Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi

గతసంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue228/634/telugu-serials/premiste-emavutundi/premiste-emavtundi/

(గత సంచిక తరువాయి)... శరణ్య మొబైల్ లో అలారం మోగింది. తెల్లవారితే ఆదివారమేగా లేట్ గా లేచినా నష్టం లేదు అనుకుని రాత్రి బాగా పొద్దుపోయిందాకా చదువుకుంటూ నోట్స్ తయారు చేసుకుంటూ కూర్చుంది.. పడుకునే సరికి రెండు దాటింది. కాకపోతే ప్రతి  రోజు త్వరగా లేవాలి కాబట్టి మొబైల్ లో ఆరింటికి అలారం సెట్ చేసి పెట్టుకుందేమో తను ఆలస్యంగా లేవచ్చు అన్న విషయం తెలియని అలారం ట్రింగ్ మని మోగింది.  

అలారం మోతకి గాఢ నిద్ర డిస్టర్బ్ అవడంతో విసుగ్గా బ్లాంకెట్ కొంచెం తొలగించి  ఆరే కదా  అనుకుంటూ  ఎడం చేయి చాచి మొబైల్ చేతికి అందక పోడంతో తిరిగి కళ్ళు మూసుకుంది శరణ్య.

కానీ ఆమె పడుకోడం ఇష్టం లేనట్టు మొబైల్ ఆగకుండా మోగుతూనే ఉంది  మరికొంచెం చేయి చాచి అందిన మొబైల్ తీసుకుని, కళ్ళు మూసుకునే చేత్తో తడుముకుంటూ ఇగ్నోర్ నొక్కింది. రెండు నిమిషాల తరవాత మళ్ళి మోగింది.  ఓ గాడ్ ఇవాళ నన్ను పడుకోనివ్వవా కసిగా   బ్లాంకెట్ విసిరి లేచి కూర్చుని మొబైల్ తీసుకుంది.

తనని ఆదివారం పొద్దున్నే డిస్టర్బ్ చేసిన వాళ్ళెవరో అని కోపంగా నిద్ర కళ్ళతో స్క్రీన్ మీద పేరు కోసం చూసింది తేజ కాలింగ్ అని కనిపించింది. ఆమె నిద్ర మత్తు ఎగిరిపోయింది.. ఆన్సర్ బటన్ నొక్కి బద్ధకంగా అడిగింది.

“ హలో  పొద్దున్నే పనేం లేదా నీకు ఈ డిస్టర్బెన్స్ ఏంటి?”

“టైం తెలుసా  పొద్దున్నే ఏంటి? అడిగాడు. “

“ యా ఐ నో  ఓన్లీ సిక్స్ “  అంది.

“ ఓసి నిద్రమొహమా  సరిగా కళ్ళు తెరిచి టైం చూడు.. పదకొండు అవుతోంది..”   “ ఏయ్ కమాన్ ఏం కావాలో చెప్పు నేను పడుకోవాలి”  అంది.

“ శరణ్యా!  నిజం చెప్తున్నా  పదకొండు... నీ క్లాక్ రాంగ్ టైం చూపిస్తోంది. ఇంక లేచి, రెడీ అయి తాజ్ కి రా లంచ్ కి ...” శరణ్య అనుమానంగా వాల్ క్లాక్ వైపు చూసింది.. నిజంగానే పదకొండు దాటి ఎనిమిది నిముషాలు... ఆశ్చర్యం వేసింది.. ఏంటి తన మొబైల్ ఆరింటికి మోగుతుందే... ఇదేంటి? అనుకుంటూ  “ అవును తేజా ఎలెవన్.... మై గాడ్”  గబుక్కున మంచం దిగి తేజతో మాట్లాడుతూనే బ్రష్, పేస్టు తీసుకుంది.

“ఎందుకు లంచ్? “ బ్రష్ నోట్లో పెట్టుకుని అడిగింది.

“ లంచ్ లంచంగా ఇచ్చి నీ చేత ఐ లవ్ యు చెప్పించాలని..”

“ పిచ్చి వేషాలేస్తే నాకు పోస్టింగ్ రాగానే ముందు నిన్ను కరప్షన్ కేసులో ఇరికించేస్తా జాగ్రత్త..”

“ అలాగే చేద్దువుగాని ఫాస్ట్ గా రెడీ అయి వచ్చెయ్ బై ....”

“ ముందు చెప్పు ఎందుకు లంచ్ ?”

“ అబ్బా నువ్వొక జిడ్డు. ఇవాళ ఒక చిన్న షార్ట్ ఫిలిం ప్రివ్యూ చూపిస్తున్నాను... ప్రెస్ మీట్ ఉంది. తాజ్ లో లంచ్ సరేనా ...” సమాధానం కోసం ఆగకుండా ఫోన్ పెట్టేసాడు తేజ.

శరణ్య గబ, గబా  తయారై లాంగ్ స్కర్ట్ వేసుకుని మంచి టాప్ వేసుకుని, జుట్టు వదిలేసింది.

లిఫ్ట్ కోసం చూడకుండా రెండు అంతస్తులు చక,చకా దిగేసి సెల్లార్ లో ఉన్న బైక్ స్టార్ట్ చేసింది.

ఆమె తాజ్ కృష్ణ చేరేసరికి వొంటిగంట అయింది. మొదటిసారిగా అక్కడ అడుగుపెట్టిన శరణ్య ఆ వైభవం చూసి ముగ్దురాలైంది. అడుగడుగునా పచ్చదనం, లాన్ లో బుద్హుడి విగ్రహం, వెండి, బంగారాలు కరిగించి నిర్మించినట్టు ఉన్న నిర్మాణం,  వజ్రాలు పోదిగినట్టున్న గచ్చు...  ఎక్కడ అడుగుపెడితే అక్కడ మాసిపోతుందో అనిపిస్తోంది.

బైక్ పార్క్ చేసి  లోపలికి వెళ్ళడానికి ఏదో ఇబ్బందిగా అనిపించింది... తేజకి కాల్ చేసింది.

“ ఎక్కడున్నావు?” అడిగాడు..

“ ఎంట్రన్స్ వైపు వస్తున్నా .నువ్వు బయటికి రా నాకు ఎందుకో అనిజీగా ఉంది....”

తేజ ఆమెతో మాట్లాడుతూనే బయటకి వచ్చాడు.. శరణ్య కనిపించగాగే మొబైల్ డిస్కనెక్ట్ చేసి దగ్గరగా వచ్చాడు..

ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తూ  “ ఎందుకలా ఉన్నావు? ఇంకా నిద్రమత్తు వదల్లేదా?”  అడిగాడు.

“ఏం లేదు అయాం ఓ కే ...” అంది..

“ నీ మొహం నీకన్నా నాకే బాగా కనిపిస్తోంది.. “ నవ్వుతూ అన్నాడు..

అతని మాటలు పట్టించుకోకుండా అంది..” ఇది హోటలా! స్వర్గమా ...”

“ ఓహ్ నీకు నచ్చిందా... అయితే మన ఫస్ట్ నైట్ ఇక్కడే  అరేంజ్ చేస్తా..”  అప్పటికే శరణ్య చేయి నెమ్మదిగా భుజం మీద గిల్లడంతో నోట్లోంచి రాబోయిన కేక బయటికి రాకుండా కంట్రోల్ చేసుకుంటూ.. “రాక్షసీ”  అన్నాడు.

“ అర్ధమైందిగా.... హోల్డ్ యువర్ టంగ్ ”   అంది..

కోపంగా ఆమె వైపు చూడబోయి నవ్వేసి,  అందరూ కూర్చున్న దగ్గరకు తీసికెళ్ళి  ఒకొక్కరినే  పరిచయం చేసాడు. అందరూ పెద్ద, పెద్ద పారిశ్రామిక వేత్తలు.... కొందరు సినిమా ఇండస్ట్రి కి చెందినవాళ్ళు, విలేఖరులు,  ఆఖరికి పరిచయం చేస్తున్న వాళ్ళని చూసి ఆనందంగా హాయ్ మీరంతా.. అంది వాళ్ళ పక్కన కూర్చుంటూ..  వాళ్ళు ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ పి జి లో క్లాస్ మేట్స్. శరణ్య ని వాళ్ళకి అప్పచెప్పి తను అతిధుల దగ్గరకు వెళ్ళిపోయాడు తేజ.

“హాయ్ శరణ్య “ ఆర్తి వచ్చి హాగ్ చేసుకుని “ చాలా రోజులైంది కదా మనం కలిసి... ఎలా ఉన్నావు.. ఏం చేస్తున్నావు”  అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.. అజయ్, చైతు, పూనమ్ బిలబిలా చుట్టేసారు..హయ్ అంటూ.. .

శరణ్య అందరికి హాయ్ చెప్పి వెయిటర్  తెచ్చిన  జ్యూస్ తీసుకుని వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పింది.

’ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్  మనం ఇవాళ ఇలా కలుసుకునే ఛాన్స్ కల్పించినందుకు తేజకి లాట్ ఆఫ్ థాంక్స్”  అన్నాడు అజయ్.  నవ్వింది శరణ్య.
    ‘ మన పి.జి అయాక అసలు కలవలేదు కదా! ‘’  అంటూ ముగ్గురు వాళ్ళ గురించి చెబుతూ, శరణ్య గురించి అడుగుతూ ఊపిరి సలపకుండా చేసారు.. తేజ అతిధులతో మాట్లాడుతూ మధ్య, మధ్య వీళ్ళ దగ్గరకు వచ్చి జ్యూస్ తీసుకున్నారా... మంచురియా తీసుకున్నారా... బాదం మిల్క్  తీసుకున్నారా  అంటూ అడుగుతూ...శరణ్య తో  ‘’లంచ్ అయాక ఫిలిం ప్రెజంటేషన్ ఉంటుంది.. పుస్తకాలు ఎదురుచూస్తున్నాయి అంటూ పారిపోకు’’ అని ప్రత్యేకంగా చెప్పాడు.

‘’ డోంట్ వర్రీ తేజా మేమున్నాంగా .... వెళ్ళనివ్వం’’  అంటూ మిగతావాళ్ళు భరోసా ఇవ్వడంతో నవ్వి వెళ్ళిపోయాడు.  

తేజ , శరణ్య, డిగ్రీ నుంచి పి..జి వరకూ కలిసి చదువుకున్నారు... అజయ్ బృందం పిజి లో కలిసారు.   తేజ మంచి స్నేహశీలి.. తండ్రి ఇండస్ట్రియలిస్ట్ ... తేజ ఒక్కడే కొడుకు... బోలెడు ఆస్తి.. అయితే చాలామంది డబ్బున్నవాళ్ళ పిల్లల్లా  అహంభావం లేదు. క్రమశిక్షణ, ప్రిన్సిపల్స్ ఉన్న యువకుడు.. తను కోటిశ్వరుడి కొడుకును అన్న విషయం  మర్చిపోయి  అందరితో సరదాగా, స్నేహంగా ఉండడం అతని ప్రత్యేకత.. అందుకే తేజ అంటే చాలా మంది ప్రాణం పెడతారు.. ఫైవ్ స్టార్ హోటల్ కి ఎంత దర్జాగా వెల్తాడో, ఇరానీ కేఫ్ కి కూడా అంతే  దర్జాగా వెళ్తాడు.. లగ్జరీ కారులో కాలేజ్ కి వచ్చినా, ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆర్  టి సి బస్సులో కూడా అంతే  ఠీవిగా వెళ్తాడు..

తేజ అడిగితె గుండె కోసి ఇవ్వడానికి కూడా వెనుకాడని  మంచి స్నేహితులు ఉన్నారు.. అందరిని ప్రేమిస్తాడు.. అందరిని అభిమానిస్తాడు.. అందరిలో శరణ్య అంటే పిచ్చి అభిమానం.. శరణ్యకి కూడా తేజ లోని నిరాడంబరత,  క్రమశిక్షణ , స్నేహశీలత అంటే ఎంతో ఇష్టం.. ఇద్దరి మధ్యా కొన్ని విషయాల్లో ఎంత తారతమ్యం ఉందో కొన్ని విషయాల్లో అంత సాన్నిహిత్యం ఉంది.

శరణ్య సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, పెరిగిన అమ్మాయి.. తండ్రి బ్యాంకు ఆఫీసర్...తల్లి గృహిణి... శరణ్య కి ఇద్దరు అక్కలు ... పెద్దక్క ఇంజనీర్, రెండో అక్క డాక్టర్.. ఇద్దరికీ ఈ మధ్యే పెళ్ళిళ్ళు అయాయి.. శరణ్యని కూడా ఇంజనీరింగ్ చదివించాలనుకున్నా ఆమెలో విషయ పరిజ్ఞానం పట్గ్ల ఉన్న ఆసక్తి, అభిరుచి చూసాక ఆమెని తన ఇష్టానికి వదిలేసాడు ఆమె తండ్రి . శరణ్య పి జి పూర్తీ కాగానే జూనియర్ కాలేజిలో లెక్చరర్ గా చేస్తూ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతోంది. తేజకి మీడియా అంటే ఇష్టం అంచేత మాస్ కమ్యూనికేషన్స్ చేస్తున్నాడు.

శరణ్యకి చదువంటే ఇష్టం.  ఎప్పుడూ ఆమె చేతిలో ఏదో ఒక పుస్తకం ఉంటుంది.. అది క్లాస్ పుస్తకం లేదా జనరల్ నాలెడ్జి , లేదా సాహిత్యం, లేదా చరిత్ర,  బయోగ్రఫీ అలా ఏదో ఒకటి చదువుతూ కూర్చునే శరణ్య ని పోయిన జన్మలో నువ్వు చెదపురుగు అయి ఉంటావేం.... అని ఆట పట్టిస్తుంటాడు తేజ. అవునేమో అంటుంది శరణ్య చిరునవ్వుతో.. చదువు తప్ప మరో విషయం ఆలోచించని శరణ్య అతనిలో మంచి స్నేహితుడినే చూసినా, తేజ మాత్రం అతనికి తెలియకుండానే ఆమెని ప్రేమించసాగాడు.

తన చుట్టూ తిరిగే అమ్మాయిల్లో కనిపించని ఆకర్షణ, అందం ఏదో అతనికి శరణ్య లో కనిపిస్తుంది.. ముఖ్యంగా ఆమె వ్యక్తిత్వం అతనికి ఎంతో ఇష్టం. ఆమె పట్ల స్నేహం కాక మరేదో మధురమైన భావన ఉందన్న విషయం  అర్ధం అయాక ఆమెకి మరింత దగ్గరగా రావడానికి కృషి చేసాడు. కృషిలో భాగంగా చదువు పూర్తీ అయి కాలేజ్ బయటికి వచ్చాక కూడా ఎక్కడోక్కడ, ప్రతిరోజూ బంజారా హిల్స్ నుంచి ఆమెని కలుసుకోడానికి ఆమె పని చేసే కాలేజికో, లేదంటే లిబర్టి లో ఉన్న ఫ్లాట్ కో , లేదంటే ఆమె రోజు వాకింగ్ చేసే పార్క్ కో వచ్చేస్తుంటాడు..  తండ్రికి ప్రతి రెండేళ్ళకి బదిలీలు అవుతుండడంతో  అక్కా, చెల్లెళ్ళు చదువుల కోసం హైదరాబాద్ లోనే ఉండడం.. అక్కలిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోడంతో వంటరిగా ఉంటున్న శరణ్యకి అతని స్నేహం అపురూపంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. అంతేకాదు తను స్వయంగా నిర్ణయం  తీసుకోలేని ఎన్నో విషయాల్లో మంచి సలహాలు ఇస్తుండే  తేజ ఆమెకి  ఎంతో ఆత్మీయుడుగా అనిపిస్తాడు.

ఆమెకి అన్ని విషయాల్లో లాగే పెళ్లి, ప్రేమ అనబడే  ఈ రెండిటి విషయంలో కూడా ప్రత్యేకమైన, నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి.. మంచి స్నేహం ప్రేమ వ్యామోహంలో పడితే చెడిపోతుందని ,, స్నేహితుడు భర్త అయేకన్నా , భర్త స్నేహితుడులా ఉంటే జీవితం బాగుంటుందని నమ్ముతుంది.  అంతే కాక  ప్రేమ, పెళ్లి అనే మాయజాలంలో పడితే కెరియర్ ముగిసిపోతుందన్న భయం ఆమెలో ఉండడం వల్ల తేజ  ప్రేమ పేరు ఎత్తగానే ఆమెకి నీరసం వస్తుంది.. మగవాళ్ళు ఆడవాళ్ళతో ఒక మంచి స్నేహం ఎందుకు చేయరు..  స్నేహానికి పరాకాష్ట ప్రేమేనా... మరి ప్రేమకి పరాకాష్ట పెళ్ళా ! అలా అయితే తేజ కూడా మాములు మగవాడా! అతనిలో ప్రత్యేకత ఏమి లేదా! అనుకుంటుంది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham