయ్యడం మంచిది....అది వినసొంపైన నాదాన్ని జనియింపజేస్తుంది...మనసును భక్తి తరంగాలలో ఓలలాడిస్తుంది...

 నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు
మరిన్ని శీర్షికలు
cartoon competetion