Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
Aadhaar for Maheshbabu

ఈ సంచికలో >> సినిమా >>

పవన్ కళ్యాణ్ తో కోన వెంకట్

Kona Venkat With Pawan Kalyan

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నంబర్ వన్ పొజిషన్లో ఉన్న కోన వెంకట్ త్వరలో దర్శకుడిగా అవతారం ఎత్తబోతున్న సంగతి తెలిసిందే. ఒక ఇంటర్వ్యూ లో స్వయంగా ఆయనే ఈ విషయం తెలియజేసారు. ఇటు తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా కథలు, కథనాలు అందిస్తున్నారు కోన. అయితే ఆయన హింది సినిమాకి దర్శకత్వం వహిస్తారా? లేక తెలుగు సినిమాకా? ఒక వేళ తెలుగు అయితే ఎవరితో? అనేవి శేష ప్రశ్నలు. కాగా, తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే త్వరగా కథ తయారు చేసుకుంటే సంపత్ నందితో గబ్బర్ సింగ్-2 పూర్తయిన తర్వాత మొదలుపెడదామని కోన వెంకట్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారట. అంటే పవర్ స్టార్ హీరోగా, కోన వెంకట్ దర్శకుడిగా మరో ఆరు నెలల్లో సినిమా సెట్స్ మీదకు వెళ్ళొచ్చన్నమాట. 

మరిన్ని సినిమా కబుర్లు
cinema title for manchu family multistarrer