Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

కౌషల్‌ని పెంచిన ఆర్మీనే ముంచుతోంది.!

koushal army

చాలా సినిమాల్లో నటించిన కౌషల్‌ 'బిగ్‌బాస్‌' రియాల్టీ షోతో పాపులర్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌ అతనికి ఎంతటి పాపులారిటీ తెచ్చిపెట్టిందంటే, ఓ ఐదారు సినిమాలతో హిట్లు కొట్టినా దక్కనంత. కానీ అది నీటి బుడగ మాత్రమే అని నిరూపితమవడానికి పెద్దగా టైం పట్టలేదు. బిగ్‌బాస్‌ రియాల్టీ షో తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన సినిమా ఛాన్స్‌ దక్కించుకోలేకపోయాడు కౌషల్‌. మరోపక్క కౌషల్‌ ఆర్మీ అంతర్గత కుమ్ములాటలతో రోడ్డున పడింది. జుగుప్సాకరమైన వివాదాలతో కౌషల్‌ పరువు పోయింది. 'నా భార్య క్యాన్సర్‌తో బాధపడుతోంది. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి..' అని మీడియా సాక్షిగా కంటతడి పెట్టాల్సిన దుస్థితి కౌషల్‌కి వచ్చిపడింది. కౌషల్‌ని సమర్ధించేవాళ్లు ఎవరూ కనిపించడం లేదు.

ఇదంతా స్వయంకృతాపరాధం వల్లనే అని చాలా మంది అంటున్నారు. స్ట్రెయిట్‌గా ఉంటానంటే అన్ని చోట్లా కుదరదు. కౌషల్‌ విషయంలో అదే జరిగింది. ఇంత జరిగాక 'ఇక చాలు దయచేసి నన్ను వదిలేయండి మహాప్రభో..' అంటూ వేడుకుంటున్నాడు కౌషల్‌. నిజానికి కౌషల్‌ని మరీ ఇంతలా టార్గెట్‌ చేయాల్సిన అవసరం లేదు. స్టార్‌డమ్‌ని చూసి పొంగిపోలేదు. కానీ వస్తున్న వివాదాలతో కౌషల్‌ కుంగిపోతున్న తీరు కొంతమందికి ఆందోళన కలిగిస్తోంది. కౌషల్‌ తాజా అభ్యర్ధనతో వివాదాలు సద్దుమనుగుతాయేమో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
arjun auravaram