Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

దురదృష్టపు దొంగలు

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే సీరియల్ ఇది.

ఓ బేంక్ లో దొంగతనం చేసిన నేరానికి క్రిస్టిఫర్ అనే అనుమానితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ, ముద్దాయి తుపాకిని కేషియర్ కి చూపించక పోయినా అతని కోటు జేబులో పిస్తోలు ఉన్నట్లుగా ఆ జేబు ఎత్తుగా కనబడటంతో అతనికి కేషియర్ డబ్బుని ఇచ్చాడని చెప్పాడు.

"నాన్ సెన్స్. నా క్లయింట్ అదే కోటుని ధరించాడు. ఆ జేబు ఇప్పుడు కూడా ఎత్తుగా వుంది. అంటే నా క్లయింట్ కోర్టుకి దొంగతనానికి వచ్చినట్లా?" అడిగాడు డిఫెన్స్ లాయర్.

జడ్జి ఆ కోటు విప్పి ఇవ్వమని అడిగితే క్రిస్టిఫర్ విప్పి ఇచ్చాడు. చూస్తే ఆ జేబులో పిస్తోలు వుంది!


 

అమెరికాలోని విన్ కాన్ సిన్ సుప్రీం కోర్టు డేవిడ్ ఓక్లే అనే 54 ఏళ్ళ దొంగకి 'ఇంక పిల్లల్ని కనకూడదు' అన్న శిక్షని విధించింది. అతను గత 32 ఏళ్ళుగా తన పిల్లల్ని పోషించుకోడానికే దొంగతనాలు చేస్తున్నాడు. అతనికి 9 మంది పిల్లలు! (అది తన రాజ్యాంగ హక్కుకే విరుద్ధమని డేవిడ్ పై కోర్టుకి ఎక్కాడు.)

 

మరిన్ని సీరియల్స్
Agent Ekamber Introduction