Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anubandhalu telugu serial thirty fourth Part

ఈ సంచికలో >> సీరియల్స్

దురదృష్టపు దొంగలు

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే సీరియల్ ఇది.

లాస్ ఏంజెలెస్ పోలీసులు ఓ స్టోర్ లో తుపాకి చూపించి దొంగతనం చేసిన నేరానికి కొందరు అనుమానితులని సాక్షులముందు ప్రవేశపెట్టారు. ఆ దొంగ మాట్లాడిన 'గివ్ మి యువర్ మనీ ఆర్ ఐ విల్ షూట్' అనే మాటలని మాట్లాడమని ఆ అనుమానితులతో చెప్తే వాళ్ళల్లోని దొంగ 'నేనన్న మాటలవి కావు' అని తర్వాత నాలిక్కరుచుకున్నాడు.



న్యూయార్క్ లోని క్వీన్స్ బరో అనేచోట ఓ బేంక్ దొంగతనానికి ఇద్దరు దొంగలు వెళ్ళారు. తుపాకీ చూపించి దొంగతనం చేసాక, వాళ్ళిద్దరిలో ఓ దొంగ ఎందుకనో మనసు మార్చుకుని, రెండవ దొంగకి పిస్తోలు గురిపెట్టి పోలీసులకి ఫోన్ చేశాడు!

 

మరిన్ని సీరియల్స్