Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kittugadu inter fail ias pass

ఈ సంచికలో >> సీరియల్స్

దురదృష్టపు దొంగలు

duradrushtapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే సీరియల్ ఇది.

జర్మనీలోని హేన్నోవర్ కి చెందిన 22 ఏళ్ళ క్రిస్టఫర్ ని అనేక దొంగతనాలకి సంబంధించిన కేసుల్లో అరెస్ట్ చేయడానికి పోలీసులు అతనింటికి వెళ్తే, వారి రాకని గ్రహించి అతను తప్పించుకున్నాడు. ఆ పోలీసుల్లో తెలివైన ఓ పోలీసు క్రిస్టఫర్ పెంపుడు కుక్కనే ఉపయోగించి క్రిస్టఫర్ ఎక్కడ దాక్కున్నాడో కనిపెట్టాడు. అతని కుక్కని కట్టిన గొలుసుని విప్పితే, ఆ 'అమెరికన్ స్టఫోర్డ్ స్టర్ బాల్ టెర్రియస్' జాతికి చెందిన కుక్క పక్కింటి తోటలో దాక్కున్న తన యజమాని దగ్గరికి పరుగెత్తింది. క్రిస్టఫర్ ని పోలీసులు అరెస్ట్ చేసారు.


పార్క్ చేసి ఉన్న ఓ కారు తాళాన్ని మారు తాళం చెవితో తీసి లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్న ఓ దొంగ, తనపని అయ్యాక కారు తలుపుని లోపలనించి తీయలేకపోయాడు. దాన్ని తాళం చెవితో మళ్ళీ బయటనించి తీస్తే కాని తెరచుకోని విధంగా ఆకారు తలుపులు డిజైన్ చేసి ఉన్నాయి. అలా లోపల చిక్కుబడ్డ అతను దాహానికి తలుపులు బాదితే, ఆ పార్కింగ్ కార్ సెక్యూరిటీ వాడు పోలీసులని పిలిచాడు. కేలిఫోర్నియాలోని ఫ్రెస్నో అనే ఊళ్ళో జరిగిందిది.

 

మరిన్ని సీరియల్స్
agent ekamber