Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
beauty

ఈ సంచికలో >> శీర్షికలు >>

18-10-2019 నుండి 24-10-2019 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో సమయాన్ని సరదగా గడుపుటకు ఆస్కారం కలదు. చిన్న చిన్న విషయాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. పెద్దలతో మీకున్న పరిచయం మీకు ఉపయోగ పడుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చెయవలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి, ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. బంధువులతో మీ ఆలోచనలు పంచుకోండి. సంతానం గురుంచి గతంలో మీకున్న ఆందోళన తగ్గుటకు అవకాశం ఉంది, నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు.

 

 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం ఆరంభంలో కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది, నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఎవ్వరితోను విభేదాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

 ఈవారం బంధువులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న విషయాలపై ప్రత్యేక శ్రద్ద కలిగి ఉండుట మంచిది. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది, మిత్రులతో కలిసి సరదాగా ఉంటారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన చర్చలకు ఆస్కారం కలదు. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయాణాలు చేయు వారికి అనుకూలమైన సమయం. చర్చలకు అవకాశం కలదు.

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం దూరప్రదేశంలో కల బంధువుల నుండి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. నూతన ప్రయత్నాలను మొదలు పెట్టుటకు అవకాశం కలదు. గతంలో చేపట్టిన పనుల వలన సమాజంలో మంచి పేరును సొంతం చేసుకుంటారు. చిన్న చిన్న విషయాల పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండుట మంచిది. విదశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. స్వల్ప ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేఅవకాశం ఉంది , కాస్త జాగ్రత్తలు తీసుకోవడం సూచన.
 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం ఉద్యోగంలో మీరు గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు సత్ ఫలితాలు ఇస్తాయి. నూతన వ్యాపారపరమైన ప్రయత్నాల కోసం చేసే పెట్టుబడులు లభిస్తాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. ఆత్మీయుల ఆరోగ్య పరమైన సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం కలదు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. స్వదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూమైన సమయం. చేపట్టు పనుల విషయాల్లో స్పష్టత అవసరం. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది, నిర్ణయాలు తీసుకుంటారు.

 

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

 ఈవారం దైవపరమైన విషయాల్లో పాల్గొనే ప్రయత్నం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గతంలో చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఒక విషయంలో ఒకింత బాధకు లేదా నిర్ణయం తీసుకోవడంలో అలసత్వం చేసాననే భావనకు లోనయ్యే అవకాశం ఉంది. అనారోగ్యం ఒకింత తగ్గి కోలుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు మిత్రులతో కలిసి చేయుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, కాస్త శ్రమించుట వలన లబ్దిని పొందుతారు.

 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం ఆరంభంలో ఒకింత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. తండ్రి లేదా తండ్రి తరుపు బంధువులలో ఒకరి ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. సోదరులతో లేదా కుటుంబసభ్యులతో విభేదాలు వచ్చేఆస్కారం ఉంది, కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. కుటుంబవ్యవహారాల్లో సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నం విఫలం అవుతుంది. 

 

 


వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం మీరు ఉద్యోగంలో అధికారులతో కలిసి పనిచేసే విషయాల్లో వారి సూచనల మేర ముందుకు వెళ్లడం సూచన. మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. విదేశాల్లో ఉన్న మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా ముందుకు కదులుతాయి. వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది.

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో బదిలీ లేదా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. కుటుంబంలో సభ్యులతో విభేదాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఊహించని విధంగా విభేదాలు వచ్చే ఆస్కారం ఉంది, జాగ్రత్త. స్త్రీ పరమైన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన.

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం సంతానం విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు, నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయుట మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో కాస్త జాగ్రత్త వహించుట సూచన. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది. సోదరుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి.

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాల పట్ల ప్రత్యేకశ్రద్ద కలిగి ఉండుట సూచన. పెద్దలతో మనస్పర్థలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభించిన, మీకు సంతృప్తి ఉండక పోవచ్చును. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, అవకాశం ఉంటె ప్రయాణాలు వాయిదా వేసుకోవడం సూచన.

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది, వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, నూతన అవకాశాలు లభిస్తాయి. విదేశీప్రయాణాలు చేయువారికి అనుకూలమైన సమయం. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉంది. భూ పరమైన విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది.

మరిన్ని శీర్షికలు
Dominance over organs