Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Is pawan kalyan going to start political party?

ఈ సంచికలో >> సినిమా >>

నితిన్ కి తిరగలా.. అలాగే వరుణ్ కి...

same like nitin to varun

‘హ్యాపీడేస్’ తర్వాత ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో హిట్ కొట్టి, యంగ్ హీరోగా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ, వరుణ్ సందేశ్ ఆ తర్వాత ఫ్లాపుల బాట పట్టాడు. ‘ఏమైంది ఈవేళ’ సినిమా బాగానే వసూళ్ళు చేసినప్పటికీ, ఫ్లాపుల సంద్రంలో అదీ కొట్టుకు పోయింది.

అయినప్పటికీ వరుణ్ హీరోగా సినిమాలు వస్తూనే వున్నాయి, వెళ్ళిపోతూనే వున్నాయి. ఇన్ని వరుస ఫ్లాపులు బహుశా టాలీవుడ్ లో ఇంకే ఇతర హీరోకీ వచ్చి వుండవేమో.? అనుకుంటోంటే, ఏం నితిన్ లేడా? అంటున్నారు టాలీవుడ్ లో. నితిన్ కూడా అంతే, కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లు, ఆ తర్వాత వరుసగా డజను ఫ్లాప్ సినిమాలు వచ్చాయతనికి.

‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలు నితిన్ ని గట్టున పడేయడమే కాదు, సక్సెస్ ఫుల్ హీరోగా మార్చేశాయి. అలా వరుణ్ సందేశ్ కీ ఒక్క హిట్టొస్తే, అతని దశ కూడా తిరిగిపోతుంది. కానీ, దానికోసం వరుణ్ తనను తాను మార్చుకోవాల్సి వుంటుంది. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్ వంటివాటిని మార్చుకోవడంతోపాటు, లుక్స్ వైజ్ గా కూడా కొన్ని మార్పులు చేసుకుంటే మంచిది.

మరిన్ని సినిమా కబుర్లు
masala after ramayya