Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
telugulo kaadu, hindilo

ఈ సంచికలో >> సినిమా >>

నక్షత్ర యుద్ధం

nakshatra yuddham

ఇదేదో కొత్త సినిమా టైటిల్‌ అనుకునేరు. నక్షత్ర యుద్ధం అంటే స్టార్‌ వార్‌ అని. రాజకీయాల్లో సినిమా గ్లామర్‌ పెరగడంతో రాజకీయాలపై సామాన్యుల్లో ఆసక్తి పెరిగింది. సినిమాలకన్నా రాజకీయాల గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారిప్పుడు. మన రాష్ట్రంలోనే కాక, దేశమంతటా వివిధ రాష్ట్రాల్లో సినిమా వారు ఎక్కువగానే రాజకీయాల్లోకి వచ్చారు.

చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీలో వున్నారు. పవన్‌కళ్యాణ్‌ కొత్త పార్టీ పెట్టారు. నాగార్జున ` నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతుండగా, సినీ నటి రోజా ` వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. మురళీమోహన్‌ది తెలుగుదేశం పార్టీ. తెలుగులోనే చాలా ఎక్కువమంది ఈసారి రాజకీయాలలో వున్నారు. తమిళ రాజకీయాల్లోనూ, దేశ రాజకీయాల్లోనూ సినిమా వారు ఎక్కువగానే కనిపిస్తున్నారు.

రాజకీయాల్లోకి వెళుతున్న సినిమా వారిలో కొందరు ప్రచారానికే పరిమితమవుతారు, మరికొందరు ఎన్నికలలో పోటీ చేస్తారు. అయితే ఎంతమంది విజయం సాధిస్తారు? అంటే ఇప్పుడే చెప్పలేం. నటి రమ్య కర్నాటక నుంచి ఇటీవలే ఎంపీగా గెలిచారు. రక్షిత కూడా రాజకీయాలలో వున్నారు. హేమమాలిని, జయప్రద, జయసుధ వంటివారూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇలా స్టార్‌ వార్‌ అనగా నక్షత్ర యుద్ధం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని సినిమా కబుర్లు
hindi serial actress hawa