Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
thandra paparayudu - bahubali

ఈ సంచికలో >> సినిమా >>

మాజీ ప్రేయసితో నటిస్తాడా?

will he acts with his old girlfriend?

బాలీవుడ్ ప్రముఖుడు అమితాబ్ బచ్చన్కీ, అలనాటి అందాల తార రేఖకీ ఒకప్పుడు ఎఫైర్ వుండేదంటారు. జయాబచ్చన్ని పెళ్ళాడాక రేఖకి దూరంగా జరిగిపోయిన అమితాబ్, భవిష్యత్తులో రేఖతో కలిసి నటిస్తాడేమో అనుకుంటున్నారందరూ. దానిక్కారణం రేఖ, తాను అమితాబ్తో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడమే.

రేఖ కూడా ఇటీవలి కాలంలో ఎప్పుడూ అమితాబ్తో నటించడం గురించి ఎవరు ప్రశ్నించినా సరిగ్గా సమాధానం చెప్పేది కాదు. ‘మీ అందరికీ తెలుసు కదా..’ అంటూ తమ మధ్య విభేదాలను ప్రస్తావించకుండానే సమాధానాన్ని దాటవేసేది రేఖ. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు కదా. అమితాబ్తో మళ్లీ నటించాలని రేఖ ఉవ్విళ్ళూరుతోంది.

అమితాబ్ మాత్రం రేఖతో మళ్ళీ నటించడానికి ఆసక్తి చూపుతారా? అనే దానిపై బాలీవుడ్ సినీప్రముఖులు వివిధ రకాలైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ తెరపై రేఖ, అమితాబ్ అద్భుతమైన జంటగా ఒకప్పుడు కీర్తి ప్రతిష్టలు అందుకుంది. ఆ జంటను మళ్ళీ చూడాలని అభిమానులూ అనుకుంటున్నారు. రేఖ నుంచి గ్రీన్ సిగ్నల్ పడిరది, అమితాబ్ కూడా ఓకే అంటే, రేఖ ` అమితాబ్ వెండితెరపై మళ్ళీ అభిమానుల్ని అలరించే అవకాశం వుంది.

మరిన్ని సినిమా కబుర్లు
telugu movie in african countries