Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prema enta madhram

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue308/796/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి)..... 

తల్లిదండ్రుల సమక్షంలో చలాకీగా తిరిగే పిల్ల, పెళ్లి పేరుతో ఎలా బంధీ అవుతుంది, పరిస్థితిలు అననుకూలమైతే ఆమె బతుకు ఎంత అంధకారబంధురమవుతుంది, అలాంటి విపత్కర పరిస్థితిని తమకనుకూలంగా మలచుకునే మేకవన్నె పులులెలా ఉంటారు అన్న అంశాలతో, హృదయాన్ని కదిలించే దృశ్యాలతో, మనసును మెలెసే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..వాయిస్ ఓవర్ తో చక్కగా పిక్చరైజ్ చేసి ఓ గుడ్ డే టెలికాస్ట్ చేసింది హేమ.

అప్పటి దాకా ఏ ప్రోగ్రామ్ కి రాని అనూహ్యమైన ప్రతిస్పందన. ఎన్నో మహిళా మండళ్లు ఆమె ఎవరో తెలియజేస్తే తగిన సహాయ సహకారాలందిస్తామని, ఆర్థికంగా, హార్థికంగా తోడుంటామని వస్తే ‘కాత్యాయని గురించి ఎవరికి చెప్పనని’ మాటిచ్చింది కనుక హేమ సున్నితంగా తిరస్కరించింది.

ఆ విషయాలన్నీ హేమ కాత్యాయనితోనూ, సోమయాజుల దంపతులతోనూ చెబితే, అంత మంచితనం ఉంది కాబట్టే రుతువులు గతి తప్పట్లేదని సోమయాజులుగారంటే, తన జీవితం కొంతమందికన్నా స్ఫూర్తినిచ్చి, ఆలోచనలో పడేసిందని కాత్యాయని సంతోషించింది.
హేమ ఆ ప్రోగ్రామ్ ని యూ ట్యూబ్ లోనూ అప్ లోడ్ చేసింది.

వచ్చిన కామెంట్లయితే ఓ వరదే!

రోజులు యథాప్రకారం గడిచిపోతున్నాయి.

అప్పుడప్పుడూ హేమ సోమయాజులుగారింటికొచ్చి కాత్యాయనితో గడిపి వెళుతోంది.

ఇప్పుడు ఆయనకూడా హేమను తను నిత్యం కొలిచే జగదంబ ఇచ్చిన మరో కూతురనుకుంటున్నాడు.

*****

ఇదిలా ఉండగా ఒకరోజు-

హేమ బిజీగా స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటోంది. ఆఫీస్ అసిస్టెంట్ వచ్చి.."మేడమ్, మీకోసం ఎవరో వచ్చారు" అంది.

ఆమె కార్యక్రమాలు టెలికాస్ట్ అయ్యాక ఎవరో ఒకరు రావడం పరిపాటే!

"కొద్ది సేపు వెయిట్ చేయమను. నేను వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చి కలుస్తానని చెప్పు"అంది.

ఆమె వెళ్లిపోయింది.

పదిహేను నిముషాల తర్వాత మళ్లీ వచ్చి హేమకు అతని గురించి గుర్తు చేసింది.

నిజానికి అసిస్టేంట్ అతన్ని గురించి చెప్పిన విషయాన్ని హేమ మర్చిపోయింది, కాని.. "ఓ పది నిముషాల్లో వస్తున్నానని చెప్పు" అంది.
ఆమె వెళ్లిపోయింది.

మళ్లీ పదిహేను నిముషాల తర్వాత తన ఎదుటకి వచ్చిన ఆసిస్టెంట్ ను చూసి ‘పద’ అంది.

బయట సోఫాలో సూటూ బూటుతో ఒక వ్యక్తి హుందాగా కూర్చున్నాడు.

"గుడ్మాణింగ్ సార్.. మీరు..?" అంది అర్దోక్తిగా.

"ఐయామ్ మనోహర్" అన్నాడు.

క్షణకాలంలో ఆమె మనసులో కాత్యాయనిని అన్యాయం చేసిన మనోహర్ మెదిలాడు. ఆమె ముఖం జేగురు రంగులోకి మారిపోయింది. కళ్లు కోపంతో ఎరుపెక్కాయి. ఆమె ముఖ కవళికలను చూసి ఆమె అంతర్మథనాన్ని గమనించి.."మేడమ్ కుడ్ వి సిట్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్" అభ్యర్థించాడు.ఆమె అసిస్టెంట్ ను వెళ్లిపొమ్మని’ కొద్ది దూరంలో ఐసోలేటేడ్ గా ఉన్న గ్లాస్ ఛాంబర్ లోకి తీసుకెళ్లింది.
అక్కడ కూర్చున్నాక "మేడమ్ నేను కాత్యాయనిగార్ని చూడాలి"అన్నాడు ఆమె వంక సూటిగా చూస్తూ.

"నో నెవర్"అంది విసురుగా..తీవ్రంగా.
 

మనోహర్ కాత్యాయనిని కలుస్తాడా.., హేమ మనోహర్ ని ఏవిధంగా నిలదీస్తుంది..తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం దాకా ఎదురు చూడాల్సిందే....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్