Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri question
అజయ్, విజయ్ అని ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు.

అజయ్: శరీరంలో అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తూ బ్రెయిన్ ఒక్కటి డెడ్ అయిన వాడు.  విజయ్: బ్రెయిన్ ఒక్కటి షార్ప్ గా ఉండి మిగిలిన శరీరం అంతా చచ్చు బడిపోయిన వాడు.

ఇంతవరకు ప్రపంచ వైద్య చరిత్రలో జరగలేదు కానీ...విజయ్ బ్రెయిన్ ని అజయ్ కి విజయవంతంగా ట్రాన్స్-ప్లాంట్ చేశారు అనుకుందాం. 

కళ్లు తెరిచిన అజయ్ ఎవరిలా బ్రతుకుతాడు? 

అజయ్ జ్ఞాపకాలతోనా? 

విజయ్ జ్ఞాపకాలతోనా?

పాజిబిలిటీ-ఎ: ఒకవేళ అజయ్ జ్ఞాపకాలతో బ్రతినట్టైతే బ్రెయిన్ అనేది మిగతా అవయవాల్లా ఒక అవయవం అంతే...దానిని నడిపే శక్తి ఏదో ఉన్నట్టే. అదే మనం అనుకునే ఆత్మ. ఇన్నాళ్లు మనం ఉందని అనుకుంటున్న ఆత్మ నిజంగా ఉందని నిరూపించవచ్చు. 

పాజిబిలిటీ-బి: ఒకవేళ విజయ్ జ్ఞాపకాలతో బ్రతికినట్టైతే కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాగ సర్వం బ్రెయిన్ లోనే ఉంటాయి అని నిరూపించుకుని ఆత్మ కాన్సెప్ట్ పూర్తిగా రూల్ ఔట్ చేసేయొచ్చు. అప్పుడు మతవిశ్వాసాలు, స్పిరిచువాలిటీ అన్నీ రూల్ ఔట్ అయిపోయినట్టే. 

పాజిబిలిటీ-సి: పై రెండూ కాకుండా బ్రెయిన్ లో స్టఫ్ అంతా డిలీట్ అయిపోయి అజయ్ శరీరానికి ఫ్రెష్ గా మరో బాల్యం మొదలై ప్రతిదీ నేర్చుకుంటూ బ్రతుకుతున్నట్టైతే అప్పుడు కూడా ఆత్మ కాన్సెప్ట్ లేదనే అనుకోవాలి. ఎందుకంటే రోబో టెక్నాలజీకి, దీనికి పెద్ద తేడా లేనట్టే కదా! 

నా ప్రశ్న ఏమిటంటే, పై కేసులో ఏ పాజిబిలిటీ కి ఎక్కువ చాన్స్ ఉందని అనుకుంటున్నారు?
మరిన్ని శీర్షికలు
Sri Vinayaka VrataKalpam- story written by Sri Malladi Venkata Krishna Murthy