Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bahubali 2 expectations  thousand crores

ఈ సంచికలో >> సినిమా >>

57 ఏళ్ళ నవ మన్మథుడు

nagarjuna was so glamour in raju gari gadi 2

వయసు మీద పడే కొద్దీ కొత్త ఉత్సాహంతో కనిపించడమెలాగో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నిరూపించారు. వయసు అరవైలలో ఉన్నా, మనసు ఇరవైలలో ఉంటే ఎనభైల వరకూ ఆనందంగా ఉండొచ్చంటారాయన. అందుకే, అక్కినేని ఎప్పటికీ కుర్రాడిలానే ఉన్నారు. జీవితం చివరి రోజుల్లో కూడా ఉత్సాహంగా తెరపై కనిపించడం అక్కినేని నాగేశ్వరరావుకే చెల్లింది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడేమో, టాలీవుడ్‌ నవ మన్మధుడు అక్కినేని నాగార్జున కూడా ఐదు పదుల వయసులో ఇంకా జస్ట్‌ పాతికేళ్ళ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. 'రాజుగారి గది-2' ఆన్‌ లొకేషన్‌ స్టిల్స్‌ని నాగ్‌ తాజాగా సోషల్‌ మీడియాలో విడుదల చేశాడు.

ఈ స్టిల్స్‌ చూస్తే, నాగార్జునకి 57 ఏళ్ళ వయసని ఎవరూ ఒప్పుకోరు. హ్యాపీగా ఉండటమే తన గ్లామర్‌ సీక్రెట్‌ అంటారాయన. ఎలాంటి స్ట్రెస్‌నీ ఆయన దరి చేరనీయడు. అందుకే 57 ఏళ్ళ వయసులో ఇంకెవరికీ సాధ్యం కాని హ్యాండ్సమ్‌ లుక్‌ని నాగ్‌ సొంతం చేసుకున్నాడు. 'రాజుగారి గది-2' సినిమా దగ్గరకొస్తే, ఇందులో ఆయన మెంటలిస్ట్‌గా నటిస్తున్నాడు. సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర ఇది. ఈ పాత్ర కోసం నాగార్జున చాలా బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ చేశాడట. 'చంద్రముఖి'లో రజనీకాంత్‌ తరహా పాత్ర అట. అందుకే నాగ్‌ 'రాజుగారిగది-2' స్టిల్స్‌లో చాలా హ్యాండ్సమ్‌గా, జోవియల్‌గా కనిపిస్తున్నట్టున్నాడు. సీరత్‌కపూర్‌, సమంత ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు. 

మరిన్ని సినిమా కబుర్లు
who won song