Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue241/659/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/ 

(గత సంచిక తరువాయి)...

కోపంగా చూసి వెనక్కి తిరిగి పోయింది. నున్నగా, తెల్లగా మెరిసిపోతున్న వీపు మీద ముద్దాడాడు. ఒళ్ళంతా జల్లుమని వెన్ను మిలమిలా వంగింది.

ఎదురుగా అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని ఆశ్చర్యంగా చూసుకుంది.

తనేనా? ఆ అద్దంలో కనిపిస్తున్నది తన రూపమేనా? ఉప్పొంగిన ఎద తెల్లని హిమగిరి శిఖరాల్ని తపిస్తుంటే మత్తులో సోలుతున్న కళ్ళు , విడివడిన పెదాలు, లోతుకుపోయిన పొట్ట, దృఢంగా వున్న జఘనం, శృంగార రసాధిదేవత వీనస్లా వున్నది తనేనా?

అద్దంలో తన వెనుక ఆకాష్ ప్రతిబింబం కనిపిస్తోంది. తల కొంచెం తిప్పి చూడబోయింది.

మెడ మీద అతని వేడి వూపిరి తగిలింది. తేరుకునే లోపే వెచ్చని ముద్దులతో తన మెడ మురిసి పోయింది.

అతని చేతులు ఆమె హృదయం మీద పడ్డాయి. ఇక తట్టుకోవడం ఆమె వల్ల కాలేదు. గబుక్కున వెనక్కి తిరిగి తన  హృదయానికి హత్తుకుని పోయింది.

ఆమె చెంపలు, నుదురు, పెదాలు అతని హృదయానికి వెచ్చగా తగిలాయి.

ఆమె ఏం కోరుకుంటుందో అర్ధమయింది. రెండు చేతులతో ఆమె హృదయానికి మరింత దగ్గరగా హత్తుకున్నాడు.

‘‘ఆకాష్! ఐ వాంట్ సం థింగ్!’’ ఆమె ఆవేశంగా అంటోంది.

ఆమె ఒళ్ళంతా ముద్దులతో ముంచెత్తాడు.

ఆమె పూర్తిగా తనని కోరుకుంటోందన్న విషయం తెలియగానే అతనిలో అంతర్మథనం ప్రారంభమైంది.

ఆమెని దగ్గరికి తీసుకుని లాలించి బుజ్జగించి తన ప్రేమతో ఆమెను కట్టిపడేయాలనుకున్నాడే తప్ప ఆమెని లొంగదీసుకో వాలన్న ఆలోచన తనకి ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు తీరా ఇంత దూరం వచ్చి శరీరాలు అదుపు తప్పాక వెనక్కి వెళ్ళటం ఎంత కష్టం....?అయినా తను కీర్తన నుంచి ఆశించింది ఇదా....? ఇలా శరీరాలు పెనవేసు కోవడం కోసం తను రాలేదు. తన ప్రేమని పునరుద్ధరించు కోవటానికి వచ్చాడు.

శారీరకంగా దగ్గరయ్యాం కాబట్టి తప్పదన్న వూహలతో కీర్తన తనని పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకోవడం తను భరించలేడు.

ఆ ఆలోచన రావడం తోనే అతను ఆగిపోయాడు. ఆమె శరీరం చుట్టూ ఉక్కు కడ్డీల్లా బిగిసిన చేతులు వదులయ్యాయి.  మృదువుగా విడిపించుకుని దూరంగా జరిగి కూర్చున్నాడు.

అర్ధం కానట్లు చూసి చేత్తో అతని చెంపని పట్టుకుని తన మొహాన్ని తన వైపుకి తిప్పుకుని చూసింది.

అపరాధిలా వుందతని మొహం. ‘‘అయాం సారీ!’’ అస్పష్టంగా అన్నాడు.

‘‘నో....ప్లీజ్....!’’ అతని మెడ చుట్టూ చేతులు వేసి అస్థిమితంగా తల ఊపుతూ అంది.

అతనికి శరీరం రగడం అంటే తెలుస్తోంది. అతి ప్రయత్నం మీద కంట్రోల్ చేసుకుని ఆమె పెదాలని గాఢంగా చుంబించి లేచాడు.

బాత్రూంకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చి తల దువ్వుకుని, తన డ్రస్ సరిచేసుకున్నాడు.

రోషంతో, అవమానంతో ఎరుపెక్కిన మొహాన్ని చూసి అతనికి బాధనిపించింది.

‘‘బుజ్జీ! డ్రస్ సరిచేసుకో’’ చెప్పాడు.

‘‘ఏం వద్దు....’’ గట్టిగా అరవాలనుకుంది. కానీ దు:ఖంతో మాట పీలగా వచ్చింది.

‘‘ఏంటి వద్దు.... ఇలా హాఫ్ డ్రస్సయి, నువ్వు వాలీబాల్ ఆడితే చూసేవాళ్ళ కళ్ళు పేలిపోతాయి’’ సరదాగా అన్నాడు.

వెంటనే నవ్వు వచ్చేసింది. కానీ అతను చేసిన అవమానం గుర్తు వచ్చి ‘‘ఇక నుంచి ఇలాగే ఆడతాను’’ అంటూ కోపంగా లేచి నిబడింది. బ్రా నుండి ఎద చలించింది. అతను అలాగే ఫాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని నిల్చుని ఆ తర్వాత ‘‘నా ముందు ఆడు చూద్దాం’’ అంటూ టేబిల్ మీద వున్న బాల్ ని ఆమె వైపు విసిరాడు.

కోపంగా చూసి, అంతకు రెట్టించిన వేగంతో ఆ బంతిని అతని మీదకి విసిరింది. అది సూటిగా వెళ్ళి అతని పొట్టని తాకింది.

‘‘అమ్మా!’’ అని మూలిగి కడుపు పట్టుకున్నాడు. కంగారుపడింది కీర్తన.

తను గట్టిగానే విసిరింది. ఇతనికి బాగా దెబ్బ తగిలిందా? అయినా అతను చూస్తూ నిల్చోకపోతే బాల్ ని పట్టుకోవచ్చు కదా....!

గబగబా దగ్గరకు వచ్చి ‘‘ఎక్కడ తగిలింది...చూస్తాను’’ అంటూ షర్ట్ కొంచెం పైకి లేపింది.

పసుపు రంగులో నున్నగా, దృఢంగా కనిపిస్తున్న పొట్ట ఎక్సర్సైజ్ బాడీ అనడానికి చిహ్నంగా మజిల్స్ స్టిఫ్ గా వున్నాయి.

బాల్ తగిలినంత మేరా ఎర్రబడింది. ‘‘అయ్యో! అయాం....సారీ!’’ వేళ్ళతో మృదువుగా నిమురుతూ అంది.

అతనికి చక్కిలిగింతలు వచ్చాయి. కానీ అమ్మాయి ముందు చెప్తే నవ్వుతుంది కదాని ఒళ్ళు బిగపట్టాడు.

‘‘ఎక్స్ ట్రీమ్లీ సారీ!’’ అంటూ మోకాళ్ళ మీద కూర్చుని రెండు చేతులతో నడుం పట్టుకుని పొట్టని ముద్దాడింది.

ఇక ఆపుకోవడం అతనివల్ల కాలేదు. గట్టిగా నవ్వుతూ ‘‘ఏయ్...నాటీ’’ అంటూ దూరంగా తోసేశాడు.

‘‘ఆ! మీ వీక్నెస్ తెలిసిపోయింది’’ అల్లరిగా అంది.

అలా అంటున్న ఆమెని అప్పుడే చూసినట్లు కొత్తగా చూశాడు.

కళ్ళ నిండా ప్రేమ నింపుకుని చూశాడు.....

మళ్ళీ ఎప్పటికి చూస్తానో అన్నంత ఆర్తిగా చూసాడు....

అతని చూపుకున్న శక్తి ఏంటో ఆమె కామయిపోయింది.

దగ్గరగా వెళ్ళి ఆమె పక్కనే నేల మీద కూర్చుని చుడీదార్ ఆమెకి తొడుగుతూ...

‘‘నిజంగా ఇన్నాళ్ళూ నరకం అనుభవించాను. నేను చేసింది తప్పే! చాలా అబద్దాలు చెప్పాను. అన్నింటికీ రీజన్ వుంది....’’ అతను కన్సోలింగ్ గా చెపుతోంటే వింటోంది కీర్తన.

ఈ పందెం వేసుకున్నాక అతను ఎంత అశాంతితో కుంగిపోతున్నాడో చెపుతుంటే వింటోంది కీర్తన. అతను చెపుతూనే ఆమెకి డ్రస్ తొడిగాడు.

ఉడుకులాన్ క్లాత్ తో మొహం తుడిచి పౌడర్ రాసాడు. ‘‘మరి జడ?’’ జుట్టు చూపిస్తూ అంది.

ఓపిగ్గా తని బ్రష్ చేసి క్లిప్ పెట్టాడు. మంచం మీద మిలమిలా మెరుస్తూ పడున్న ఆమె కాలి పట్టీని తెచ్చి ఆమె పాదాన్ని ఒళ్ళో పెట్టుకుని పట్టీ పెడుతుంటే ఆ దృశ్యాన్ని విస్మయంగా చూసుకుంది కీర్తన.

ఆ పని అవగానే అతని మొహాన్ని తన హృదయం మీదకి చేర్చుకుని అతని మొహాన్ని ముద్దాడింది. ఆమె కళ్ళలో కనిపించిన కన్నీటి తెరని చూసి...

‘‘ఏం...?’’ కంగారుగా అన్నాడు.

‘‘అమ్మ గుర్తొచ్చింది...ఎపుడో చిన్నప్పుడే చనిపోయింది. ఉంటే ఇలాగే చూసేదేమో?!’’ క్షణమాగి...

‘‘అన్నయ్య కూడా చూశాడు చాలా బాగా...అందుకే తట్టుకోలేకపోయాను...నన్ను ఇంత మోసం చేస్తాడని....’’దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది.

ఆకాష్ ఆమె వీపు నిమురుతూ ‘‘అంతా నీ మంచి కోసమే.’’

‘‘ఏంటి నా మంచి...? నేను నేషనల్ గేమ్స్ కి వెళ్ళకుండా చేయడమా....? అదా నా మంచి....? అతని జుట్టుని రెండు గుప్పిళ్ళతో బిగించి పట్టుకుని అంది.

‘‘అందులోనే మేం పొరపాటు పడితే పడివుండొచ్చు. కానీ మా ఇద్దరి ఆలోచనా నువ్వు సుఖంగా వుండాలనే’’ ఖచ్చితంగా అన్నాడు.

‘‘పోనీ ఆ ఆలోచన ఏంటో చెప్పొచ్చు కదా?’’ కినుకగా అంది.

‘‘ఊహూ! సమయం రావాలి.’’

‘‘హాల్లోకి వెళదాం’’ అంటూ లేచాడు.

అతను వెళతాడనుకుని మెయిన్ డోర్ తెరిచింది. అతను హాల్లోనే కూర్చోవడం చూసి ప్రశ్నార్ధకంగా చూసింది.

‘‘కాసేపు వుంటాను’’ అన్నాడు. ఆమె మొహం వికసించింది. తనూ ఎదురుగా వున్న సోఫాలో కూర్చుంది.

‘‘డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. మీరు ఇక్కడే భోజనం చేయండి’’ అంది.

‘‘వద్దు...మనిద్దరం హోటల్ కి వెళ్దాం’’ న్యూస్ పేపర్ చూస్తూ అన్నాడు.

ఆమె నుంచి ఏం సమాధానం రాలేదు. ‘‘అలాగేనా...?’’ తలెత్తి ప్రశ్నించాడు. ఆమె మొహం ఎలాగో మారిపోయింది.

‘‘మా గేమ్స్ అయ్యేవరకూ బయటకి వెళ్ళొద్దని ఫుడ్ కూడా ఇంట్లో తీసుకోవాని చెప్పారు’’ మెల్లగా అంది.

‘‘ఎవరు?’’ అతని నోటి నుంచి బుల్లెట్ లా వచ్చింది ప్రశ్న.

అతని మొహం చూస్తూంటే సమాధానం చెప్పడానికి అదోలా వుంది.

కానీ అంతలోనే రోషం బుసలు కొట్టింది.

‘‘ప్రణీత్ చెప్పారు. అన్ని టెన్షన్స్ కీ దూరంగా ఫిక్స్ డ్ ఫుడ్ తీసుకుంటూ కేర్ పుల్ గా వుండాలన్నారు.’’

ఆమె మాట పూర్తవుతుండగానే అతని మొహం జేవురించిపోయింది. చేతిలోని పేపర్ ని విసిరికొట్టి లేచి నిలబడి...

‘‘మనిద్దరి మధ్యా టర్మ్స్  డిక్టేట్ చేయడానికి అతనెవరూ....?’’ ఆవేశంగా అన్నాడు.

బిక్క మొహం వేసుకుని చూసింది. అతని మొహం చిరాగ్గా పెట్టుకుని కూర్చున్నాడు. ప్రణీత్ వచ్చేసే టైం అయింది. ఇతను గొడవ చెయ్యకుండా వెళ్ళిపోతే బావుండును.

ఇతను మోసం చేసాడని ఈ రోజు వరకూ ఎంత బాధపడింది? ఇపుడొచ్చి దగ్గరకు తీసుకోగానే సర్వం మర్చిపోయింది. తనలో వున్న స్టెబిలిటీ అంతా ఏమైంది?

ఇదే ప్రేమ కాబోలు?! అందుకే అంత ద్వేషించిందీ, అంత లొంగి పోయింది...ఆలోచనల్లో అన్యమనస్కంగా వుండగానే బయట బైక్ ఆగిన చప్పుడు వినిపించింది.

గబుక్కున లేచి ఆకాష్ వంక భయంగా చూసింది.

ఏం పట్టించుకోనట్లు కేర్లెస్ గా కాలు మీద కాలేసుకుని పేపర్ చదువువుతూనే వున్నాడు.

ఇంటి ముందు ఆగివున్న కారుని చూసి ఎవరు వచ్చి వుంటారో వూహించాడు ప్రణీత్. అతని పెదాల మీద చిరుదరహాసం మొలిచింది.

నవ్వుతూనే  హాల్లోకి అడుగుపెట్టాడు. ముందుగా తన వంక భయంగా చూస్తున్న కీర్తన కనిపించింది.

తర్వాత ఆకాష్ దగ్గరకి వెళ్ళి ‘‘హలో...అయాం ప్రణీత్....’’ చెప్పాడు.

ఆకాష్ లేచి నిలబడి షేక్ హాండిస్తూ....

‘‘అయాం ఆకాష్.....కీర్తన ఉడ్ బీని....’’ చివరి మాట నొక్కి చెబుతుంటే, కీర్తన అసహాయంగా చూస్తూ నిలబడింది.

షేక్ హాండ్ ద్వారా ఇద్దరూ ఒకరినొకరు అంచనా వేసుకునే ప్రయత్నం చేశారు.

ఆకాష్ తన చురుకైన చూపుతో ప్రణీత్ ని నఖశిఖపర్యంతం పరిశీలిస్తుంటే....

ప్రణీత్ ప్రశాంతంగా నవ్వుతూ వున్నాడు. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్