Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue251/679/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

(గత సంచిక తరువాయి)..... ఆటో రివ్వున సాగుతోంది. మంచుతెరలు పూర్తిగా వదలేదు. చలి గాలికి చున్నీ చెవుల చుట్టూ కప్పుకుంది కీర్తన. తన మనసు ఎంత ప్రశాంతంగా వుందో తెరచి చూసుకోగానే ఆమెలో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. అణువణువూ విజయం కోసం తపిస్తోంది.

కీర్తన ఆలోచనల్లో వుండగానే ఆటోకి అడ్డంగా ఓ మారుతీ వ్యాన్ కీచుమన్న శబ్దంతో ఆగింది. ఆటో  అతను సడెన్ బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అతను తిట్టుకుంటూ కిందకి దిగాడు.

ఈ లోపు వ్యాన్ నుండి ముగ్గురు దృఢకాయులు కిందకి దిగారు. ఆటో దగ్గరకి వచ్చి కీర్తన చేతులు పట్టుకొని కిందకి లాగారు.
రోడ్డు మీద పెద్దగా జన సంచారం లేదు. వున్నా ఎవరికీ పట్టించుకునే తీరిక లేదు.

ఊహించని పరిణామానికి కంగారుపడింది కీర్తన. ‘‘ఎవరు మీరు?’’ కోపంగా అరిచింది.

వాళ్ళు వినిపించుకునే స్టేజ్ లో లేరు. బరబరా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి వ్యాన్ లో పడేయబోతుంటే అప్పుడు వచ్చాడు ఆకాష్.
అతనికి ఎందుకో డౌట్ వచ్చే బయలుదేరాడు. మంచుతెర మధ్య నుండి కీర్తన ‘హెల్ప్’ అంటూ అరవడం వినిపించింది.
రావడంతోనే ఆ ధృఢకాయులు ముగ్గురి మీదా ఎటాక్ చేశాడు. పిడికిలి బిగించి ఒకడి మొహం మీద గుద్దాడు. కళ్ళు పచ్చబడిపోయి, ముక్కువెంట రక్తం కారుతుండగా కింద పడ్డాడతను. ఇంకో వ్యక్తి పొట్టలో గుద్దాడు. కడుపులో నరాలు బిగపట్టేయగా అమ్మా! అని మూలుగుతూ వంగిపోయాడతను.

ఈ లోపు మూడో వ్యక్తి ఖాళీగా లేడు. అతని చేతిలో తళుక్కున ప్రత్యక్షమైన కత్తిని చూసి ‘‘సార్!’’ ఆందోళనగా అరిచాడు ఆటో డ్రైవర్.
ఒడుపుగా తప్పుకున్నాడు. అప్పటికే ఆస్యం అయింది. కత్తి అతని ఎడమ భుజాన్ని గాయపర్చింది. గాయాన్ని అదుముకుంటూ కాలెత్తి దగ్గరకి రాబోతున్నతన్ని తన్నాడు. విసురుగా వెళ్ళి వ్యాన్ మీద పడ్డాడు.

ఇంతలో పబ్లిక్ పోగవడం చూసి మళ్ళా ముగ్గురూ గబగబా హెచ్చరించుకుంటూ పారిపోయారు. ఇంతసేపూ శిలాప్రతిమలా నిలబడ్డ కీర్తనలో ఆలోచనలు వేరే విధంగా వున్నాయి.

తను ఈ రూట్లో వస్తుందని తెలిసింది కేవలం ఇద్దరికే. ఒకరు ప్రణీత్, ఇంకొకరు ఆకాష్. ప్రణీత్ కి తను ఎన్నింటికి వస్తుందో తెలీదు. అదీ గాక తనని కిడ్నాప్ చేస్తే అతను ఎంతో కుంగిపోతాడు. ఎందుకంటే తమిద్దరి లక్ష్యం నెరవేరదు కాబట్టి.

ఇక మిగిలింది ఆకాష్! గొర్రె కసాయివాడిని నమ్మినట్లు తను ఇతన్ని నమ్మింది.

‘‘కీర్తనా!’’ దగ్గరగా రాబోయాడు.

‘‘శభాష్! డ్రామా బావుంది. హీరోలానే వచ్చి ఫైట్ చేశారు’’ తిరస్కారంగా అంది. అతను అప్రతిభుడై చూస్తుండగానే ఆటోలో కూర్చుని

‘‘పోనీయ్’’ అంది. ఆటో అతను అయోమయంగా చూసి ఆటో స్టార్టు చేశాడు.

మొట్టమొదటిసారిగా ఆకాష్ కి విరక్తి లాంటి భావం కలిగింది. అదీ కాసేపే. వెంటనే మామూలైపోయి అశోక్ కి ఫోన్ చేశాడు. విషయం తెలియగానే వురుకు, పరుగుమీద వచ్చాడు అశోక్. షర్ట్ అంతా రక్తంతో తడిసిపోగా కారు దగ్గర నిస్సహాయంగా నిల్చున్న ఆకాష్ ని చూసి అతని గుండె తరుక్కుపోయింది.

ఇన్ని కోట్లకి వారసుడు....చివరికి ఇలా ప్రేమించిన అమ్మాయి చేతుల్లో విలవిల్లాడుతున్నాడు. వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళి ఫస్ట్ఎయిడ్ చేయించాడు.

‘‘ఎవరై వుంటారు?’’ ఆందోళనగా అన్నాడు.

‘‘ఏమో! ఏదేమైనా మనం జాగ్రత్తగా వుండాలి. కీర్తనని ఒక్కదాన్నీ వదిలిపెట్టకూడదు. పద వెళ్దాం.’’

‘‘నిజమే! అయినా నీకంత గాయం అయితే నిన్నొదిలేసి తనొక్కతీ ఎలా వెళ్ళింది?’’ విసుక్కుంటూ అన్నాడు అశోక్.

‘‘తను వెళ్తాననలేదు. నేనే పంపించాను’’ నిదానంగా ఆలోచించి అన్నాడు ఆకాష్.

‘‘సరే పద’’ బయల్దేరబోతుండగా అశోక్ సెల్ మోగింది. గబుక్కున ఆన్ చేశాడు. ఇంటి నుంచి....అటునుంచి జాహ్నవి ఏడుపుగొంతుతో....

‘‘ఏవయింది?’’ ఆదుర్దాగా అన్నాడు.

‘‘మావయ్యగారు....’’ దుఃఖంతో నోటమాట రాలేదు జాహ్నవికి.

‘‘ఏమయింది? నాన్నగారు ఎలా వున్నారు?’’ పరిసరాలు గమనించుకోకుండా గట్టిగా అరిచేశాడు.

‘‘మామయ్య గార్ని ఎవరో కార్లో వచ్చి ఎత్తుకుపోయారు. మన పని వాళ్ళకి కత్తు చూపించి బెదిరించారు. నన్ను తోసి పడేశారు.’’ వెక్కుతూ అంది.

‘‘మైగాడ్! వచ్చేస్తున్నాను....’’ఆందోళనగా అంటూ కారు యింటి వైపు తిప్పుతూ జరిగిందంతా చెప్పాడు.

‘‘ఇదంతా ఏదో పథకం ప్రకారం అనిపిస్తోంది’’ ఆకాష్ ఆలోచిస్తూ అన్నాడు.

‘‘అవును....’’

‘‘ఇటు కీర్తననీ, అటు మీ నాన్నగారినీ ఏకకాలం లో కిడ్నాప్ చేయాని చూశారు. ఇటు కీర్తనని నేను అడ్డుకున్నాను. నువ్వు ఇంట్లోంచి బైటకి రావడంతో వాళ్ళకి పని సువైంది. అంకుల్ని తీసుకువెళ్ళిపోయారు. నీకు ఎవరిమీద డౌట్ వుంది?’’ ఆకాష్ అడిగాడు. అశోక్ మనసులో ఓ వ్యక్తి పేరు మెదిలింది. కానీ బైటకి చెప్పడానికి సందేహించాడు.

‘‘కీర్తనకి ఈ విషయం చెప్పాలా వద్దా?’’ ఆకాష్ అన్నాడు.

‘‘చెప్పాలి. చెపితేనే తనూ జాగ్రత్త పడుతుంది.’’ అశోక్ అంటుండగానే మళ్ళీ అతని సెల్ మోగింది. అట నుంచి కర్ణకఠోరమైన స్వరం వినిపించింది.

‘‘మీరెవరు?’’ అశోక్ అడిగాడు.

‘‘నేను ఎవరైతేనేం నీకు అనవసరం. తొమ్మిదిన్నరకల్లా నువ్వు మీ చెల్లిని తీసుకుని మేం చెప్పిన చోటికి రావాలి. లేకపోతే నువ్వు లేట్ చేసిన ప్రతి నిమిషానికీ లెక్కగట్టి మీనాన్న ఒక్కోవేూ తెగిపడుతుంది. ఎక్కడికి రావాలో నేనే మళ్ళీ చెపుతాను’’ ఠక్కున ఫోన్ పెట్టేశాడతను.

‘‘చాలా ప్రమాదంలో ఇరుక్కున్నాం....’’ఆందోళనగా అన్నాడు అశోక్.

‘‘ఏవయింది?’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi?