Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with Amala Paul

ఈ సంచికలో >> సినిమా >>

మధుర శ్రీధర్ దర్శకత్వంలో 'నేను సచిన్ కాదు'

I AM NOT SACHIN

స్నేహగీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ వంటి యువతరం మెచ్చే చిత్రాలను సరికొత్త కథాంశాలతో అందించిన దర్శకుడు మధుర శ్రీధర్ తన తదుపరి చిత్రంగా 'ఐ యామ్ నాట్ సచిన్ (ట్యాగ్ లైన్: నేను సచిన్ కాదు)ను తన దర్శకత్వంలో అందిస్తున్నారు. మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై. లి సమర్పణలో షిర్డీ సాయి కంబైన్స్ పతాకంపై ఎమ్.వి.కె.రెడ్డి నిర్మించబోయే ఈ చిత్రం మే నెలలో ప్రారంభమవుతుంది.

ఈ సందర్భంగా మధుర శ్రీధర్ చిత్ర విశేషాలు తెలుపుతూ...

ప్రస్తుతం యువతరం ఆదరిస్తున్న 20-20 క్రికెట్ లో అత్యున్నత ప్రదర్శనతో హీరోగా ఎదిగి, డబ్బు మరియు గ్లామర్ పై వ్యామోహంతో బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని 'జీరో' అయిన ఓ మధ్య తరగతి కుర్రాడి కథ ఇది. మానవ సంబంధాలతో ప్రేమ, నమ్మకం, నైతిక, విలువల ప్రాధాన్యతను తెలిపే విధంగా ఈ చిత్రం ఉంటుంది. బి.వి.ఎస్. ప్రకాష్ రచన చేస్తున్న ఈ చిత్రం నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తాం అని మధుర శ్రీధర్ తెలిపారు.

మరిన్ని సినిమా కబుర్లు
Aam Aadmi cinema