Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Mohanbabu without Makeup

ఈ సంచికలో >> సినిమా >>

బాపు బొమ్మ అంటే అంతే మరి

That is Bapu bomma

హిట్టొస్తే హీరోయిన్ల రేంజ్‌ పెరిగిపోవడం సహజం. పవన్‌కళ్యాణ్‌తో నటించి, ఆ సినిమా హిట్టయితే ఆ హీరోయిన్‌కి వచ్చే క్రేజ్‌ ఇంకా అమోఘంగా ఉంటుంది. ఆ సక్సెస్‌ని ఏ హీరోయిన్‌ అయినా గొప్పగానే ఎంజాయ్‌ చేస్తుంది. హీరోయిన్‌ ప్రణీత కూడా అంతే. ఫ్లాప్‌ హీరోయిన్‌ అని ‘అత్తారింటికి దారేది’ ముందు ప్రణీత గురించి తెలుగులో అందరూ అనుకున్నారు.

కాని ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆమె దశ మార్చేసింది. ఆ సినిమా తర్వాత ప్రణీత మార్కెట్‌ వాల్యూ పెరిగింది. సినిమా రెమ్యునరేషన్‌ పెరగడంతోపాటు, ఆమె బ్రాండ్‌ వాల్యూ కూడా పెరిగింది. అలా పెరిగిన బ్రాండ్‌ వాల్యూతో, వరుసగా షోరూంలకు రిబ్బన్‌ కటింగులు చేస్తూ వెళ్తోంది ప్రణీత.

ఒకటి తర్వాత ఇంకొకటి, షోరూంల నుంచి ఆఫర్స్‌ వస్తోంటే ప్రణీత ఆనందానికి అవధులు వుండడంలేదు. భారీ మొత్తంలో ఆమెకు చెల్లించుకుంటున్నాయి వివిధ సంస్థలు. ‘అత్తారింటికి దారేది’ హీరోయిన్‌గా పెరిగిన గుర్తింపుతో, ఆమెకు అభిమానులూ పెద్ద సంఖ్యలో తయారయ్యారు. ‘అమ్మో.. బాపుగారి బొమ్మా..’ అని పవన్‌ ఓ పాటలో ఆమెను వర్ణించడం మాటెలా వున్నా, ఈ బాపుగారి బొమ్మ మిగతా హీరోయిన్లకన్నా రిబ్బన్‌ కటింగుల్లో బిజీ అయిపోవడంతో అందరూ అమ్మో అని ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
Prakash Raj Direction