Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kukkeyadam... anabade over loading...

ఈ సంచికలో >> శీర్షికలు >>

గోశాల - బన్ను

గోశాలకి రమ్మని నా మిత్రులు పిలిస్తే నాకర్ధం కాలేదు . 'గోశాల' అంటే ఏమిటని అడిగాను. 'అక్కడ చాలా ఆవులుంటాయని... అందులో పాలివ్వనివి... ఇలా చాలా రకాలుంటాయని ' చెప్పారు. నిజమే ! పాలిచ్చే ఆవులకే గడ్డి వేస్తారు. పాపం అలాంటి ఆవులకి ఎవరూ ఏమీ పెట్టరు. కొన్ని అరటిపళ్ళు, తోటకూర ఇంకా పశుగ్రాసం తీసుకుని వెళ్ళాము. మేము తీసుకెళ్ళిన వాటిని ఆ గోవులకి తినిపిస్తుంటే... ఎంతో కృతజ్ఞతా భావంతో చూస్తూ తిన్నాయి.

అన్నిటికన్నా 'గోసేవ' మంచిది. ఆవు సాధు జంతువు. మేము వెళ్ళిన 'గోశాల' లో సరిగ్గా సాయంత్రం 6 గం॥ లకి ఆవుల్ని వదులుతారు. బయట గడ్డి వేస్తారు. ఆవులన్నీ పరిగెడుతూ వెళ్లి ఆ గడ్డి తింటాయి. ఆవులు పరిగెత్తేటప్పుడు రేగే ధూళిని 'గోధూళి' అంటారు. అది మనకి తగిలితే మంచిదని ఓ నమ్మకం!! 'గోధూళి' మనల్ని తాకితే ఆయుష్షు పెరుగుతుందని కూడా అంటారు. మనం అక్కడ నుంచున్నా కూడా ఆవులు మనదగ్గరికి రావు. నరదిష్టి తగిలితే మాపరాయి కూడా ముక్కలవుతుందని హిందూ సంప్రదాయాలలో ఉన్న విశ్వాసం. ఎంతటి దుష్ప్రభవాన్ని కలిగించే దిష్టినైనా తియ్యగలిగేది ముగ్గురే. మొదటిది కన్నతల్లి, మిగతావి గోమాత, భూమాత. కావాలంటే మీరీ క్రింది వీడియో చూడవచ్చు. జై 'గోమాత '... జై 'గోతెలుగు'

మరిన్ని శీర్షికలు
Room No:216