Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue258/694/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

(గత సంచిక తరువాయి)...

రోడ్డు మీదకి వచ్చిన గాయత్రి  బస్ డిపోకి ఎటు వెళ్ళాలో తెలియక ఆటో కోసం  ఎదురుచూడసాగింది.

ఆటోలు ఖాళీగా  రావడం లేదు.

గాయత్రికి భయంతో ముచ్చెమటలు పడుతోంది. తనని ఎవరన్నా ఇక్కడ చూస్తే ప్రమాదం అని ఆమెకి తెలుసు. ఆ ప్రమాదం ఏదో జరక్క ముందే తను ఈ ఊరు దాటాలి.

రమేష్ అంత్యక్రియలకు ఆమెని  ఎవరూ రమ్మనలేదు. ఆమెకి  కూడా వెళ్ళాలనిపించలేదు. నిన్నటిదాకా తనతో కలిసి బతికిన రమేష్  మీద ఆమెకి గొప్ప  ప్రేమ లేకున్నా ఒక సానుకూల భావన, ఒక స్నేహం ఉంది.

అతను ఆమెని  ఎంతో  ప్రేమించి కంటికి రెప్పలా చూసుకున్నాడు. తనకి చేతనైనంతలో సుఖ పెట్టడానికి ప్రయత్నించాడు. కోరక ముందే అతనికి తోచిందేదో చేసాడు. అలాంటి వ్యక్తి, అందరికి దూరమైన తనకి తోడై ఓ చల్లని నీడ అయి నిలిచిన వ్యక్తీ అకస్మాత్ గా అదృశ్యం అవడాన్ని ఆమె జిర్ణించుకోలేకపోతోంది.

కొన్ని గంటల ముందు సజీవంగా తిరిగిన వ్యక్తీ నిర్జీవమై అగ్నికి ఆహుతి అవుతుంటే చూసి తట్టుకునే శక్తి ఆమెకి లేదు.
అతను అదృశ్యంగా తన వెంట ఉన్న భావన మాత్రమే  ఉంది అది అలాగే ఉండాలని ఆమె భావిస్తోంది. అందుకే ఆమె ఒక భార్యగా అతని మరణానంతరం తను నెరవేర్చవలసిన  కొన్ని కర్తవ్యాలను నరసింహ చెప్పినా చేయలేకపోయింది.

తన తక్షణ కర్తవ్యం కొడుకుని కాపాడుకోవడం, ఆ తరవాత తన పయనం, గమ్యం నిర్ణయించుకోవడం. ఆలోచనల్లో ఉన్న గాయత్రికి దగ్గరగా ఆటో ఆగడం అందులోనుంచి రమేష్ స్నేహితుడు యాదగిరి చెల్లెమ్మా అని పిలవడం వినిపించలేదు.

యాదగిరి మరింత గట్టిగ పిలిచాడు చెల్లెమ్మా ఏడికి పోతున్నవు ..

గాయత్రి ఉలిక్కిపడింది.

యాదగిరి ఆటో ఖాళీగా ఉంది. గాయత్రి ఆలోచించలేదు. చటుక్కున ఆటో ఎక్కింది.

“అన్నా నన్ను బస్ డిపోకి తిసికేళ్ళు” అంది.

యాదగిరి ఏమి ప్రశ్నించకుండా ఆటో స్టార్ట్ చేసాడు.

దారిలో జరిగిన సంఘటన తల్చుకుని బాధ పడ్డాడు యాదగిరి.

“నీకు అన్నేయం చేసిండమ్మా ఆ దేవుడు... ఎట్ల బతుకుతవు? నేనేమి సాయం చేయలేకపోతున్న “ అన్నాడు బాధగా.

“ నన్ను హైదరాబాద్ బస్ ఎక్కించి పుణ్యం కట్టుకో అన్నా చాలు” అంది గాయత్రి కన్నీళ్ళతో.

“అమ్మోల్ల దగ్గరకు పోతావా.. తప్పదుగద ...ఇప్పుడు అల్లు చూడకుంటే ఎవరు చూస్తరు ..” అని మాట్లాడుతూనే డిపో దగ్గర ఆటో ఆపి నేను పార్కింగ్ ల పెట్తోస్తా నువ్వు లోపటకి పో”  అన్నాడు.

గాయత్రి చేతిలో సంచి , చంకలో బిడ్డతో బిక్కు,బిక్కుమంటూ లోపలికి నడిచింది. పెద్దగా రద్దీ లేదు కానీ హైదరాబాద్ వెళ్ళే బస్ ఎక్కడకి వస్తుందో తెలియదు. ఏడాది క్రితం  పశ్చ్చాత్తాపంతో, భయంతో కన్నీళ్ళతో ఇదే బస్ డిపోలో నిలబడి నరసింహ అనుమానపు చూపులు తట్టుకోలేక , నిలబడలేక పారిపోవాలని అనుకోడం గుర్తొచ్చింది.

ఆ రోజు అతనే ఆదుకోక పోయి ఉంటే ఏమయేది ... ఎక్కడ ఉండేది...

మరొక్కసారి భయంతో ఒళ్ళు జలదరించింది.

యాదగిరి హడావుడిగా వచ్చి గాయత్రి చేతిలో సంచి తీసుకుని “దామ్మా బస్ రెడీ గుంది “ అన్నాడు. గాయత్రి అతన్ని అనుసరించింది.
బస్ లో సీటు చూసి గాయత్రి కూర్చున్నాక జేబులో నుంచి నూట యాభై రూపాయలు తీసి ఇస్తూ అన్నాడు “నా తాన ఇంతే ఉంది ... తీసుకొమ్మ”.గాయత్రికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తోటి ఆటో వాడు.. అటో స్టాండ్ లో అయిన పరిచయం. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కాసిని టి నీళ్ళు ఇచ్చింది.

ఎంత నిస్వార్ధమైన అభిమానం!

“వద్దన్నా నా దగ్గర ఉన్నాయి” అంది గాద్గదికంగా ..

“ఉంచమ్మా మల్ల కలుస్తమో లేదో ...” బలవంతంగా ఆమె చేతిలో పెట్టి బస్ దిగి వెళ్ళిపోయాడు.

గాయత్రి నిస్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది.

కండక్టర్ రావడంతో సర్దుకుని కూర్చుని చేతిలో ఉన్న డబ్బులు ఇచ్చింది. అతను టికెట్ చిల్లర ఇచ్చి మరో వైపు వెళ్ళిపోయాడు.
బాబు నిద్ర లేచి ఏడుపు ప్రారంభించడంతో వాడిని గుండెలకు హత్తుకుని కిటికీ లోంచి చూస్తూ కూర్చుంది.

బస్ జూబిలీ బస్ స్టేషన్ లో ఆగింది.  గాయత్రి గుండెల్లో వణుకు మొదలైంది.

ఆ డిపో ఎప్పుడూ చూడలేదు.. అసలు ఏ డిపో చూడలేదు.  ఎట్లా వెళ్ళాలో దారి తెలియదు.

అసలు తను హైదరాబాద్ చేరిందా లేదా అని అనుమానం వచ్చింది కానీ అందరూ దిగడంతో హైదరాబాద్ అని నిర్ధారించుకుని దిగింది. కానీ  ఎటు  పోవాలో,  ఏం  చేయాలో  అర్ధం కాలేదు. తను ప్రయాణం చేస్తున్న నావ హటాత్తుగా సముద్రం మధ్యలో లోలోతుల్లోకి దిగిపోతున్నట్టుగా అనిపించింది. దిక్కు తోచక  నిలబడి పోయింది.

నేరుగా ఇంటికే వెళ్ళాలా .... అసలు వాళ్ళు అక్కడ లేరు అన్నారు రమేష్ అమ్మ, నాన్న ... నిజంగా లేరా ... ఎక్కడికి వెళ్లి ఉంటారు.. ఎంతో కాలంగా ఉంటున్న ఇల్లు ఎందుకు ఖాళి చేస్తారు.

అక్కడ అందరూ అమ్మ, నాన్నలను ఎంతో గౌరవిస్తారు.  అలాంటి చోటునుంచి వెళ్ళడం తెలివి తక్కువ అని నాన్నకు తెలుసు.
గాయత్రి ఆలోచిస్తూనే బయటకు నడిచింది. ఆటో వాళ్ళు ఈగల్లా  మూగారు.

“కాచిగూడ వస్తావా” అడిగింది ఒకతన్ని.

“రెండు వందలు” అన్నాడు.

రెండు వందలా హడలిపోయింది. ఆటోకే అంత ఇస్తే తన దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందా ..

ఆమె ఆలోచన గమనించిన వాడిలా “నూట ఎనభై ఇయ్యమ్మా” అన్నాడు.

“నూట యాభై ఇస్తాను” అంది నీరసంగా .. ఏమనుకున్నాడో వెంటనే అంగీకరించాడు. గాయత్రి సంచిని, బాబుని జాగ్రత్తగా పట్టుకుని ఆటో ఎక్కింది.

ఆటో కదిలింది .

తేజ శరణ్యకి బోలెడు నగలు, చీరలు కొన్నాడు. ఒక్కో బంగారం షాపులో ఒక్కో నగ మొత్తం హైదరాబాద్ లోని అన్ని ప్రముఖ బంగారం షాపులు, ప్రముఖ చీరల షాపులు తిప్పడం, మధ్య, మధ్య రెస్టారెంట్ లో బ్రేక్ ఫాస్ట్ , లంచ్, డిన్నర్ కానిచ్చేయడం.. ఉదయం లేచి స్నాదికాలు ముగించుకుని బయటపడితే రాత్రికి కానీ ఇల్లు చేరలేదు రెండు రోజులు.

ఆదివారం రాత్రి కొన్న చీరలు, నగలు మంచాల మీద పరిచి చూపిస్తూ చెప్పసాగాడు.

“ఇదిగో ఈ చీరకి ఈ నగ, ఈ చిరకి ఈ డైమండ్ నెక్లెస్ ...ఈ దిజైనర్ చిరకి ఈ పెద్ద జూకాలు పెట్టుకుంటే చాలు స్టైలిష్ గా ఉంటుంది. “
పెదాల చివర నవ్వు దాచుకుని అతను చెప్పేది మౌనంగా వింటున్న శరణ్య “ఇన్ని చీరలు అవసరమా.. ఈ నగలు లాకర్ కి అలంకరించడానికి తప్ప అస్తమానం పెట్టుకుంటానా ... వేస్ట్ ఆఫ్ మనీ... నీకసలు డబ్బంటే లెక్క లేకుండా ఉంది.. ఎంత ఆస్తి ఉందేంటి మీ నాన్నగారికి.”

తేజ ఆమె నెత్తిమీద మొట్టి అన్నాడు... “హైదరాబాద్ కొనేంత ...”

“మరింకేం మరో నవాబు అనమాట..”

“ఒక్కడే కొడుకుని... నా పేరునే వేరు వేరు ప్రాంతాల్లో నాలుగు ఇళ్ళున్నాయి. ఆరు స్థలాలున్నాయి.. బోలెడు షేర్స్ ఉన్నాయి.. నా ఆస్తి లెక్క బెట్టడానికి టైం సరిపోదు కాని నువ్వు ఇవన్ని అలంకరిచుకుంటే చూడాలని నా కోరిక.”

“ఏంటి ఒక్కసారే ఇవన్నీ అలంకరించుకోవాలా” ఆశ్చర్యం నటించింది.

“ఏంటి ఓవర్ యాక్షనా ...” చటుక్కున ఆమెని దగ్గరకు లాక్కుని కౌగిట్లో బంధిస్తూ అన్నాడు.

“వదులు తేజా ప్లీజ్”  అంది పరవశంతో స్వాధీనం తప్పుతున్న శరీరాన్ని, మనసుని అదుపు చేసుకుంటూ. 

“అన్ని చాలా బాగున్నాయి .. నేను ఎప్పుడూ అందంగా అలంకంరిచుకుని నిన్ను అలరిస్తాను అని చెప్పు వదులుతా ...”

“అన్నీ అలంకరించుకుని పాత జానపద సినిమాల్లో రాకుమారిలా ఉంటాను వదులు”

ఆమె స్వరంలో చిందులేస్తున్న అల్లరికి మురిసిపోతూ మరింత దగ్గరగా అదుముకుని చెంప మీదా, కళ్ళ మీదా ముద్దులు పెట్టుకుంటూ పెదాల దగ్గరకి చేరుతున్న అతని పెదాలకి తన కుడిచేయి అడ్డు పెట్టింది.

“ఏయ్ చేయి తీయి” సీరియస్ గా అన్నాడు. తల అడ్డంగా ఊపింది..

“తీస్తావా .... లేదా “

“తీయను ...”

“సరే అయితే”  పెదాలతో ఆమె చేతి చూపుడు వేలు, మధ్య వేలు అందుకుని సున్నితంగా కొరికాడు..

“తేజా ఏంటిది..” కంపిస్తున్న స్వరంతో అంది.

“ఎక్స్ప్రెషన్ అఫ్ లవ్ ...”

కళ్ళు మూసుకుని అతని గుండె మీద వాలిపోయింది.

కాసేపు ఇద్దరూ సర్వం మర్చిపోయి పరస్పరాలింగనలోని  పారవశ్యాన్ని, మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉండిపోయారు.   నెమ్మదిగా తేరుకున్న తేజ బంధనం సడలిస్తూ ఆమె చుబుకం పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు.  “ఇంకా ఒక్క నెల ... ఈ శంఖం లాంటి మెడలో మూడు ముళ్ళు వేసేస్తా ... నీ  మీద సర్వాధికారాలు సంపాదిస్తా” అన్నాడు.

అతని భుజాల మీద రెండు చెతులూ వేసి కళ్ళలోకి చూస్తూ “ అంటే సిట్ , స్టాండ్ అని శాసిస్తావా” అంది..

ఆమె చేతులు అందుకుని ముద్దు పెట్టుకుంటూ “నేను అలాంటి వాడిలా అనిపిస్తున్నానా “ అన్నాడు.

“ఏమో ఎలా తెలుస్తుంది...” కొంటెగా నవ్వింది. “పెళ్లి అయి కొన్నాళ్ళు గడిస్తే కాని మగవాడి విశ్వరూపం తెలియదు కదా. “

“అయితే ఓ పని చేద్దామా ..”

“ఏంటో సెలవివ్వండి.”

“ముందు పెళ్లి రిహార్సల్స్ చేద్దాం .. అంటే గుడికి వెళ్లి దండలు మార్చుకుని ఓ నెల రోజులు కాపురం చేసేద్దాం ..”

“ఆ తరవాత మోజు తీరిపోతుంది ... మీ వాళ్ళకు, మా వాళ్ళకు ఖర్చే ఉండదు..” కిల కిల నవ్వింది.

తేజ కూడా నవ్వుతూ అన్నాడు.. “ఒక మధురమైన జ్ఞాపకంగా జీవితాంతం గుర్తుంచుకునే సెలేబ్రషన్ మన పెళ్లి... “

శరణ్య అతని చెంప మీద ముద్దు పెట్టి “గుడ్ బాయ్” అంది.

మిగతా కథ వచ్చే శుక్రవారం ఒంటిగంటకు చదవండి.....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana