Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anubandhalu telugu serial thirty first Part

ఈ సంచికలో >> సీరియల్స్

దురదృష్టపు దొంగలు

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే సీరియల్ ఇది.

మిషిగన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు దొంగలు ఓ బేంక్ లోకి ప్రవేశించి, చేతుల్లోని తుపాకులు ఊపుతూ 'ఎవరూ కదలకండి' అని అరిచారు. అయితే వారిలోని ఒక దొంగ కదిలితే భయంతో కంగారుగా రెండో దొంగ వాడిని కాల్చేశాడు. పోలీసులు వచ్చి గాయపడ్డ ఆ దొంగని అరెస్ట్ చేసి, పారిపోయిన రెండో దొంగ వివరాలు అతన్నించి రాబట్టారు. వాళ్ళిద్దరికీ అది తొలి దొంగతనమట.



లూజియానా రాష్ట్రంలోని లఫెమెట్టి అనే ఊరిలోని ఓ లోకల్ బేంక్ కి దొంగతనానికి వెళ్ళిన లూయిస్ అబ్ రైట్ అనే దొంగ, తనని ఎవరు గుర్తుపట్టకుండా ఉండటానికి, తన మొహానికి వెన్నని రాసుకొని వెళ్ళాడు. అయితే అతను దొంగతనం పూర్తి చేసేలోగా ఆ దొంగ కృష్ణుడి మొహం మీది వెన్నంతా కరిగి పోయి, అతని మొహం బయట పడింది.

 

మరిన్ని సీరియల్స్