Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
masala after ramayya

ఈ సంచికలో >> సినిమా >>

అలా ఎందుకు దూసుకెళ్తున్నాడో

ala enduku doosukelthunnado

కెరీర్ లో రెండే రెండు హిట్లున్నాయి హీరో విష్ణుకి. ఒకటి ‘ఢీ’, రెండోది ‘దేనికైనా రెడీ’. ఇప్పుడు తాజాగా ‘దూసుకెళ్తా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విష్ణు. అక్టోబర్ 11న సినిమా విడుదల కాబోతోంది. సినిమా సెన్సార్ కార్యక్రమాల కోసం సమాయత్తమవుతుండగా, సెన్సార్ బోర్డ్ నుంచి సినిమాకి ఇబ్బందులు ఎదురవుతున్నాయంట.

అదలా వుంచితే, అక్టోబర్ 10న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా వస్తోంటే, ఆ మరుసటి రోజే విష్ణు ‘దూసుకెళ్తా’ అనడం అంత సేఫ్ కాదంటున్నారు సినీ పరిశీలకులు. ‘రామయ్యా వస్తావయ్యా’కి ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ నడుస్తోంది. దాంతో, ‘రామయ్యా..’ వెంట ఏ సినిమా వచ్చినా, ‘రామయ్యా..’ సక్సెస్ జోరులో కొట్టుకుపోతుందని అంటున్నారు.

కానీ, విష్ణుకి ‘దూసుకెళ్తా’పై చాలా కాన్ఫిడెన్స్ వుందట. అందుకనే పోటీలోకి ధైర్యంగా దిగుతున్నట్లు సమాచారం. దసరా సీజన్ కావడంతో, కాస్త కంటెంట్ బెటర్ గా వుంటే ఏ సినిమా అయినా కాసుల పంట పండిచేసుకోవచ్చు. ఆ లెక్కలేసుకుని కూడా విష్ణు ‘దూసుకెళ్తా’ నంటున్నాడు.

మరిన్ని సినిమా కబుర్లు
collections for adult movies