Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
hit combination

ఈ సంచికలో >> సినిమా >>

‘చదువుకున్న అమ్మాయిలు’తో తొలిసారి

chaduvukunna ammayilu to tolisari

హైదరాబాద్‌లోని రవీంద్రభారతి గురించి రాష్ట్రంలో తెలియనివారెవరూ వుండరు. అసెంబ్లీ పక్కన వుండే రవీంద్రభారతి, కళాభిమానులకి దేవాలయం లాంటిది. రాష్ట్రంలోని నలు మూలలనుంచీ వచ్చేవారు చార్మినార్‌, హైటెక్‌సిటీ వంటి ప్రముఖ కట్టడాలను చూసేందుకు ఎలా ఇష్టపడ్తారో, రవీంద్రభారతి కూడా అంతే.

ఆ రవీంద్ర భారతి ఫొటోనే ఇది. 1961లో ఈ కట్టడాన్ని నిర్మించారు. 1962లో ఇక్కడే ఓ తెలుగు సినిమా షూటింగ్‌ జరిగింది. అదే ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమా. అన్నపూర్ణా బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు నటించారు. అప్పట్లో తెలుగు సినిమాలు హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకోవడం చాలా అరుదు.

అక్కినేని వంటి కొందరు మాత్రమే తెలుగు గడ్డపై సినిమా షూటింగులను ఎంకరేజ్‌ చేసి, తద్వారా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడేందుకు కృషి చేశారు. అలనాటి ఈ ఫొటో ఇప్పుడు అపురూపమైనది.

మరిన్ని సినిమా కబుర్లు
anr old movie thats only