Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
arjun auravaram

ఈ సంచికలో >> సినిమా >>

మహేష్‌ - అల్లు అర్జున్‌.. ఏంటీ గడబిడ.?

mahesh - allu arjun ..what confussion...

'భాషా' సినిమా తొలుత చిరంజీవి దగ్గరకు వచ్చింది. కానీ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కింది. 'ఇడియట్‌' సినిమా పవన్‌ కళ్యాణ్‌ కోసం పూరీ జగన్నాధ్‌ అనుకుంటే, రవితేజతో సెట్‌ అయ్యింది. అలాగని చేతులు మారిన సినిమాలన్నీ హిట్లు అని అనుకోవడానికి లేదు. భయంకరమైన డిజాస్టర్స్‌ నుండి కొందరు హీరోలు తెలివిగా తప్పించుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఏతా వాతా చెప్పేదేంటంటే, సినిమాలు చేతులు మారడం మామూలే. సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కానీ అదిప్పుడు అల్లు అర్జున్‌ చేతికొచ్చింది. అనిల్‌ రావిపూడి ఓ ప్రముఖ హీరో కోసం సిద్ధమవుతుండగా, అనుకోకుండా మహేష్‌తో ప్రాజెక్ట్‌ సెట్టయ్యింది.

ఈ రెండు విషయాలూ ఈ వారంలో టాలీవుడ్‌ని ఓ కుదుపు కుదిపేశాయి. ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేశారు. మీడియాలో రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. కానీ సుకుమార్‌, మహేష్‌ మధ్య ఫ్రెండ్‌షిప్‌ తగ్గిపోయే ప్రశక్తే లేదు. సుకుమార్‌ తన సినిమా నుండి తప్పుకున్నా, మహేష్‌ ఎంతో జెంటిల్‌గా ఆలోచించి సుకుమార్‌ - అల్లు అర్జున్‌ ప్రాజెక్ట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. ఈ ఆరోగ్యకరమైన వాతావరణాన్నే ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఇదిలా ఉంటే మహేష్‌ తాజా సినిమా 'మహర్షి' మే 9న విడుదల కాబోతోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
Nitin is getting two. But ..!