Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Uyyala Jampala

ఈ సంచికలో >> సినిమా >>

డి ఫర్‌ దోపిడీ - చిత్ర సమీక్ష

Movie Review - D for Dopidi

రివ్యూ: డి ఫర్‌ దోపిడీ
తారాగణం: సందీప్‌ కిషన్‌, వరుణ్‌ సందేశ్‌, నవీన్‌, రాకేష్‌, తనికెళ్ళ భరణి
ఛాయాగ్రహణం: లుకాస్‌
సంగీతం: మహేష్‌ శంకర్‌
నిర్మాణం: డి టు ఆర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
నిర్మాతలు: రాజ్‌ నిడమోరు, డికె, నాని
దర్శకత్వం: సిరాజ్‌ కల్లా
విడుదల తేదీ: 25 డిసెంబర్‌ 2013

క్లుప్తంగా చెప్పాలంటే:
రాజీవ్‌ (సందీప్‌ కిషన్‌), విక్కీ (వరుణ్‌ సందేశ్‌), రవి (నవీన్‌), చందు (రాకేష్‌) నలుగురు ఫ్రెండ్స్‌. ఈ నలుగురికీ విభిన్నమైన సమస్యలు. కానీ అందరి సమస్యలకీ పరిష్కారం దొరికేది డబ్బు కోసమే. ఆ డబ్బు సంపాదించడం కోసం బ్యాంక్‌ని లూటీ చేయడానికి స్కెచ్‌ వేస్తారు. బ్యాంక్‌ లూటీ చేయడానికి వీరు ప్రయత్నించిన సమయంలోనే, వేరే గ్యాంగ్‌ (తనికెళ్ళ భరణి తదితరులు) ఆ బ్యాంక్‌ని లూటీకి ప్రయత్నిస్తుంది. ఆ టైమ్‌లో విక్కీ లవర్‌ (మెలనీ) ఆ బ్యాంక్‌లోనే వుంటుంది. విక్కీ గ్యాంగ్‌ లూటీ స్కెచ్‌ వర్కవుటయ్యిందా? తనికెళ్ళ గ్యాంగ్‌ షాకిచ్చిందా? అనేది మిగతా కథ. అది తెరపైనే చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
నలుగురు హీరోల్లో ఎవరికీ పెద్దగా నటించేందుకు స్కోప్‌ దక్కలేదు. తనకు ఇచ్చిన పాత్ర వరకూ ఓకే అన్పించాడు సందీప్‌ కిషన్‌. వరుణ్‌ సందేశ్‌ మామూలే. నవీన్‌ ఓకే. రాకేష్‌ కాసిని నవ్వులు తెప్పించాడు. మెలనీ గ్లామరస్‌గా కన్పించింది. తనికెళ్ళ భరణి, హేమ తదితరులు తమ పాత్రల వరకూ ఓకే అన్పించారు.

డైలాగ్స్‌ ఏమంత గొప్పగా లేవు. కథలో ట్విస్ట్‌లు బాగానే వున్నా, స్క్రీన్‌ప్లే ఇంకాస్త బెటర్‌గా వుండాల్సింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. సినిమాలో పాటలేమీ లేవు. సినిమాటోగ్రఫీ ఓకే. సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌ విభాగం ఇంకాస్త బెటర్‌గా పనిచేసి వుంటే బావుండేది. అందరూ యువ హీరోలు కావడంతో కాస్ట్యూమ్స్‌ని ట్రెండీగా ప్లాన్‌ చేశారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాని సహజంగా వుండేలా చేయగలిగింది. 
సీరియస్‌ సబ్జెక్ట్స్‌ అయినా, ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించడం అనేది కొత్త ట్రెండ్‌. ఆ ట్రెండ్‌ని చాలా వరకు చిన్న సినిమాలు ఫాలో అవుతున్నాయి.

ఈ సినిమా విషయానికొస్తే మంచి పొటెన్షియాలిటీ వున్న సబ్జెక్ట్‌ ఇది. ఫస్టాఫ్‌లో స్టోరీని బాగా బిల్డప్‌ చేశారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ బావుంది. సినిమాపై ఆసక్తిని పెంచింది. సెకెండాఫ్‌లో మాత్రం సినిమా నెమ్మదించింది. ఎనర్జీ లెవెల్స్‌ తగ్గిపోయినట్లుగా అన్పిస్తుంది. మొత్తంగా సినిమా ఓకే అన్పిస్తుంది. ఇంకాస్త గ్రిప్పింగ్‌గా వుంటే రిజల్ట్‌ ఇంకా బెటర్‌గా వుండేది. యావరేజ్‌ టాక్‌ విన్పిస్తున్నా, మౌత్‌ టాక్‌ బాగా స్ప్రెడ్‌ అయితే సినిమాకి చెప్పుకోదగ్గ విజయం దక్కొచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే: ప్రామిసింగ్‌ సబ్జెక్ట్‌ బట్‌ పాసబుల్‌ ఎంటర్‌టైనర్‌

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Cartoonist Bannu